For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడుముళ్లకు మూడ్ లేదంటున్న ముద్దుగుమ్మలు

By Nutheti
|

బాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని హ్యాపీగా అటు లైఫ్ లీడ్ చేస్తూనే.. కెరీర్ లోనూ దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం సింగిల్ లైఫ్ కే అలవాటు పడిపోతున్నారు. పెళ్లి ఊసెత్తితే.. అది బోర్ కొట్టేసిన టాపిక్ అంటున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే.. పెళ్లి భాజాలు మోగిస్తారా లేదా అని ఫ్యాన్స్ ని డౌట్ లో పడేస్తున్నారు. కొంతమంది టాప్ హీరోయిన్స్ ఎఫైర్స్ నడిపినా.. చివరికి పెళ్లి దాకా రిలేషన్ ని తీసుకెళ్లలేకపోయారు. మధ్యలోనే బ్రేకప్ అయిపోయి మళ్లీ గ్రీకువీరుడి వేటలో పడ్డారు.

READ MORE: స్నానాల గదిలో హీరోయిన్ల అందాలు హాట్ అండ్ సెక్సీ

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా పెళ్లికి బ్రేక్ లేసి.. కెరీర్ పైనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. మూడు పదులు దాటినా ఇంకా పెళ్లికి సిగ్నల్ ఇవ్వడం లేదు. పైగా సింగిల్ లైఫే హ్యాపీగా ఉందంటూ వయ్యారాలు పోతున్నారు. ఇంతకీ వీళ్లకి పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం ఉందా ? లేదా ? పెళ్లిపై ముప్పై ఏళ్ల పడుచులు చెబుతున్నఅభిప్రాయాలేంటి ? లెట్స్ టేక్ ఎ లుక్..

టబు

టబు

అందరూ మెచ్చిన.. అందరికీ నచ్చిన అందాల తార టబు. ఆకర్షణీయమైన పర్సనాలిటీ, అద్భుతమైన అందం, అమేజింగ్ కళ్లు ఆమె సొంతం. పలు సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్, టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి 44 ఏళ్లు. కానీ ఇంకా పెళ్లి ఊసేలేదు. ఒకవేళ తన పెళ్లి టాపిక్ తీసుకొచ్చినా.. ఎప్పుడే అదే టాపిక్కేనా.. కొత్తగా ఏమైనా ఉంటే మాట్లాడండి అంటోంది. ఐతే ఈమెకి చాలామంది కో స్టార్స్ తో ఎఫైర్స్ ఉన్నట్టు రూమర్స్ ఉన్నాయి.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

యాక్టింగ్ లో, సింగింగ్ లో టాలెంట్ నిరూపించుకుంటూ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్న పిగ్గీ చాప్స్ కూడా సింగిలే. ఈ ముద్దుగుమ్మ కొంతమంది రాక్ స్టార్స్ తో ఎఫైర్స్ నడుపుతూ ఫేమస్ అవుతోంది కానీ.. ఏ ఒక్కరితోనూ పర్మనెంట్ రిలేషన్ మెయింటెయిన్ చేయడం లేదు. ఇప్పుడు ప్రియాంకాకు 33 ఏళ్లు. అయితే తనకు పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని.. సంతోషపడుతోంది ప్రియాంకా.

నర్గీస్ ఫక్రీ

నర్గీస్ ఫక్రీ

36 ఏళ్ల నర్గీస్ ఫక్రీ.. అమెరికన్ మోడల్, నటి. ఈ ముద్దుగుమ్మ రాక్ స్టార్, మెయిన్ తేరా హీరో సినిమాలతో ఫేమస్ అయింది. ప్రస్తుతం చాలా ఆఫర్లతో బిజీగా ఉంది. నర్గీస్ ఫక్రీ ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ సైలెంట్ గా ఉంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. నర్గీస్ ఎలా స్పందించిందో తెలుసా ? తాను స్వతంత్రంగా ఉండాలనే ఇష్టపడుతోంది... కెరీర్, డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నాని.. పెళ్లి లేకపోయినా.. సంతోషమే అంటోంది ఈ అమెరికన్ బ్యూటీ.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

1994 లో మిస్ యునివర్స్ టైటిల్స్ సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసిన సుస్మితా సేన్.. కూడా పెళ్లి కాని వాళ్ల జాబితాలో ఉంది. సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని.. పెంచుకుంటోంది. 39 ఏళ్లు ఉన్న ఈ తార.. తాను ఎక్కువ సమయం వాళ్లతో స్పెండ్ చేయాలనుకుంటున్నట్లు.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన, ప్లాన్ లేదంటోంది.

