Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
రియల్ కొమరం పులి: దాడి చేయడానికి వచ్చిన చిరుతపులినే పండబెట్టి తొక్కాడు..వీడియో చూడండి
మన కళ్లెదురుగా చిరుతపులి సడెన్ గా కనిపిస్తే వెంటనే పరుగుపెట్టడమో ఇక చచ్చాం రా దేవుడా అని కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తాం. అదే సడెన్ గా చిరుతపులి వచ్చి మీదపడితే ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా? ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు ఓ వ్యక్తి..అయితే ఆ సమయంలో అతడు భయంతో కేకలు వేయలేదు..పరుగెత్తనూ లేదు..అతడు చేసిన పనికి చుట్టుపక్కల ఉన్న అందరూ ఆశ్చర్యపోయి వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని బూబూరి అనే గ్రామంలో మిహిలాల్ గౌతమ్ అనే 35 ఏళ్ల వ్యక్తి స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడు. అయితే మంగళవారం మధ్యాహ్నాం కూడా మిహిలాల్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటున్న సమయంలో దగ్గర్లోని పొలాల్లోనుంచి పరుగెత్తుకుంటూ వచ్చి సడెన్ గా ఓ చిరుతపులి అతడి మీదకు దూకి దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే పులి అకస్మాత్తుగా మీదపడిపోవడంతో మిహిలాల్ ఒక్క సెకను ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న మిహిలాల్ భయపడి పరుగెత్తకుండా దాంతో తలపడ్డాడు.

ఓ వైపు చిరుతపులితో ఫైట్ లో తనకు గాయాలవుతున్నా లెక్కచేయకుండా తన రెండు చేతులతో దాన్ని నేలమీద పడుకోబెట్టాడు. మిహిలాల్ బలం ముందు అది ఎంత గింజుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో అక్కడ పనిచేసే వర్కర్లు అందరూ చిరుతపులిపై ఇటుక రాళ్లు విసిరేయడం మొదలుపెట్టాడు. తర్వాత మిహిలాల్ విడిచిపెట్టడంతో భయంతో ఆ చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఆ చిరుతపులి దాడిలో నలుగురు వర్కర్లు గాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో పులితో పోరాడి గాయాలపాలై ప్రాణాలు దక్కించుకున్న మిహిలాల్ ట్రీట్మెంట్ కోసం వెంటనే స్థానిక హాస్పిటల్ కు వెళ్లగా..తర్వాత అతడిని జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అయితే చిరుతపులి గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్న ఆ చిరుతపులిని బంధించారు. పులితో మిహిలాల్ పోరాడుతున్న సమయంలో దాన్ని తమ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో వైరల్ గా మరింది. రియల్ కొమరం పులి, రియల్ హీరో అంటూ నెటిజన్లు మిహిలాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రూరమృగం మెడలు వంచిన వ్యక్తి అంటూ అతడు చూపించిన ధైర్యానికి హ్యాట్పాఫ్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications