For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వధువుకి వన్నె తెచ్చే ఇండియన్ కల్చర్

By Nutheti
|

రకరకాల సంప్రదయాలు, ఆచారాల సమ్మేళనం భారతదేశం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేక కల్చర్. వంటకాలు, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, కట్టుబాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. ఆచారాల్లో ఎన్ని మార్పులున్నా.. భారతీయ సంప్రదాయత మాత్రం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అందులోనూ.. పెళ్లిళ్లకు, పెళ్లికూతుళ్లకు ఉన్న సంప్రదాయత మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

READ MORE: పెళ్లిళ్ల సీజన్ రానుంది..మరి పెళ్లికూతురు అందంగా మెరవడం ఎలా

ఇండియాలో ఒకో ప్రాంతంలో ఒకోలా పెళ్లికూతుళ్ల ముస్తాబు ఉంటుంది. కొందరు పట్టుచీరలు, మరికొందరు లెహంగాలు, ఇంకొందరు ముందుపైట వేసి.. పెళ్లి పీటల మీద కూర్చుంటారు. భారతదేశంలో ఉన్న అన్ని సంప్రదాయాల్లోనూ పెళ్లి కూతుళ్ల అందమే అందం. వధువుకి వన్నె తెచ్చేలా పెళ్లి సంప్రదాయాలు వెల్లివిరిశాయి. ఇండియాలో ఫేమస్ బ్రైడల్ స్టైల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం..

ఆంధ్రా బ్రైడల్

ఆంధ్రా బ్రైడల్

తెలుగు సంప్రదాయం వెల్లివిరిసేలా.. ఆంధ్రా వధువు ముస్తాబు ఉంటుంది. సంప్రదాయ పట్టుచీర, మెడనిండా ఆభరణాలు, చూడముచ్చటైన కళ్యాణ తిలకం, చేతినిండా గాజులు, వడ్డానం, వంకీ, కాళ్లు, చేతులకు పసుపు, పారాణి, పాపిడి బిల్ల ఇలా.. తెలుదనం ఉట్టిపడేలా ఆంధ్రా వధువు ముస్తాబవుతుంది. పెళ్లి కూతురికి మరో ముఖ్యమైన ఆభరణం నుదట బాసిగం. ఇదే.. తెలుగునాట ముఖ్యమైన సంప్రదాయం. ఇదే పెళ్లికూతురికి కొత్త శోభ తీసుకొస్తుంది.

బెంగాలీ వధువు

బెంగాలీ వధువు

బెంగాలీ పెళ్లికూతుళ్లు చాలా హోమ్లీగా, ట్రెడిషనల్ గా కనిపిస్తారు. చీరకట్టే విధానం ఇక్కడ చాలా స్పెషల్ గా ఉంటుంది. చేతుల్లో ఎరుపు, తెలుపు గాజులు వేసుకుంటారు. తలపై నుంచి వాల్చే దుప్పట్టా బెంగాలీ పెళ్లికూతుళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నుదుటి మీద ఆభరణాలతో అలంకరించడంతో.. వధువు అందం రెట్టింపు అవుతుంది.

మళయాళీ పెళ్లికూతురు

మళయాళీ పెళ్లికూతురు

కేరళ అందాలన్నీ మేళవించేలా.. మళయాళీ వధువు ముస్తాబవుతుంది. టెంపుల్ జ్యువెలరీ వీళ్ల స్పెషాలిటీ. టెంపుల్ జ్యువెలరీతోపాటు జుంమ్కీలు, కలర్ ఫుల్ కంచిపట్టు చీర, ఫ్రెష్ ఫ్లవర్స్ తో హెయిర్ స్టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.

క్యాథలిక్ బ్రైడల్

క్యాథలిక్ బ్రైడల్

క్యాథలిక్ బ్రైడల్ చాలా సింపుల్ గా రెడీ అవుతారు. వీళ్లు వైట్ కలర్ గౌన్ లేదా శారీ ధరిస్తారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా.. సింపుల్ గానే అయినా క్యూట్ గా కనిపిస్తారు. దుప్పట్టా వేసుకుని, చిన్న ఆభరణాలు ధరించి.. చాలా విభిన్నంగా ఉంటుంది క్యాథలిక్ పెళ్లికూతుళ్ల అలంకరణ.

గుజరాతీ వధువు

గుజరాతీ వధువు

గుజరాతీయుల స్టైలే వేరు. చాలా ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. ఫ్రంట్ పల్లు వేసుకోవడం వీళ్ల ప్రత్యేకత. ఎక్కువగా కుందన్స్ ఉన్న ఆభరణాలకు ప్రాధాన్యమిస్తారు.

మరాఠీ పెళ్లికూతురు

మరాఠీ పెళ్లికూతురు

మరాఠీ సంప్రదాయం చాలా విభిన్నంగా ఉంటుంది. ఫుడ్, డ్యాన్స్, డ్రెస్సింగ్ అన్నింటిలోనూ కొత్తగా అనిపిస్తుంది. ముఖాన్ని కవర్ చేసేలా.. రెండు వైపులా ముత్యాలు వేలాడదీయడం మరాఠీయుల స్పెషాలిటీ. ఇక పెళ్లికూతురికి సంప్రదాయ ఆభరణాలు ఎక్కువగా అలంకరిస్తారు.

ముస్లిం బ్రైడల్

ముస్లిం బ్రైడల్

ముస్లిం వధువులు ఎక్కువగా మేకప్, జ్యువెలరీకి ప్రాధాన్యమిస్తారు. లెహంగా వీళ్ల ప్రత్యేకత. అది కూడా రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ వర్క్ వచ్చిన వాటినే ప్రిఫర్ చేస్తారు. పాపిడి బిల్ల వీళ్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

పంజాబీ వధువు

పంజాబీ వధువు

పంజాబీయుల సంప్రదాయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పంజాబీ పెళ్లికూతుళ్లు సల్వార్, కుర్తా ధరిస్తారు. రెడ్ కలర్ కే ప్రాధాన్యమిస్తారు. చేతులనిండా గాజులు, గోరింటాకు ఉంటుంది.

రాజస్థానీ బ్రైడల్

రాజస్థానీ బ్రైడల్

రాజస్థాన్ అంటే మనకు గుర్తొచ్చేది రాజ్ పుట్స్. వీళ్లు పెద్ద ముక్కు పుడకకు ప్రత్యేకం. పెళ్లికూతుళ్లకు పెద్ద రింగులా ఉండే ముక్కుపుడకను తప్పనిసరిగా అలంకరిస్తారు. ఆభరణాలు, లెహంగా.. రాజస్థానీ పెళ్లికూతుళ్ల ప్రత్యేకం.

English summary

Famous Bridal Looks Across India in telugu

Famous Bridal Looks Across India. The wedding season is around the corner. Let's take a look at how different brides of diverse cultures dress up for their wedding and what makes them different from the others.
Story first published: Thursday, October 29, 2015, 12:59 [IST]
Desktop Bottom Promotion