Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
పెళ్లివేడుకలో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా మెరిసిన సెలబ్రెటీలు
వామ్ సమ్మర్ సీజన్ తో పాటు పెళ్ళిళ్ల సీజన్ కూడా మొదలైంది. సాధారణంగా పెళ్ళిళ్ళు , పార్టీలు, ఫంక్షన్లు అంటే ఒక పండుగ వాతావరణం కబడుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీ విషయంలో ఈ విషయం మరింత క్రేజీగా ఉంటుంది. అందరిలో ఒక ఆత్రుత, అందరి సెలబ్రెటీలను ఒక చోట చూడవచ్చు. అంతే కాదు, వారు ధరించే అవుట్ ఫిట్స్, మరియు యాక్సెసరీస్ మీద మరింత క్యూరియాసిటి ఉంటుంది. అలా క్యూరియాసిటికి అవకాశం ఇచ్చిన వెడ్డింగ్ ఒకటి రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగింది. బాలీవుడ్ లో వివాహం అంటే చాలా హైపర్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంటుంది . ఈ వెడ్డింగ్ కు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. తుల్సి కుమార్ హితేష్ రల్హాన్ వెడ్డింగ్ చూడాటానికి చాలా గ్రాండ్ గా అనిపించింది.
ముఖ్యంగా ఈ వెడ్డింగ్ వేడుకలో అందరి కళ్ళు విద్యాబాలన్ మీదే అని చెప్పవచ్చు . చాలా బ్యూటిఫుల్ గా , బ్రైట్ కలర్ శారీలో, పక్కన తన భర్తతో కలిసి హాజరవ్వడం ఈ క్యూట్ కపుల్ ను చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ వెడ్డింగ్ ఫెస్ట్ లో మరో బ్యూటిఫుల్ ఉమెన్ అలనాటి, మేటి నటి, ఇప్పటికీ అతిలోక సుందరిగా కనబడుతున్న శ్రీదేవి తన అంద చందాలతో మెస్మరైజ్ చేసేసింది. ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ సాంప్రదాయబద్దంగా నిండుగా చీరలు కట్టుకొని హాజరవ్వడం పెళ్ళివేడకలో నిండుదనం కనిపించింది. అయితే, మరికొంత మంది పాపులర్ డిజైనర్స్ డిజైన్ చేసిన లెహంగా మరియు అనార్కలీ ధరించి అందరినీ ఆకట్టుకోగలిగారు. ఈ పెళ్ళి వేడకు ఒక ర్యాంప్ షోలా అనిపించింది. ఈ షోలో కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ముందుముందు ర్యాంప్ వాక్ లో ప్రదర్శించే విధంగా అలరించారు.
తుల్సి కుమార్ హితేష్ రల్హాన్ వెడ్డింగ్ వేడుకలో కొంత మంది బ్యూటిఫుల్ లేడీస్ చూస్తుంటే చాలా ఉత్కంఠభరితంగా కనిపించారు. మరి మీరు కూడా చూసి, ఎంజాయ్ చేయాలంటే, ఈ క్రింద్ స్లైడ్ మీద ఓ లుక్ వేయాల్సిందే...

1. విద్యాబాలన్:
విద్యాబాలన్ మెరూన్ పట్టు కాంచీపురుం శారీలో అమేజింగ్ గా కనిపించింది.

2. సోనాక్షి సిన్హా:
బేబీ బ్లూ లెహంగాలో బ్యూటిఫుల్ సోనాక్షి సిన్హా చాలా సెక్సీగా కనిపిచింది. ఈ డ్రెస్సును డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు లైట్ లైట్ గా అనిపించింది.

3.జాక్వెలైన్ ఫెర్నాడేజ్:
భారీగా డిజైన్ చేసిన లెహంగాలో జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఇలా వెడ్డింగ్ లో క్యూట్ అండ్ హాట్ గా కనిపించింది.

4. దియా మీర్జా:
బాలీవుడ్ బ్యూటీ క్వీన్, డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేసిన మాక్సీ డ్రెస్సులో వెడ్డింగ్ ఈవెంట్ లో చాలా బ్రైట్ గా కనిపించింది.

5. అమీషా పటేల్:
తుల్సి కుమార్ హితేష్ రల్హాన్ వెడ్డింగ్ కి హాజరైన అమీషా పటేల్ ను చూస్తే ఆమె ను మరెవ్వరూ బీట్ చేయలేరని అనిస్తుంది. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన బ్యూటిఫుల్ నేవీ బ్లూ డ్రెస్ అమేజింగ్ గా ఉన్నది.

6. శ్రీదేవి:
వావ్! నిజంగా అతిలోక సుందరిని చూసినట్లే ఉన్నది. కళ్ళకు మిరిమిట్లుగొలిపే బ్యూటిఫుల్ కాంబినేషన్ శారీ, బ్యూటిఫుల్ కాంబినేషన్ డైమండ్ జ్యువెలరీలో ఫర్ఫెక్ట్ లుక్ తో మనీష్ మల్హోత్ర డిజైనర్ డ్రెస్ లో ఉత్కంఠభరితంగా కనిపించింది. ఆక్సీ బ్లడ్ లిప్ స్టిక్, కొప్పు నిండా పువ్వులు, సాంప్రదాయ కళ ఉట్టిపడుతున్నది.

7. శ్రద్ద కపూర్:
శ్రద్ద కపూర్ కూడా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్ లో మెస్మరైజింగ్ గా కనిపించింది. ఆనియన్ కలర్ ఆమె స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా కనిపించింది.

8. రిచా చందా:
మరో బ్యూటిఫుల్ లేడీ, డార్క్ బ్లూ డ్రెస్సులో చాలా భారీగా కనిపించింది . నేవీ బ్లూ లెహంగా ఫుల్ డిజైన్ చేయబడి చాలా డిఫరెంట్ గా కనిపించింది. ముత్యాలు, గోల్డ్ నెక్ లెస్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్.

9. ఈషా గుప్తా:
గుప్తా చాలా సింపుల్ గా నెట్ లెహంగాలో క్యూట్ గా పింకిష్ గా కనిపించింది ఆమె స్టైల్ మరియు అన్మోల్ డైమండ్స్ మీదే అందరి కళ్ళు.

10. బిపాసా బసు:
ఈ ఫోటో చూసిన తర్వాత అందం మరియు స్టైల్ విషయంలో బిపాసా బసును బీట్ చేయలేరనిపిస్తుంది. బిపాసా బసు మైండ్ బ్లోయింగ్ గా ఉంది.



Click it and Unblock the Notifications