Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జపాన్‌లో భర్తలకు పాకెట్ మనీ ఇస్తున్న భార్యలు.. అదే కోజుకై సంస్కృతి..!!
సాధారణంగా భర్తలు తాము సంపాదించిన కష్టార్జితాన్ని భార్యల చేతుల్లో పెడుతుంటారు. కాకపోతే తమ ఖర్చులకు కావాల్సిన కొంత డబ్బు తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఖర్చులకు, భార్యలకు ఇస్తారు. ఈ సంప్రదాయం ఒక్క భారత్‌లోనే కాదు, కొన్ని తరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి సంపాదిస్తే తమ పాకెట్‌మనీ కోసం కొంత డబ్బు తీసుకుని మిగిలింది. ఇంటి ఖర్చులకు కేటాయిస్తారు. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. అయితే జపాన్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఒక ఆచారం కొనసాగుతోంది. ఆ దేశంలో భర్తలు సంపాదించే మొత్తాన్ని భార్యల చేతలో పెడతారు. అందులో సేవింగ్ సహా ఇంటి ఖర్చులకు డబ్బులను పక్కన పెట్టేసి కొంత మొత్తాన్ని పాకెట్ మనీగా భర్తలకు భార్యలు ఇస్తారు.

భార్యలు ఎంత డబ్బు ఇస్తారు. అంతే మొత్తాన్ని భర్తలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. జపాన్‌లో ఈ సంప్రదాయాన్ని అక్కడ కోజుకై అని పిలుస్తుంటారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును ఆదా చేయడం కోసమే ఈ పద్ధతిని వాళ్లు అనుసరిస్తున్నారు. దీని ద్వారా భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందనేది వారి నమ్మకం. ఓ నివేదిక ప్రకారం జపాన్‌లో 74 మంది మహిళలు ఓవైపు ఇంటిపనులు చూసుకుంటూ మరోవైపు డబ్బులు ఆదా చేస్తున్నారు. భర్త ఖర్చులను అదుపు చేసేందుకు అక్కడి భార్యలు, మరికొన్ని పద్ధతులు కూడా ఫాలో అవుతుంటారని తెలుస్తోంది.
తాను ప్రతి నెలా తన కష్టార్జితాన్ని భార్యకు ఇచ్చానని, అందులో నుంచి అన్ని ఖర్చులు పోగా కొంత మొత్తాన్ని భార్య తనకు పాకెట్ మనీ ఇస్తుందనిను జాబ్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. అనవసరమైన ఖర్చులను అరికట్టడంతోపాటు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. ఈ పద్ధతిని అనుసరించటం వల్ల ఇప్పుడు తన పాకెట్ మనీ కూడా బాగా పెరిగిందని చెప్పాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తమకు పెళ్లయినప్పటి నుంచే ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతను తాను తీసుకున్నానని అతని భార్య తెలిపింది. జపాన్ లో అనుసరిస్తున్న కోజుకై సాంప్రదాయం బాగుందని కొంతమంది అంటున్నారు.
మగాళ్లు తమ పాకెట్‌మనీ పరిమితం చేసుకోవడం, ఇంటి ఖర్చులు తగ్గించుకోవడం వంటి పద్ధతులు పాటిస్తే అనవసరమైన ఖర్చులు అనేవి బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. చిన్నా చితక ఖర్చు కూడా భారీ దగ్గర చేయి చాచాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా లో ఎక్కువగా భర్తలదే భార్యలపై పెత్తనం అయినప్పటికీ ఇలా అన్నింటికి భార్య దగ్గర చేతులు చాచడం అస్సలు వర్కౌట్ కాదని అంటున్నారు.



Click it and Unblock the Notifications