Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ముక్కు సర్జరీలతో ముఖారవిందం మార్చుకున్న బోల్డ్ బ్యూటీస్
ప్రతి ఒక్కరిని ఆకర్షించే అద్భుతం గ్లామర్. ఈ గ్లామర్ కి సినీ ప్రపంచంలో అంతులేని స్థానం ఉంది. అందుకే నువ్వా నేనా అంటూ రంగుల ప్రపంచంలో పోటీ పడుతున్నారు హీరో హీరోయిన్లు. హీరో అయినా, హీరోయిన్ అయినా.. అందం నుంచి అభినయం వరకు అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. కాంపిటీషన్ పెరగడంతో, సక్సెస్ ఫుల్ బాలీవుడ్ స్టార్స్ కూడా టాలెంట్, అందం ఉన్నా మరింత అందంగా కనిపించడానికి ట్రీట్మెంట్స్ కి వెళ్లారు.
ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా కాస్మొటిక్ సర్జరీలకే ప్రాధాన్యత పెరిగింది. టాప్ ఛెయిర్ ఉన్న ముద్దుగుమ్మలు కూడా సర్జరీలతో అందాన్ని రెట్టింపు చేసుకోవాల్సి వచ్చింది. అన్నింటికన్నా ముక్కు సర్జరీలు చాలా కామన్. అయితే చాలా సందర్భాల్లో ఇవి ఫెయిల్ అయ్యాయి. కానీ ముక్కు సర్జరీలతో ఫుల్ లెంగ్త్ సక్సెస్ పొందిన సెలబ్రిటీ లిస్ట్ మీ కోసం.

ప్రియాంకా చోప్రా
పిగ్గీ చాప్స్ కూడా కత్తిపోట్లతో తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంది. గతంలో తన ముక్కు అందం కంటే సర్జరీ తర్వాత మరింత ఎట్రాక్టివ్ గా ఉంది. ఈ సర్జరీ తర్వాత ప్రియాంకా చోప్రా అందం పెరిగింది.. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

కరీనా కపూర్
సెక్సీ బెబోకి ముందు నుంచే క్రేజ్ ఉంది. ముక్కు ఆకారంలో కాస్త అందం తగ్గినా కూడా ఈ అమ్మడి పర్సనాలిటీకి అందరూ ఫిదా అయ్యారు. సర్జరీ తర్వాత కరీనా అందం మరింత రెట్టింపు అయ్యింది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది.

ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్ చాలా సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ముక్కు సర్జరీ మాత్రం ఆమె అందంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. సర్జరీ తర్వాత ఐష్ ముక్కు చాలా షార్ప్ గా అందంగా తయారైంది. దాంతోపాటు బుగ్గల అందం వెనక కూడా సర్జరీల మాయ ఉంది.

శిల్పా శెట్టి
పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఒకటి కాదు రెండుసార్లు ముక్కు సర్జరీ చేయించుకుంది. సహజ అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగే ఎక్కువే.

శ్రుతి హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ సహజ అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ముక్కు పొడువుగా ఉండటం కొంతమంది ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. అందమే కాదు, శ్వాస సమస్య కూడా ఉండటంతో.. శ్రుతి హాసన్ ముక్కు సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

శ్రీదేవి
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ర్టీలో ముక్కు సర్జరీలను స్టార్ట్ చేసింది అతిలోక సుందరి శ్రీదేవి. ముక్కు, పెదాల సర్జరీ ద్వారా ఫర్ఫెక్ట్ లుక్ సొంతం చేసుకుంది శ్రీదేవి.

జూహీ చావ్లా
క్యూట్ స్మైల్, బబ్లీ నేచర్ తో ఆకట్టుకునే జూహీ చావ్లా కాస్మొటిక్ సర్జరీకి వెళ్లింది. సర్జరీకి ముందు ఓకే అనిపించేలా ఉన్న బ్యూటీ ముక్కు సర్జరీ తర్వాత చాలా అందంగా ఆకట్టుకుంది.

రాఖీ సావంత్
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ కూడా రెండు సర్జరీలు చేయించుకుంది. ముక్కు సర్జరీలతో అందాన్ని మెరుగుపరుచుకున్న ఈ బ్యూటీ తర్వాత పెదాల సర్జరీ కూడా చేయించుకుంది.

కత్రినా కైఫ్
ఐటమ్ సాంగ్స్ తో బాలీవుడ్ క్రేజ్ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ ముక్కు సర్జరీ చేయించుకుంది. సర్జరీ తర్వాత కత్రినా మరింత ఎట్రాక్టివ్ గా కనిపించింది.

రాణీ ముఖర్జీ
న్యాచురల్ అందంతో ఆకట్టుకునే రాణీ ముఖర్జీ కూడా సర్జరీలతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ముక్కు సూటిగా, అందంగా మారడానికి ఈ అమ్మడి సర్జరీనే కారణం.



Click it and Unblock the Notifications