ప్రీతి జింటా

ప్రీతి జింటా

సింగిల్ గానే చాలా హ్యాపీగా, సక్సెస్ ఫుల్ గా జీవిస్తోందట.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. కల్ హో నా హో, వీర్ జారా వంటి పలు సినిమాల్లో నటించిన డింపుల్ బ్యూటీ.. చాలాకాలం ఇండస్ర్టియలిస్ట్ నెస్ వాడియాతో సహజీవనం చేసింది. కానీ ప్రస్తుతం సింగిల్ గానే జీవిస్తోంది. ప్రీతికి ఇప్పుడు 40 ఏళ్లు. అయితే తనకు ప్రేమించేంత టైం లేదని.. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటానని.. ఆ రోజు కంపల్సరీ అందరికీ చెబుతానంటోంది. మరి ఎప్పుడుందో బబ్లీ బ్యూటీ పెళ్లి ముహూర్తం.

బిపాసా బసు

బిపాసా బసు

హాట్ అండ్ సెక్సీ బ్యూటీ బిపాసా బసు.. జాన్ అబ్రహాంతో బ్రేకప్ అయ్యాక సింగిల్ గానే ఉంటోంది. అయితే ఇప్పుడు కరన్ సింగ్ గ్రోవర్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 36 ఏళ్లు ఈ బ్యూటీకి. పెళ్లి ప్రస్తావనకు వస్తే.. తన సోల్ మేట్ ని వెతుక్కునే పనిలో ఉన్నానని.. త్వరలోనే దొరుకుతాడని.. చెబుతోంది.

ఊర్మిళా

ఊర్మిళా

41 ఏళ్ల ఊర్మిళా.. 1980లో మాసూమ్ సినిమాతో.. చైల్డ్ యాక్టర్ గా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లి గురించి అడిగితే.. సింగిల్ గా ఎందుకు ఉండకూడదు.. నా పెళ్లి గురించి మరిచిపోండి.. రిలేషన్ షిప్ లో ఉండాలని తాను అనుకోవడం లేదని.. ఊర్మిళా తెగేసి చెప్పింది.

రైమా, రియా సేన్

రైమా, రియా సేన్

సేన్ సిస్టర్స్ సింగిల్ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రైమా సేన్ కి 35 ఏళ్లు, రియా సేన్ కి 34 ఏళ్లు. బెంగాలీ ఫిల్మ్ ఇండస్ర్టీలో మాంచి క్రేజ్ ఉంది ఈ సిస్టర్స్ కి. వీళ్లిద్దరూ ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఇటీవల రైమా సేన్.. తన గ్రాండ్ మదర్ లాస్ట్ విష్ తీర్చాలని.. అందుకు త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అంటోంది.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది మల్లికా షెరావత్. ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన కొత్తలో మల్లికాకు పెళ్లి అయిందని.. డివర్స్ కూడా తీసుకుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది మల్లికా. ప్రస్తుతం ఈ బ్యూటీకి 39 ఏళ్లు. ఇప్పటికే టీవీ షోల ద్వారా రాకుమారుడిని వెతికే ప్రోగ్రామ్ పెట్టుకుంది. కానీ సక్సెస్ కాలేకపోయింది.

అమీషా పటేల్

అమీషా పటేల్

యాక్టింగ్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అమీషా పటేల్.. తన జీవితంలో లైఫ్ పార్టనర్ అవసరం లేదన్నట్టు అభిప్రాయపడుతోంది. పెళ్లి అంటే ఇంకా మొహమాటంగానే ఉందని.. తన రిలేషన్స్ పై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అంటోంది.

 అమృతా రావ్

అమృతా రావ్

క్యూట్ బ్యూటీ అమృతా రావ్.. వివాహ్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. 34 ఏళ్లు ఉన్న ఈ భామ సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేయాలనుకుంటోందట.

నేహా దూపియా

నేహా దూపియా

బోల్డ్ టాలెంట్ బ్యూటీ నేహా దూపియా.. సింగిల్ లైఫ్ లోనే చాలా కంఫర్ట్ గా ఉందంటోంది. 34 ఏళ్లు ఉన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ఇంకా రెడీగా లేదట.

English summary

Happily Unmarried Bollywood Divas Who Are Above 30 in telugu

Happily Unmarried Bollywood Divas Who Are Above 30.
Story first published: Friday, November 6, 2015, 13:20 [IST]
Desktop Bottom Promotion