Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
రంగురంగుల గాజుల సవ్వడిలో దాగున్న అర్థాలు
భారతీయ సంప్రదాయానికి, గాజులకు ఉన్న బంధం వేరుచేయలేనిది. అంతేకాదు.. గాజులు ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. రకరకాల డిజైన్స్, మోడల్స్, కలర్స్ లో వచ్చి చాలా పాపులర్ అవుతున్నాయి. అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి.
గుండ్రంగా గాజుతో చేసిన గాజులు మాత్రమే కాదు.. ఇప్పుడు రకరకాల మెటీరియల్స్ తో.. రకరకాల ఆకారాలలో రెక్టాంగిల్, ఓవెల్ షేప్ లలో కూడా గాజులు మార్కెట్ లో లభిస్తున్నాయి. ఎలాంటి ఫంక్షన్స్, పెళ్లిళ్లు, సంప్రదాయ కార్యక్రమాలు జరిగినా.. అమ్మాయిలు చేతులనిండా గాజుల గలగలలతో మురిసిపోతారు.
చక్కగా చీరకట్టుకుని లేదా ట్రెడిషినల్ డ్రెస్ వేసుకున్నా.. గాజులకు ఇంపార్టెన్ ఇస్తారు అమ్మాయిలు. కట్టుబొట్టుకు తగ్గుట్టు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవడం ఫ్యాషన్ లో భాగమైంది. మార్కెట్ లో కూడా దానికి తగ్గట్టే.. బ్రేస్ లైట్ బ్యాంగిల్, సింగిల్ బ్యాంగిల్స్, మల్టీకలర్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, ముత్యాల గాజులు ఇలా రకరకాలుగా అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి. అయితే రంగురంగుల గాజుల సవ్వడి వెనక చాలా రహస్యాలే ఉన్నాయి. సంప్రదాయతకు అద్దంపట్టే గాజుల రంగులు అర్థాలను కలిగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

రెట్ బ్యాంగిల్స్
ఎరుపు రంగు గాజులు అంటే చాలా ప్రీతికరం. వీటిని ఎక్కువగా సంప్రదాయ పూజలు, వ్రతాలు, పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా వాడుతారు. ఎరుపు రంగు ఎక్కువగా అమ్మవారికి ఇష్టమని పెద్దవాళ్లు చెబుతుంటారు. రెడ్ కలర్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల ఎనర్జీ, శ్రేయస్సు కలుగుతుంది.

గ్రీన్ బ్యాంగిల్స్
గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా మంగళకరంగా భావిస్తారు. ఎరుపు రంగు గాజులతో పాటు, ఆకుపచ్చ బ్యాంగిల్స్ ని ఎక్కువ కలిపి వేసుకుంటు ఉంటారు. ముత్తైదువులు ఎక్కువగా ఆకుపచ్చ గాజులకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రీన్ బ్యాంగిల్స్ ధరించడం వల్ల అదృష్టంతో పాటు మంచి జరుగుతుంది. అలాగే సంతానోత్పత్తిని కూడా ఈ గ్రీన్ బ్యాంగిల్స్ సూచిస్తాయి.

ఎల్లో బ్యాంగిల్స్
పసుపు రంగును కూడా ఎక్కువగా మంగళప్రదంగా భావిస్తారు. ఎందుకంటే.. పూజల్లో వాడే పసుపుతో సమానమని. అయితే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ కొన్ని సందర్భాల్లో మ్యాచింగ్ కోసం మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే ఎల్లో బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల సంతోషంగా, ఆనందంగా ఉంటారట.

వైట్ బ్యాంగిల్స్
వైట్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ మ్యాచింగ్ పర్పస్ వాడుతారు. అయితే వైట్ బ్యాంగిల్స్ ట్రెండీగా ఉంటాయి. ఇవి వేసుకుంటే.. కొత్త కొత్త మలుపులు జరుగుతాయి. మీ జీవితంలో ఏదో కొత్తదనం రాబోతోందని అర్థం.

సిల్వర్ బ్యాంగిల్స్
సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ స్ర్టెంగ్త్ ని సూచిస్తాయి. వీటిని ధరించడం వల్ల ఎక్కడ వెనకడుగు వేయకుండా.. ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని మీలో కలిగిస్తాయి.

గోల్డ్ బ్యాంగిల్స్
బంగారు వర్ణపు గాజులు, బంగారు గాజులు అదృష్టాన్ని, శ్రేయస్సుకి సంకేతాలు. బంగారు గాజులు చేతిలో ఉంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

పర్పల్ బ్యాంగిల్స్
పర్పల్ కలర్ బ్యాంగిల్స్ మీ స్వతంత్రతని సూచిస్తాయి. ఎవరిపైనా ఆధారపడకుండా.. సొంతంగా ఏదైనా సాధించగలరన్న ధైర్యాన్ని ఈ గాజులు తెలుపుతాయి.



Click it and Unblock the Notifications
