Latest Updates
-
ఇంట్లో దేవతా చిత్రాలు ఎక్కడ ఉంచాలి? శాస్త్రాలు చెప్పే నియమాలు -
ఫెమినిజం అంటే వాటితో పోలిక కాదు.. నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్న సునీత కామెంట్స్.. అసలేమన్నారు.! -
అటు ప్రొటీన్, ఇటు టేస్ట్.. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా తినేలా పనీర్ ఖీమా రైస్.! -
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్రూట్ జున్ను.! -
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.?
వంధ్యత్వాన్ని జయించిన 5గురు ప్రముఖులు
వారు అద్భుతమైన జీవితం కలిగిన ప్రపంచ ప్రసిద్ధులు. అలాగే, ఈ ప్రముఖులు ఎక్కువ సంపద కూడా కలిగినవాళ్ళు. కానీ, ప్రముఖులుగా లేదా సంపన్నంగా ఉండడం అంటే అర్ధం వారి జీవితం చాలా తేలికైనది అనికాదు. వారు వారి జీవితంలో చాలా కఠినమైన సమయాలను కూడా ఎదుర్కున్నారని. ఇక్కడ వంధ్యత్వ సమస్యలతో బాధపడే 5గురు ప్రముఖుల గురించి వివరించాము. వారిలో కొంతమంది IVF అనుసరించారు, మరికొంతమంది దత్తతను ఎంచుకున్నారు.

ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్
2011, డిసెంబర్ 1 ఈ జంటకు చాలా సంతోషకరమైన రోజు. కొన్ని ఇబ్బందులు, చాలాకాలం ఎదురుచూసిన తరువాత, కిరణ్, ఆమీర్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ను ఉపయోగించి, సుర్రోగసీ ద్వారా ఒక బాబును పొందారు. కొన్ని వైద్య ఇబ్బందుల కారణంగా డాక్టర్లు IVF మార్గాన్ని వారికి సూచించారు.

మారికా క్రాస్
30 సంవత్సరాలు దాటిన స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గి, గర్భధారణ సమస్యలు పెరుగుతాయి. మారికా క్రాస్ (అమెరికన్ యాక్టర్) కి ఇదే జరిగింది. ఆమెకు 40 సంవత్సరాలు, అప్పుడు ఆమె తల్లి కావాలని అనుకుంది. అందువల్ల, పెళ్ళైన వెంటనే, ఆమె IVF కి వెళ్ళింది. 2007, ఫిబ్రవరి లో ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

బ్రూక్ షీల్డ్స్
బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్, యాక్టర్. మొదటి బాబును గర్భం దాల్చే ముందు, ఈమె 7సార్లు IVF చేయించుకుంది. ఇది ఆమె జీవితంలో చాలా విచారకరమైన అధ్యాయం. ప్రసవానంతరం ఆమె చాలా సమస్యలను ఎదుర్కొంది. సామర్ధ్యం లేక తన శిశువు అవసరాలకు స్పందించలేక పోయేది, ఒక మాతృత్వ బంధాన్ని ఏర్పరచుకోవడంలో ఎదురుదేబ్బలకు ఆమె విసుగుచెందింది. క్రమంగా, డాక్టర్ల సహాయంతో, ఆమె ఈ బాధాకర పరిస్థితి నుండి బైటికి వచ్చింది, ఆమె ఇపుడు ప్రియమైన తల్లి.

సెలిన్ డియోన్
ఈమె కెనడా సింగర్. ఆమె 1994, డిసెంబర్ 17ణ రెనే ఎంజేలిల్ ని వివాహం చేసుకుంది. ఆమె అనేక సంవత్సరాలు గర్భధారణ కోసం అనేక ప్రయత్నాలు చేసే, విఫలం చెందింది. చివరకు, ఆ జంట ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ ను అనుసరించారు. సెలిన్ 6సార్లు IVF చేయించుకుంది. ఇది ఆమెకు చాలా భావోద్వేగ ప్రయాణం. 2010, అక్టోబర్ 23న ఆమె ఆరోగ్యకరమైన కవలలకు జన్మనిచ్చింది.

హుఘ్ జాక్మాన్
ఈయన ఆస్ట్రేలియా ప్రొడ్యూసర్, యాక్టర్. ఈయన 1996, ఏప్రిల్ 11ణ డెబోర్రా- లీ ఫర్నేస్స్ ని వివాహమాడాడు. ఈ జంట స్వంతంగా పిల్లల్ని కనాలని అనుకున్నారు. డెబోర్రా రెండుసార్లు గర్భం దాల్చింది, కానీ గర్భం పోయింది. చివరికి, వారు ఆస్కార్ మాక్సిమిలియన్, అవా ఎలియోట్ అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు.



Click it and Unblock the Notifications