Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్!
Dead end road: భూమిపై చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? అక్కడ భూమి,ఆకాశం కలుస్తాయట!
ప్రపంచం నలుమూలల రోడ్లు ఉంటాయి. అయితే భూమిపై చిట్ట చివరి రోడ్డు ఎక్కడుంది,ఆ తర్వాత ఏముంటుందనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? భూమి గుండ్రంగా ఉంది,దీనికి ప్రారంభం, ముగింపు లేదని చెబుతుంటారు. అయితే జియాలజిస్టుల ప్రకారం భూమికి నిజంగా 'ముగింపు' ఉంది. అక్కడ భూమి,ఆకాశం రెండూ కలుస్తాయంట. భూమిపై రోడ్డు ఎండ్ ఎక్కడ ఉంది, ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోని చివరి రహదారి
భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధృవం అనే రెండు ధృవాలు ఉన్నాయి. ఇవి భూగ్రహం మీద అత్యంత శీతల ప్రదేశాలు, అందుకే ఈ ప్రాంతాలలో నాగరికత లేదని చెబుతుంటారు. జియాలజిస్టు ప్రకారం భూమి అంచు ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూమధ్య రేఖకు ఎగువన ఉంటుంది. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా ఉన్నందున నార్వేను భూమిపై చివరి దేశం అని పిలుస్తారు. నార్వేలోని E-69 రహదారిని ప్రపంచంలోని చివరి రహదారి అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రయాణీకులను ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా తీసుకువెళుతుంది.
ఈ రహదారి ఉత్తర ఐరోపాలోని నార్డ్ కాప్ ను నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్ గ్రామంతో కలుపుతుంది. ఈ దారి పొడవు 129 కిలోమీటర్లు. ఈ మార్గం ఐదు సొరంగాల ద్వారా వెళ్తుంది. వీటిలో పొడవైన సొరంగం నార్త్ కేప్. దీని పొడవు 6.9 కిలోమీటర్లు. ఇది సముద్రమట్టానికి 212 మీటర్ల దిగువకు ఉంటుంది. దీనినే చివరి రహదారిగా పిలుస్తున్నారు.

అనుమతి ఉంటేనే
1934లో E-69 రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది. 1992లో నిర్మాణం పూర్తయింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా,వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ఒంటరిగా వెళ్లడం,డ్రైవింగ్ చేయడం నిషేధించబడింది. ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వేసవిలో కూడా ఇక్కడ మంచు కురుస్తుంది. ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు, రెయిన్ డీర్లు కనిపిస్తుంటాయి. ఈ రోడ్డు చివరకి వెళ్తే చివరకి సముద్రం కనబడుతుంది.
చర్చి,మ్యూజియం
ఈ రోడ్డు చివర ఓ సొరంగం కూడా ఉంది. దీన్ని సముద్రంలో నిర్మించారు. ఇది మెగెరోయా అనే ఐలాండ్ ని కలుపుతుంది. ఈ రహదారి చివరి దగ్గర భూమిలోపల ఒక చర్చి, మ్యూజియం కూడా ఉన్నాయి. ఈ రోడ్డుపై ఎన్ని కండీషన్లు ఉన్నా రోజూ చాలా మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు అక్కడికి అనుమతితో వెళ్తుంటారు. చలికాలంలో ఇక్కడికి వెళ్లే వారు అరోరాలను చూడగలరు. సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులు ఆకాశంలో గ్రీన్, పింక్ కలర్స్ లాగా కనిపిస్తాయి. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
అర్ధరాత్రి సూర్యుడు
నార్వే భూమిపై ఉన్న ఉత్తరాన ఉన్న దేశాలలో అత్యంత ప్రత్యేకమైనది. ఇది ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుది. నార్వేలో పగలు-రాత్రి చక్రం సీజన్, ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది, వేసవిలో ఎక్కువ రోజులు.. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో రాత్రంతా సూర్యుడు ఉంటాడు. శీతాకాలంలో ఉత్తర నార్వే ధ్రువ రాత్రిని అనుభవిస్తుంది, ఈ సమయంలో సూర్యుడు వారాలపాటు హోరిజోన్ క్రింద ఉంటాడు. ఉత్తర నార్వేలో సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు, రాత్రంతా ఆకాశంలో చూడవచ్చు. దీనిని పోలార్ డే,నైట్‌లెస్ నైట్,వైట్ నైట్ అని పిలుస్తారు.



Click it and Unblock the Notifications