బిపాసా బసు బెస్ట్ లుక్: బర్త్ డే స్పెషల్ ఫొటోలు

అందాలున్నది ఆరబోయడానికే అని నమ్మినట్టు బోల్డ్‌గా నటించే బాలీవుడ్‌ భామల్లో బిపాషా బసు ఒకరు. అభినయ కౌశలం ఉన్నా, మంచి శరీరాకృతి, హస్కీ గొంతు, తనదైన డైలాగ్‌ డెలివరీ శైలి, కెమెరా ముందు ఏ స్థాయిలో అయినా రెచ్చిపోయి నటించడానికి సిద్ధంగా ఉండటం... అందుకే ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. 1979 జనవరి 7 వ తేదీని ఢిల్లీలో పుట్టిన బిపాషా 2001 లో తొలి సారిగా వెండి తెర మీద మెరిసింది. అజ్‌నబీ ఆమె తొలి సినిమా.

రెండో సినిమాలోనే ప్రిన్స్‌ మహేశ్‌తో కలిసి టక్కరి దొంగలో నటించింది. అభినయం ఎలా ఉన్నా అందాల కనువిందుతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరవాత బాలీవుడ్‌కే పరిమితమైంది. జిస్మ్‌ సినిమా ఆమె సినీ, వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పింది. హ్యాండ్సమ్‌ హీరో జాన్‌ అబ్రహాంతో ఆ సినిమాలో హాట్‌ హాట్‌ సీన్లలో జంకూ బొంకూ లేకుండా నటించింది. ప్రేమ సన్నివేశాలలో ఇద్దరూ జీవించారు. అందుకే ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. ఈ జోడీ నిజ జీవితంలో కూడా ప్రేమ జంటగా దాదాపు పదేళ్లు కొనసాగింది. వీరి పెళ్లి ఎప్పుడైనా జరగవచ్చని అంతా అనుకున్నారు. కానీ పదేళ్ల సావాసం తరవాత ఏం జరిగిందో గానీ ఇద్దరూ విడిపోయారు. తరవాత జాన్‌ మరో తోడు చూసుకున్నాడు.

బిపాసా బసు, ఎక్కువ సినిమాలు, ఎక్కువ ఈవెంట్స్ లో కనబడకపోయినా, స్టైల్ ఎవల్యూషన్ మాత్రం ఆమెను ఆకట్టుకోవచ్చు. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ లో చాలా మార్పులను చేసుకొంది. ఈ డస్కీ బ్యూటీ ఎప్పుడా ఇంప్రెచేసే విధంగా దుస్తులను ధరించదు. తర్వాత ఒక స్టైలిష్ యాక్టర్ గా బాగా పేరుతెచ్చుకుంది. సెక్సీగా హాట్‌లుక్‌తో కనిపిస్తే మాత్రమే గుడ్ హీరోయిన్ అనిపించుకోరని బాలీవుడ్ గ్లామర్ గర్ల్ బిపాసా బసు అంటోంది. హాట్ లుక్, సెక్సీ లుక్స్ వంటివే మంచి హీరోయిన్‌ లక్షణాలు కాలేవని బిపాసా వెల్లడించింది. మొత్తానికి గ్లామర్ మంత్రంతోనే సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్లు రాణించలేరని బిపాసా బసు చెబుతోంది. గ్లామర్ ఇమేజ్ కన్నా.. మంచి హీరోయిన్ అనే పేరును నటీమణులు కొట్టేయాలని బిపాసా హితవు పలికింది.

బిపాసా కొన్ని సార్లు బ్యూటిఫుల్ బెంగాలి లుక్ తో అందగా కనబడుతుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చీరల్లో కనపిస్తుంటుంది. మరి ఈ సెక్సీ హాట్ హీరోయిన్ ఏదుస్తుల్లో అందంగా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే, ఈ క్రింది పోటోలను చూడాల్సిందే. ఈరోజుతో(జనవరి 7, 2013) ముప్పైఐదుఏళ్ళలో పడిని బిపాసా ఇంకా ఫిట్‌నెస్‌ను, లుక్‌ను కాపాడుకుంటున్నది అన్న విషయాన్ని ఈక్రింది ఫోటోలే నిదర్శనం..

