Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
స్వామి వివేకానంద శక్తివంతమైన సూక్తులు..మీలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం!
భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన యుగపురుషుడు స్వామి వివేకానంద. 19వ శతాబ్దంలో ఉదయించిన గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త, సామాజిక సంస్కర్త ఆయన. 1863 జనవరి 12న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించిన ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా.
అపారమైన జ్ఞానం కలిగిన గొప్ప ఋషి శ్రీ రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రియమైన శిష్యుడైన వివేకానందుడిని ఆధునిక భారతదేశ నిర్మాతగా కీర్తిస్తారు. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అమెరికా సోదరీ, సోదరులారా అంటూ ఆయన అన్నప్పుడు ఆ సభా ప్రాంగణం మొత్తం నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

ఆ ఒక్క ప్రసంగంతో భారతీయ యోగా, వేదాంత తత్వాల గొప్పదనాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పి విశ్వఖ్యాతి గడించారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని తట్టిలేపడం, దేశభక్తిని రగిలించడం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే తన జీవిత లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఆ మహనీయుని ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకం. మీలో కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపే స్వామి వివేకానంద అద్భుతమైన సూక్తులు కొన్ని ఇక్కడ చూడండి.
స్వామి వివేకానంద పవర్ ఫుల్ కోట్స్
ఆలోచనలే మీ భవిష్యత్తు: మన ఆలోచనలే మనల్ని నిర్మిస్తాయి. కాబట్టి మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించుకోండి. మాటల కంటే ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. అవి ఎంతో దూరం ప్రయాణించి మీ గమ్యాలను నిర్ణయిస్తాయి.
బలహీనతే మరణం: మిమ్మల్ని మీరు ఎప్పుడూ బలహీనుడిగా భావించుకోకండి. అలా భావించడమే ప్రపంచంలో కల్లా అతిపెద్ద పాపం.
శక్తి మీలోనే ఉంది: ఈ విశ్వంలోని అనంతమైన శక్తి అంతా ఇప్పటికే మన సొంతం. కానీ మన కళ్లను మనమే చేతులతో మూసుకుని, అంతా చీకటిగా ఉందంటూ ఏడవడం మన అవివేకం.
సంపదకు నిజమైన అర్థం: మీ దగ్గర ఉన్న డబ్బు ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగపడితేనే దానికి ఒక విలువ ఉంటుంది. అలా కాని పక్షంలో అది చెత్తతో సమానం. ఆ డబ్బును ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.
సమయపాలన ముఖ్యం: ఏదైనా ఒక పని చేస్తానని మాటిస్తే దాన్ని కచ్చితంగా చెప్పిన సమయానికి పూర్తి చేయాలి. లేకపోతే ప్రజలు మీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు.
అసాధ్యం అంటూ ఏదీ లేదు: ఆత్మకు ఏదీ అసాధ్యం అని ఎన్నడూ అనుకోకండి. అలా అనుకోవడం అతిపెద్ద మూఢత్వం. మీలో లేదా ఇతరులలో బలహీనత ఉందని చెప్పడం కంటే మించిన పాపం మరొకటి లేదు.
కష్టాలే విజయానికి మెట్లు: ఏ పనీ చేయకుండా సులభంగా గడిచిపోయే రోజు కోసం ఎదురుచూడకండి. ఏదైనా ఒక రోజులో మీకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకపోతే... మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారని అర్థం చేసుకోండి.
మిమ్మల్ని మీరు నమ్మండి: మీ అంతరాత్మకు, మీ స్వభావానికి మీరు నిజాయితీగా ఉండటమే ప్రపంచంలో అత్యుత్తమ మతం. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు ప్రగాఢంగా నమ్మండి.



Click it and Unblock the Notifications
