Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
రెడ్ కార్పెట్ మీద శ్రియ అండ్ ముగ్దా గాడ్సే అమేజింగ్ లుక్
వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014, లో రెడ్ కార్పెట్ మీద ఇద్దరు బ్యూటిఫుల్ సెలబ్రెటీల్ వాక్ చేశారు. అందులో ఒకర శ్రియా శరన్ మరొకరు ముగ్ధా గాడ్సే. ఈ ఇద్దరు సెక్సీఅండ్ బ్యూటీఫుల్ లేడీస్ రెడ్ కార్పెట్ మీద ఒక డిజైన్ కలిగిన రెండు వేరువేరు కలర్స్ తో డిజైన్ చేసిన గౌన్స్ ధరించి రెడ్ కార్పెట్ మీద అలరించారు. వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద శ్రియా మరియు ముగ్ధా గాడ్సే ఇద్దరూ ఒక బ్రైట్ కలర్ ఎంబాలిష్ మెంట్ అవుట్ ఫిట్స్ తో కనిపించి ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించారు. వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014 కు హాజరైన శ్రియా శరన్ రజత్ కె తంగ్రీ కలెక్షన్స్ లోని బ్లడ్ రెడ్ కలర్ ఎంబాలిష్మెంట్ డ్రెస్సును ధరిస్తే, ముగ్ధా గాడ్సే ఒక టీల్ షేడ్ ఎపిక చేసుకుంది.
ఈ ఇద్దరూ సెలబ్రెటీలు ధరించిన గౌన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ గ్లామరస్ ఈవెంట్ కు స్టైలిష్ గా ఫర్ఫెక్ట్ గా రెడీ అయ్యి వచ్చారు. వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014కు శ్రియా శరన్ ఎంపిక చేసుకొన్న స్టైల్ సెలక్షన్ అవుట్ ఫిట్ చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపించింది. రెడ్ కార్పెట్ మీదకు ఇంత కంటే స్టైలిష్ గా మరేం కావాలి అనిపించే విధంగా డ్రెస్సెప్ అయ్యింది . ఈ వరల్డ్ వాచ్ అవార్డ్స్ ఈవెంట్ లో శ్రియా ఫర్ఫెక్ట్ గా స్టైలిష్ గా బ్యూటిఫుల్ లుక్ తో కనిపించింది.
రాజత్ కె తాంగ్రీడిజైన్ చేసిన ఎంబాలిష్ అవుట్ ఫిట్ లో శ్రియా చాలా అద్భుతంగా కనిపించింది. నెక్ వద్ద రఫెల్ ప్యాట్రన్ మరియు అదనంగా జర్ధోసి ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా స్టైలిష్ గా మరియు ఉత్కంఠభరితంగా ఉన్నది. అలాగే ఈ బ్లడ్ రెడ్ గౌన్ క్రింది భాగంలో చాలా విశాలంగా వదులగా రెడ్ కార్పెట్ మీద ఫ్లో అవుతుండటం ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ అనిపించింది. నడుము వద్ద ఫిట్ గా టైట్ గా మరింత సెక్సీగా కనబడేలా చేసింది. నెక్ లైన్ స్ట్రక్చర్ వావ్ అనిపించే విధంగా డిజైన్ చేయబడి, అది శ్రియ ధరించడం వల్ల వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014 ఈవెంట్ లో సంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది.

ఈ కాంతివంతమైన బ్లడ్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ కు పర్ఫెక్ట్ గా లౌడ్ మేకప్ చేసుకొంది . తన బుగ్గులు మరింత ప్రకాశవంతంగా బ్లష్ అవుతున్నట్లు, టింట్ మరియు లిప్స్ క్రిమ్సన్ లిప్ స్టిక్ తో అందరినీ ఆకర్షించింది. అంతే కాదు, ఆమె చేతి వేళ్ళకు పెట్టుకొన్న నెయిల్ పాలిష్ కూడా బ్రైట్ బ్లడ్ రెడ్ కలర్ లో ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా కనిపించింది. ఇక నీట్ గా బన్ హెయిర్ స్టైల్ తో చేతిలో అలెగ్జాండర్ మెక్వీన్ క్లచ్ తో స్టైలిష్ గా రెడ్ కార్పెట్ ఈవెంట్ లో అద్భుంగా కనిపించింది.
వరల్డ్ వాచ్ అవార్డ్స్ 2014లో మరో ముద్దుగుమ్మ ముగ్దా గాడ్సే, ఆమె ఒక టేల్ షేడ్ కలర్ తో రెడ్ కార్పెట్ మీద కనిపించింది. ఆమె ధరించిన ఈ అవుట్ ఫిట్ ను ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేశారు .రెడ్ కార్పెట్ మీద నడవడానికి ఇటువంటి కలర్లో డిజైన్ చేసిన గౌన్ ఎంపిక చేసుకోవడం ఎక్సలెంట్ చాయిస్ అనుకోవచ్చు.

అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ గౌన్ కు జర్దోసి మెటాలిక్ బెల్ట్ తో కనిపించింది. ఇక ఈ డస్కీబ్యూటీ అదనంగా మరే ఇతర ఆభరణాలను అలంకరించుకోలేదు. ముగ్దా ధరించిన ఈ అవుట్ ఫిట్ చాలా అందంగా సొగసుగా కనిపించింది. ఆమెకు తగ్గవిధంగా డిజైన్ చేశారు అనిపించింది. ఈ గౌన్ డిజైన్ చేయడానికి టేల్ మరియు బ్లాక్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది ఆమె స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా నప్పింది .
కాబట్టి, ఈ ఇద్దరి ముద్దుగుమ్మల యొక్క అవుట్ ఫిట్ డిజైన్ ఒకే విధంగా ఉన్నా, స్టైల్ అండ్ మేకప్ లో చాలా డిఫరెంట్ గా కనిపించి ఎవరికి వారు ప్రశంసలు అందుకొన్నారు...



Click it and Unblock the Notifications
