Latest Updates
-
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.!
Richest Persons : ధనవంతుల జాబితాలో పడిపోయిన మస్క్..కనిపించని అంబానీ..
ధనం ఎప్పటికీ శాశ్వతం కాదంటారు, లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒకచోట ఉండదని కూడా అంటారు. అందుకేనేమో ప్రతీ ఏడాది ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా మారుతూనే ఉంటుంది. బిల్‌గేస్ట్ గత మూడు దశాబ్దాలుగా టాప్ టెన్ రిచ్చెస్ట్, అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నా ఆయన కూడా క్రమంగా దిగజారి 9వస్థానానికి చేరుకున్నారు. ప్రపంచం కుబేరుల లిస్టును ప్రకటించే ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా మే 2024 మైగజైన్‌లో లేటెస్ట్ ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో టాప్‌లో ఉన్న ఎలాన్ మస్క్ మూడవ జాబితాకు చేరుకున్నారు. ఇక రెండవ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజాస్, మొదటి స్థానంలో లగ్జరీ వస్తువుల వ్యాపార దిగ్గజం ఎల్‌వీఎమ్ఎచ్ సీఈవో బెర్నార్డ్ అర్‌నౌల్ట్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
టాప్ స్థానంలో బిర్నార్డ్ అర్‌నౌల్ట్
తాజాగా విడులైన జాబితాలో ఎల్‌వీఎమ్‌హెచ్ సంస్థ చైర్మన్ బెర్నార్డ్ అర్‌నౌల్ట్, టెస్లా ఫౌండర్‌ను దాటి అత్యంత ధనవంతుడిగా నిలబడ్డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత ధనవంతుల పది మంది జాబితాలో గతంలో 9వ స్థానంలో ఉన్న అంబానీ ఈ సారి ఆ లిస్ట్ నుంచి మరింత కిందకు పడిపోయారు. 1995 నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అత్యంత ధనవంతుల జాబితాలో నిలుస్తూనే ఉన్నారు. కానీ ఆయన కూడా 9వ స్థానానికి పడిపోవడం ఫోర్బ్స్ అభిమానులకు ఓ వింతే.

అత్యంత ధనవంతుడైన బెర్నార్డ్ అర్‌నౌల్ట్ ఆస్తుల విలువ
తాజా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఉన్న అర్‌నౌల్ట్ మొత్తం ఆస్థుల విలు (212.5 బిలియన్ డాలర్లు) 17 లక్షల కోట్లకు పైమాటే నని లెక్కలు చెబుతున్నాయ్. ఈ సంవత్సరం జనవరి 31 వరకు లెక్కలు చూస్తే ఆయనే అత్యంత ధనవంతుడిగా నిలిచినట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ చూపెడుతోంది. బిర్నార్డ్ కు చెందిన ఎల్వీఎమ్‌హెచ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్ల పేర్లతో వ్యాపారం చేస్తోంది. ఈ ఎల్‌వీఎమ్‌హెచ్‌కు సుమారు 70కు పైగా బ్రాండ్లు వుంటాయ్. ఈ బ్రాండ్లన్నీ ప్రస్తుతం పూర్తి లాభాల్లో ఉండడం బెర్నార్డ్ అర్నౌల్ట్‌ను టాప్ స్థానంలోకి తీసుకురావడంలో దోహదపడ్డాయ్.
మూడవ స్థానానికి పడిపోయిన మస్క్
రెండవ స్థానంలో ఉన్న జెఫ్ బెజాస్ ఆస్థుల విలువ బిర్నాల్డ్‌కు స్వల తేడాతో మాత్రమే ఉంది. బెజాజ్ ఆస్థుల విలువ 203.8 బిలియన్ డాలర్లు. ఇక ప్రపంచంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్న ఎలాన్ మస్క్ 198.45 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. నాల్గవ స్థానంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ 158.8 బిలియన్ డాలర్లతో ఉండగా ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్ 144.9 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు.
భారతీయులకు దక్కని స్థానం
ఆరవ స్థానంలో 138. 9 బిలియన్ డాలర్లతో గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్, 7వ స్థానంలో 133.2 బిలియన్ డాలర్లతో గూగుల్ సర్చ్ ఇంజెన్ కో ఫౌండర్ సుర్జీ బ్రిన్, 8వ స్థానంలో 131.7 బిలియన్ డాలర్లతో బిర్క్‌షైర్ హాతావే కంపెనీ వ్యవస్థాపకులు వారెన్ బఫెట్, 9వ స్థానంలో మైక్రోసాఫ్ట్ దిగ్గజం 128.5 బిలియన్ డాలర్లతో ఉండగా 10వ స్థానంలో 121.2 బిలియన్ డాలర్లతో లాస్ ఏంజిలిస్ క్లిప్పర్స్ యజమాని స్టీవ్ బాల్మర్ ఉన్నారు.
అత్యంత ధనవంతుల 10 మందిలో భారతీయులు లేకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ తీరును కూడా పరోక్షంగా సూచిస్తోందని అంటున్నారు.



Click it and Unblock the Notifications