For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్ స్క్రీన్ అందానికి.. ఆఫ్ స్క్రీన్ ట్రీట్మెంట్స్

By Nutheti
|

ముక్కు సర్జరీలు, పెదాల సర్జరీలు, చీక్స్, చెస్ట్ సర్జరీలతో... చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ తమ అందాలను రెట్టింపు చేసుకున్నారు. ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల జిమ్మిక్కులు చేశారు. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ బీటౌన్ లో దూసుకుపోతోంది.

READ MORE : హాట్ అండ్ స్పైసీ లుక్ లో అదరగొట్టేసిన బాలీవుడ్ బికినీ బ్యూటీస్

తెల్లగా మెరిసిపోవడానికి యూరోపియన్స్ ఎంతైనా డబ్బును ఖర్చుపెట్టేవాళ్లు. ఇండియన్స్ దానిపై అంత ఆసక్తి చూపేవాళ్లు కాదు. కానీ.. డార్క్ కలర్ లో ఉన్న బ్లాక్ బ్యూటీస్ అంతా.. ఇప్పుడు స్కిన్ లైటెనింగ్ ట్రీట్మెంట్ వెంట పడ్డారు. రూపురేఖలే కాదు.. చర్మంలోనూ మార్పులు తీసుకుచ్చి.. మరింత ఎట్రాక్టివ్ గా కనిపించడానికి తహతహలాడుతున్నారు.

READ MORE: లాక్మే ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో అదుర్స్ అనిపించిన సెలబ్రెటీలు

ఈ స్కిన్ లైటెనింగ్ పద్దతిపై యంగ్ హీరోయిన్సే కాదు.. ఒకప్పుడు అందం, అభినయంతో మెప్పించిన తారాలోకం కూడా.. స్కిన్ టోన్ మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నమ్మలేకపోతున్నారా.. అయితే టేక్ ఎ లుక్...

 కాజోల్

కాజోల్

కాజోల్ అంటే.. బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. డార్క్ గా ఉన్నా.. అందం, అభినయంతో.. ప్రేక్షకుల మది దోచుకుంది. కానీ.. స్కిన్ టోన్ మార్చేసుకోవాలనుకుంది. అందుకే.. స్కిన్ మెలనైన్ సర్జరీ చేయించుకుని.. కలర్ మారింది. ఒకప్పుడు డార్క్ కలర్ లో ఉన్న కాజోల్ సడెన్ గా తెల్లగా మెరిసిపోతోంది.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

రకరకాల సర్జరీలు, ట్రీట్ మెంట్లతో.. అందంలో చాలా మార్పులు తీసుకొచ్చిన పిగ్గీచాప్స్ స్కిన్ లైటెనింగ్ ట్రీట్ మెంట్ కూడా చేయించుకుంది. మిస్ వరల్డ్ సమయంలో ప్రియాంకా కలర్.. ప్రస్తుతమున్న కలర్ చూస్తే తేడా మీకే తెలుస్తుంది.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి స్కిన్ లైటెనింగ్ ట్రీట్ మెంట్ కి వెళ్లిందని రూమర్స్ వచ్చాయి. అయితే అదంతా ప్రెగ్నెన్సీ గ్లో అంటూ.. కొట్టిపారేసింది. కానీ ప్రెగ్నెన్సీలో కలర్ మారిపోతుందా లేదా అనేది ఎవరికీ తెలియని విషయం కాదు కదా..

బిపాసా బసు

బిపాసా బసు

బాలీవుడ్ డస్కీ బ్యూటీల్లో బిపాసా ఒకరు. ఏసియాలోనే సెక్సియస్ట్ ఉమెన్ గా 2005, 2007లలో ఓటింగ్ పొందింది ఈ బ్యూటీ. అయితే తనకు డార్క్ స్కిన్ ఉందని.. దానికి గర్వంగా ఫీలవుతున్నానని ఎప్పుడు చెప్పేది. కానీ.. బ్లాక్ బ్యూటీ అన్న కామెంట్స్ హర్ట్ చేశాయో ఏమో.. స్కిన్ లైటెనింగ్ ట్రీట్ మెంట్ పై మనసు పారేసుకుంది. డార్క్ బ్యూటీ కాస్త వైట్ గా మారిపోయింది.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె రంగు ఎలా ఉన్నా.. లుక్ మాత్రం స్టన్నింగ్. హనీ కలర్ లో ఉండే ఈ బ్యూటీ.. హావభావాలు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఇంతకు ముందు చూస్తే కాస్త డార్క్ ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్కిన్ లైటెనింగ్ పద్ధతి ద్వారా మేని ఛాయ మార్చుకుని మెరిసిపోతోంది.

శ్రీదేవి

శ్రీదేవి

స్కిన్ లైటెనింగ్ కేవలం యంగ్ బ్యూటీస్ ని మాత్రమే ఎట్రాక్ట్ చేస్తున్న ట్రెండ్ కాదు. ఒక్కసారి అలనాటి హీరోయిన్లను చూస్తే వాళ్లూ ఈ మోజులో పడిపోయారు. శ్రీదేవి మొదట్లో కనిపించిన తమిళ్, తెలుగు సినిమాలను ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. డార్క్ గా కనిపించేది. కానీ.. తర్వాత తర్వాత ఈ ముద్దుగుమ్మ రంగులోనూ మార్పు వచ్చేసింది. అందుకు కారణం స్కిన్ లైటెనింగ్ ట్రీట్ మెంట్.

రేఖ

రేఖ

అలనాటి అందాల తార రేఖ కూడా ఒకప్పుడు డార్క్ స్కిన్ బ్యూటీనే. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. స్కిన్ లైటెనింగ్ ట్రీట్మెంట్ తో ఇప్పటికీ.. యంగ్ గా మెరిసిపోతుంటుంది.

హేమమాలిని

హేమమాలిని

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని డార్క్ గా ఉన్నప్పటికి బీటౌన్ ని ఏలింది. అయితే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు ఛాయలు కనిపించకుండా.. నిగనిగలాడే మెరుపును సొంతం చేసుకుంది. ముడతలు లేకుండా.. యంగ్ లుక్ కోసం స్కిన్ లైటెనింగ్ కు వెళ్లింది ఈ తార.

చిత్రాంగద సింగ్

చిత్రాంగద సింగ్

ఐటమ్ సాంగ్ లతో పాపులర్ అయిన చిత్రాంగద సింగ్ కూడా స్కిన్ లైటెనింగ్ ట్రీట్మెంట్ చేయించుని మెరిసిపోతోంది. కాస్త చామన ఛాయ రంగులో ఉండే ఈ బ్యూటీ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సర్జరీ చేయించుకుంది.

English summary

Dusky Divas Who Underwent Skin Lightening Treatment in telugu

Dusky Divas Who Underwent Skin Lightening Treatment. Take a look..
Story first published: Thursday, November 5, 2015, 14:02 [IST]