పార్టీ లుక్:

పార్టీ లుక్:

ఈరోజు 35ఏళ్ళలో పడిన సందర్భంగా గడిచిన రాత్రి పార్టీ చేసుకుంటూ ఇలా పార్టీ చేసుకుంటూ, బిపాసా బసు ఇలా కనిపించింది. ఆమె పింక్ కలర్ షీర్ బ్లౌన్ మినీ స్కర్ట్ లో కనిపించింది.

బ్లాక్ కాక్ టైల్ డ్రెస్స్ లో :

బ్లాక్ కాక్ టైల్ డ్రెస్స్ లో :

బిపాసా బసు గ్లిట్టరింగ్ బ్లాక్ కాక్ టైల్ డ్రెస్ లో అందంగా నిల్చుంది.

షీర్ బ్లాక్ :

షీర్ బ్లాక్ :

బిపాసా బసు ఒక బోల్డ్ లుక్ తో ఇలా ఒక సీర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్యాండేజ్ గ్రే మిని స్కర్ట్ లో సెక్సీ లుక్ తో కనబడుతోంది.

శారీ స్టైల్ :

శారీ స్టైల్ :

సబ్యసాచి డిజైన్ చేసిన వివిధ రకాల శారీల్లో బ్యూటిఫుల్ లుక్ తో బిపాసా బసు.

 బ్లూ శారీ:

బ్లూ శారీ:

బ్లూ కలర్ షిఫాన్ శారీ పింక్ బార్డర్ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ శారీలో బిపాసా బసు.

బ్లాక్ గౌన్:

బ్లాక్ గౌన్:

ఈ గౌనులో బిపాసా చాలా అద్భుతంగా కనబడుతోంది. ఈ డ్రెస్స్ ను అర్పన్ ఒహార్ డిజైన్ చేసి ఆరోమాటిక్ గౌన్ చాలా అద్భుతంగా కనిపించింది.

పింక్ డ్రెస్:

పింక్ డ్రెస్:

బిపాసా ఈ షార్ట్ పింక్ డ్రెస్ లో చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తోంది. ఈ ఫ్లవర్ ప్రింట్ షర్ట్ అద్భుతంగా ఉంది. ఈ స్కర్ట్ మీదకు మ్యాచింగ్ జాకెట్ అద్భుతంగా ఉంది.

బ్లాక్ ఫ్లవర్ ప్రింట్:

బ్లాక్ ఫ్లవర్ ప్రింట్:

బిపాసా బసు బ్లాక్ కలర్ ఫ్లవర్ ప్రింట్ డాల్సి మరియు గబ్బనా డ్రెస్ లో అద్భుతంగా ఉంది. ఆమె డ్రెస్ కు తగ్గట్లు యాక్సెసరీస్ ధరించింది.

గ్రే శారీ:

గ్రే శారీ:

బిపాసా బసును మరింత హాట్ లుక్ తో బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ శారీలో సెక్సీగా కనబడుతోంది. బ్లాక్ కాంబినేషన్ యాక్సెసరీస్ బాగా ఆకట్టుకొట్టున్నది.

రెడ్ కలర్ డ్రెస్:

రెడ్ కలర్ డ్రెస్:

ఈ రెడ్ మార్క్ లో బిపాసా స్మోకి హాట్ గా కనబడుతోంది. స్పెన్సర్ నీ లెగ్త్ డ్రెస్ లో మరింత హాట్ గా కనబడుతోంది. ఈ డ్రెస్ మీదకు ముత్యాల నెక్ లెస్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.

స్కర్ట్ స్టైల్:

స్కర్ట్ స్టైల్:

బిపాసా బసు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ స్కర్ట్ లో లో ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది. డ్రెస్ మీదకు బటర్ స్కాచ్ కలర్ షూ ఫర్ ఫెక్ట్ గా నప్పాయి.

Desktop Bottom Promotion