Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీ సంతకాన్ని బట్టి మీరు ఎలాంటివారో చెప్పేయొచ్చు! ఈ విధంగా సంతకం చేసే వాళ్ళు గొప్పవాళ్లు అవుతారు
ఒక వ్యక్తి లక్షణాలు, ప్రవర్తన, భావోద్వేగాలు అలాగే భవిష్యత్తును గుర్తించడానికి, తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాశి ఫలాలు, జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ, చేతి రేఖలు ఇలా ఎన్నో రకాల పద్ధతుల్లో మనిషి యొక్క లక్షణాలు అతని గుణగణాలు, అతని భవిష్యత్తును నిర్ధారిస్తారు. వీటిని నమ్మే వ్యక్తులు ఉన్నారు, ఇవంతా మూఢనమ్మకం అని కొట్టిపారేసే వ్యక్తులు కొద ఉన్నారు. అయితే వీటితో పాటు మనిషి చేతి రాత, మనిషి సంతకం చేసే విధానం ద్వారా కూడా ఆ మనిషి ఎలాంటి వ్యక్తి?, అతనిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి అనేది తెలిసిపోతుందట.
మనం సంతకం చేసేటప్పుడు లేదా ఏదైనా విషయాల గురించి రాసేటప్పుడు ఒకేవిధంగా రాస్తుంటాం. మన చేతి రాత అలానే ఉంటుంది, సంతకం పెట్టె విధానం కూడా అలానే ఉంటుంది. సంతకాలు ఒకేలా పెట్టడం, చేతిరాత కూడా ఒకేలా ఉండే విధానాన్ని బట్టి మనిషి లక్షణాలు, గుణాలు ఏంటో తెలుసుకోవచ్చు. అసలు సంతకంతో మనిషి లక్షణాలు ఏ విధంగా తెలుసుకోవాలి, దానికి ఏ విధమైన అధ్యయనాన్ని వినియోగిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏ విధంగా సంతకంతో మనిషి గుణాలు చెప్తారంటే?
మనిషి పెట్టె సంతకం ఎలా ఉంది? ఏ విధంగా ఉండబోతుంది అనే విశ్లేషించడానికి కార్టోగ్రఫీ అనే అధ్యయన రంగం కూడా ఉంది. ఇది మనిషి చేసే సంతకాన్ని విశ్లేషిస్తుంది. తద్వారా ఆ సంతకం చేసిన వ్యక్తి లక్షణాలను వివరిస్తుంది. ఈ సంతకాన్ని విశ్లేషించడానికి సంతకం పరిమాణం, ఆకారం, అక్షరాల మధ్య ఖాళీ, వారి నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకొని సంతకాన్ని విశ్లేషిస్తారు. ఇక్కడ కొన్ని రకాల సంతకాలు గురించి వివరించాము చూడండి..
పెద్దగా లేదా బోల్డ్‌గా రాసేవారు..
మీరు సాధారణంగానే పెద్దగా, బోల్డ్‌గా రాయడం లేదా పెద్దగా సంతకం చేసే అలవాటు ఉన్నట్లయితే, మీకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చాలా ధైర్యవంతులై ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు నిరాశపడరు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నిటినీ దాటుకొని మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ పనిలో మీరు చాలా నిబద్ధతో ఉంటారు. వ్యక్తిగత సంబంధాల కంటే, వ్యాపారాన్నే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
సంతకం కింద అండర్లైన్ చేస్తున్నట్లైతే..
మీకు సంతకం కింద అండర్లైన్ చేస్తున్నట్లైతే ఆ అలవాటు మీకు ఉంటే మీరు ఎప్పుడూ సమాజంలో ముఖ్యమైన సభ్యునిగా ఉండాలని అనుకుంటారు. అన్ని విషయాల్లో తమపై తమకు గట్టి నమ్మకం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా లక్ష్యాన్ని వదలరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్య సాధన చేస్తారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా అండర్ లైన్స్ వేస్తున్నట్లైతే.. మీపై మీకు విశ్వాసం లేదని అర్ధం చేసుకోవాలి. ఒక విషయంపై ఇతర వ్యక్తులను ఆశ్రయిస్తారని అర్ధం.
అస్పష్టమైన సంతకం చేస్తే..
ఎవరికీ అర్థంకాని విధంగా సంతకం చేస్తుంటే మీది చాలా తొందరపాటు వ్యక్తిత్వం అని అర్ధం చేసుకోవాలి. తమ సామర్థ్యంపై తమకు నమ్మకం ఎక్కువగా అని దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలి. అలాగే తాము ఎలాంటి పనుల్లోనైనా విజయాన్ని సాధిస్తామనే ధీమా ఉంటుంది. ఈ వ్యక్తులు ఎవరికీ అంత సులభంగా అర్థంకారు. లాగే ఈ వ్యక్తుల్లో ఎక్కువ నైపుణ్యాలు దాగి ఉంటాయని అర్ధం.



Click it and Unblock the Notifications