Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కుమారి ఆంటీ 2.0: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్..కోట్ల సంపాదన!
ఈ రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అది కూడా గచ్చిబౌలి లాంటి హైటెక్ ఏరియాలో మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ అంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు మంచి శాలరీ ఉంటుంది, 5 రోజులే పని, సొంతిల్లు, సొంత కారు కల నెరవేర్చుకోవచ్చని సంతోషపడతారు. అయితే ఓ యువతి మాత్రం ఇలాంటి అవకాశం ఉన్నా ఏసీలో కూర్చొని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఫుడ్ బిజినెస్ లోకి దిగింది.
శిరీష అనే యువతి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం మొదలుపెట్టింది. ఫుడ్ బిజినెస్ లో రావడం మొదలైతే దీనంత ఆదాయం ఎందులోనూ ఉందంటున్నారు శిరీష. సాఫ్ట్ వేర్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా శిరీష ప్రయాణాన్ని ఓ సారి ఇప్పుడు చూద్దాం.
అమ్మకు కూడా తెలియకుండా
బీబెట్ చదివిన శిరీష అనే యువతి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐదేళ్లకు పైనే ఉద్యోగం చేసింది. అయితే మార్కెట్ లో ప్రతి దాని ధర పెరుగుతూ పోతుంది కానీ శిరీష జీతం మాత్రం పెరగడం లేదు. సాఫ్ట్ వేర్ లో నెల సంపాదన మీద ఆధారపడాల్సి వస్తుందని, అలాగే లేఆఫ్స్ ఇవన్నీ ఉంటాయని అదే బిజినెస్ లో అయితే తాను డబ్బులు సంపాదించడమే కాకుండా నలుగురికి పని కూడా కల్పించవచ్చు అనే ఆశతో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలిపింది. తాను స్ట్రీట్ పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నట్లు తన తల్లికి కూడా తెలియదని శిరీష చెబుతుంది. తాను హోటల్ మాత్రమే నడుపుతున్నానని తన తల్లికి తెలుసు అని, దీని గురించి మాత్రం అస్సలు తెలియదని చెప్పింది. తనకు వ్యాపారం చేయడమే ఇష్టమని తెలిపింది.

ఏ ఏరియాలో అమ్ముతుంది
హైదరాబాద్ లో రాయదుర్గం మెట్రో దాటిన తర్వాత ఐకియా స్టోర్ పక్క గల్లీలో మై హోమ్ అపార్ట్ మెంట్స్ దగ్గర్లో రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముతోంది. టీ హబ్ దగ్గర్లో ఇది ఉంటుంది.
సొంత హోటల్
గాయత్రి నగర్ లో తమకు సొంత టిఫిన్ సెంటర్ ఉందని, అక్కడే తన స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించిన రైస్,కర్రీ ఐటమ్స్ ప్రిపేర్ అవుతుంటాయని శిరీష తెలిపింది. తాను గాయత్రి నగర్ లోని టిఫిన్ సెంటర్ ని నడుపుతున్న విషయం మాత్రమే తన తల్లికి తెలుసునని, స్ట్రీట్ ఫుడ్ గురించి వారికి తాను చెప్పలేదని, స్ట్రీట్ ఫుడ్ అంటే వాళ్లు ఏమనుకుంటారో అని చెప్పలేదని శిరీష్ తెలిపింది.
స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్,ఏమేం వెరైటీలు ఉంటాయి
తాను దాదాపు రెండు నెలల క్రితం ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశానని శిరీష తెలిపింది. తన దగ్గరకు రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారని,ఆదాయం కూడా బాగానే ఉంటుందని శిరీష తెలిపింది. తన దగ్గర వెజ్,నానె వెజ్ రెండూ వెరైటీలు ఉంటాయని తెలిపింది. నాన్ వెజ్ లో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ,లివర్,బోటీ,ఫిష్ వెరైటీలు ఉన్నాయని తెలిపింది. ఉదయాన్నే 11 గంట నుంచి అమ్మడం స్టార్ట్ చేస్తామని శిరీష చెప్పింది.
ధరలు ఎలా
వెజ్ రైస్ అన్ లిమిటెడ్ అయితే రూ.80..నాన్ వెజ్ అయితే రూ.110 ఉంటుందని తెలిపింది. అయితే నావ్ వెజ్ కర్రీలు రెండోసారి పెట్టించుకుంటే ఎక్స్ ట్రా మనీ ఉంటందని శిరీష తెలిపింది. వెజ్ లో అయితే కర్రీలు ఎన్నిసార్లు వడ్డించినా రూ.80 మాత్రమేనని తెలిపింది.
నలుగురికి ఉపాధి
తమ దగ్గర వంట మాస్టారు,మరో ఇద్దరు వర్కర్లు ఉన్నారని మొత్తం ముగ్గురికి తన ద్వారా ఉపాధి లభించిందని తెలిపింది శిరీష. తన వల్ల ముగ్గురికి ఉపాధి లభించడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపింది.
బిజినెస్ లో ఉండే రిస్క్ లపై
ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటుంది కానీ గేమ్ ని ఆడటం ఎలానో తెలిస్తే దున్నేయొచ్చని తెలిపింది. ఈ ఫుడ్ బిజినెస్ మొత్తం వంట మాస్టర్ మీదనే అంతా ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఆయన లీవ్ లో ఉన్నా లేదా ఆరోగ్యం బాలేకున్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని శిరీష తెలిపింది. అయితే రావడం స్టార్ట్ అయితే ఇందులో ఉండే ఆదాయం మరెందులోనూ ఉండదని తెలిపింది.
ఆదివారం సెలవు
వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమేనని శిరీష తెలిపింది. పర్శనల్ లైఫ్ కోసం ఆదివారం కేటాయించుకున్నానని,ఆదివారం వ్యాపారం చేయనని తెలిపింది.
సోషల్ మీడియాలో అభినందనలు
శిరీష స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చూసిన చాలామంది నెటిజన్లు ఈమె భవిష్యత్తులో కోట్లు సంపాదిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కుమారీ 2.0 అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. జాబ్ వదిలి ఇలా వ్యాపారం చేస్తేనే కోట్లు సంపాదించవచ్చు అని శిరీషకు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ లు,కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications