మిస్ వరల్డ్ 2014లో తళతళ మిళమిళ మెరిసిన ఐశ్వర్య రాయ్

మాజీ అందాల రాణి ఐశ్వర్య రాయ్ బచ్చన్ లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ 2014 ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ మిస్ వరల్డ్ అవార్డ్ ను అందుకొంది. మిస్ వరల్డ్ 2014ఈవెంట్ కు హాజరైన ఐశ్వర్య రాయ్ ప్రముఖ డిజైనర్ రాబర్ట్ కావల్లి డిజైన్ చేసిన సిల్వర్ గౌన్ ధరించి అద్భుతంగా కనిపించింది. ఈవెనింగ్ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే డ్రెస్సును ఆమె ఎంపిక చేసుకవడం వల్ల ప్రేక్షకుల కళ్ళను ఆమె మీద తప్ప మరెటూ కదలనివ్వకుండా చేసింది.

మిస్ వరల్డ్ ఈవెంట్ 2014లో ఐశ్వర్య రాయ్ తో పాటు పాల్గొన్న మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. అయితే అందరిలోకి ఐశ్వర్య రాయ్ మాత్రం ది బెస్ట్ సెలబ్రెటీగా కనిపించారు! ముఖ్యంగా ప్రముఖ డిజైనర్ రాబర్ట్ కావల్లి డిజైన్ చేసిన ఈ సిల్వర్ గౌన్ లో అక్కడున్న ప్రేక్షకులందరిని అమితంగా ఆకర్షించింది. స్టేజ్ మీద ఆమె అందానికి మరో అసెట్ లా బ్యూటిఫుల్ స్మైల్ తో చాలా గర్వించదగ్గ విధంగా కనిపించడం చాలా మంది ఈర్ష్యపడేలా చేసింది.

GLAMOUROUS: Aishwarya Rai In Roberto Cavalli Gown At Miss World 2014

మిస్ వరల్డ్ 2014 ఈవెంట్ లో బ్యూటీక్వీన్ ఐశ్వర్య రాయ్ తో పాటు, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ మరియు ఆమె కూతురు ఆరాద్యతో పాటు ఐష్ మదర్ వరుందా రాయ్ కూడా హాజరవ్వడం ప్రశంసదగ్గ విషయం. ఈ కలర్ ఫుల్ అండ్ జాయ్ ఫుల్ ఈవెంట్ లో అందాల రాణీ ఐశ్వర్య రాయ్ ప్రక్కన అభిషేక్ బచ్చన్ ఒక బ్లాక్ కలర్ టక్సీడో అవుట్ పిట్ లో ఫిట్ అండ్ ఫర్ఫెక్ట్ గా కనిపించారు. ఇక వారి కుమార్తె, లిటిల్ ఏంజిల్ ఆరాద్య కూడా పింక్ కలర్ డ్రెస్సులో చాలా క్యూట్ గా కనిపించింది.

GLAMOUROUS: Aishwarya Rai In Roberto Cavalli Gown At Miss World 2014

మిస్ వరల్డ్ 2014 ఈవెంట్ కోసం ఐశ్వర్య రాయ్ ధరించిన రాబర్ట్ కావెల్లీ డిజైనర్ సిల్వర్ గౌన్ ఏవిధంగా తప్పు పట్టే విధంగా లేదు. ఈ అద్భుతమైనటువంటి ఈవినింగ్ గౌన్ ఆమె అందానికి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అంతే కాదు, హైఇంటెన్సిటి లైట్స్ వెలుగుల్లో ఐశ్వర్య రాయ్ ఒక వజ్రంలా మెరిసిపోయింది. ఆమె ధరించిన డ్రెస్సు మాత్రం చాలా అందంగా మరియు సింపుల్ గా ఉంది. రాబర్ట్ కావల్లి డిజైన్ చేసిన ఈ డ్రెస్ నడుము వద్ద టైట్ గా మరియు బ్యాస్కెట్ ప్యాట్రన్ బాటమ్ చాలా అద్భుతంగా అనిపించింది. లాంగ్ స్లీవ్స్ కలిగిన ఈ డ్రెస్సు మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపించింది.

GLAMOUROUS: Aishwarya Rai In Roberto Cavalli Gown At Miss World 2014

మిస్ వరల్డ్ 2014 ఈవెంట్ కోసం ఐశ్వర్య రాయ్ బిగ్గరగా మేకప్ వేసుకొననది . ఆమె లిప్స్ నిండుగా రెడ్ కలర్ లిప్ స్టిక్ తో మరియు ఆల్మడ్ బ్లూ ఐస్ కు బ్లాక్ అండ్ సిల్వర్ కోల్ తో మేకప్ చేయడం అదనపు ఆకర్షణ. ఇక ఎప్పటిలాగే ఆమె హెయిర్ స్టైల్ వదులుగా విడవడం తన ట్రేడ్ మార్క్ అనే చెప్పవచ్చు . ఈ ఫర్ఫెక్ట్ రాబర్టో కావెల్లి ఈవినింగ్ గౌన్ మీదకు ఆభరణాలు పెద్దగా కనిపించకపోయాని చెవుల్లో డైమండ్ స్టడ్స్ మరియు చేతివేలికొక డైమండ్ రింగ్ చాలా సింపుల్ గా కనిపించింది.

GLAMOUROUS: Aishwarya Rai In Roberto Cavalli Gown At Miss World 2014

మొత్తానికి, మిస్ వరల్డ్ 2014 అవార్డ్ స్టేజ్ మీద కలర్ ఫుల్ గా మినుకు మినుకుమని మెరిస్తూ కనిపించింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ ది బెస్ట్ గా కనిపించింది. రాబర్ట్ కావల్లి డిజైనర్ అవుట్ ఫిట్స్ లో ఈ అవుట్ ఫిట్ కూడా ఒక బెస్ట్ లుక్ అందించిందని చెప్పవచ్చు. మరి మీరేమంటారు...?

GLAMOUROUS: Aishwarya Rai In Roberto Cavalli Gown At Miss World 2014

Story first published: Monday, December 15, 2014, 15:35 [IST]
Desktop Bottom Promotion