For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ డ్రెస్ కలర్, మీ మూడ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?

By Nutheti
|

మీరు రోజు ప్రారంభించే ముందు షెడ్యూల్స్ అన్నీ చెక్ చేసుకుంటారా ? అలాగే డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదూ.. ! అయితే మీ డ్రెస్ కలర్ కి, మీ వర్క్ కి సంబంధం ఉందని తెలుసా ? మీ మూడ్ ని మార్చేసే సత్తా మీరు వేసుకునే దుస్తుల రంగుకి ఉందని ఎప్పుడైనా గమనించారా ? అవును మీరు ఎంచుకునే డ్రెస్ కలర్ మీ రోజుని డిసైడ్ చేస్తుంది.

 ఆలివ్ ఆయిల్ స్కిన్ టోన్(ఛామన ఛాయ)గల వారికి నప్పే కలర్స్ ఆలివ్ ఆయిల్ స్కిన్ టోన్(ఛామన ఛాయ)గల వారికి నప్పే కలర్స్

మీరు మూడౌట్ అయినా, ప్రశాంతత కోల్పోయినా, ఒత్తిడిగా ఫీలవుతున్నా.. మీరు ఎంచుకునే డ్రెస్ కలర్ తో ఆ బాధలన్నీ మాయం చేసుకోవచ్చు. అలాగే.. మీ బాస్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కూడా ఓ కలర్ సహాయపడుతుంది. అంతేకాదు.. మీపై అందరి అటెన్షన్ పడటానికి కూడా ఎంచుకునే కలర్ డిసైడ్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ పనికి తగ్గ రంగు ఎంచుకుని మీ డేని హ్యాపీగా, సక్సెస్ ఫుల్ గా గడిపేయండి.

లైఫ్ లో బ్యాడ్ కలర్స్

లైఫ్ లో బ్యాడ్ కలర్స్

మనం ఎంచుకునే రంగులు మనపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. చూపుని ఆకట్టుకోవడమే కాదు.. ఈ రంగులు చాలా రకాలుగా మనతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎంచుకున్న కలర్ వల్ల కూడా మూడ్ మారిపోతుంది. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటుంది.

కలర్, గుడ్ లక్

కలర్, గుడ్ లక్

ఇంటీరియర్ డిజైనర్స్ కొన్ని కలర్స్ ని మాత్రమే కొన్ని రూమ్స్ కి వాడతారు. ఎందుకంటే.. అది మూడ్ ని డిసైడ్ చేస్తుంది. ఇన్సిరేషన్, ఎనర్జీ, ప్రశాంతత కలిగే విధంగా గదులను బట్టి రంగులు డిసైడ్ చేస్తారు. కాబట్టి డ్రెస్సింగ్ విషయంలో కూడా ఇలా ఎందుకు ఆలోచించకూడదు ? ఏ కలర్ లో ఎంత పవర్ ఉందో తెలుసుకుని.. వాటిని ధరించి వచ్చే మార్పులను తెలుసుకుందాం.

ఎరుపు

ఎరుపు

ఎదుటివాళ్ల అటెన్షన్ కావాలనుకుంటున్నారా ? అయితే రెడ్ కలర్ ఎంచుకోండి. అలాగే ఈ కలర్ రొమాన్స్, ప్యాషన్ ని సూచిస్తుంది. అలాగే రెడ్ కలర్ ఆకలిని పెంచుతుంది.. దాంతో పాటు జంక్ ఫుడ్ తినేలా ప్రోత్సహిస్తుందట.

ఆరెంజ్

ఆరెంజ్

రెడ్ కలర్ లాగే.. ఆరెంజ్ కూడా అటెన్షన్ ని, ఎనర్జీని సూచిస్తుంది. అయితే ఎరుపు రంగు అంత బ్రైట్ గా ఉండదు. అలాగే ఈ ఆరెంజ్ కలర్ అందరికీ సెట్ అవదు. కొన్ని స్కిన్ టోన్స్ కి మాత్రమే ఆరెంజ్ కలర్ బావుంటుంది. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ ఎంచుకోవడం వల్ల మీకు పాజిటివ్ మూడ్ ని, ఎనర్జీని ఇస్తుంది.

పసుపు

పసుపు

మీకు ఈ రోజు చాలా డల్ గా, మూడ్ బాగోలేనట్టు అనిపిస్తుంటే.. యెల్లో కలర్ డ్రెస్ ఎంచుకోండి. ఎక్కడలేని ఉత్సాహం మీ సొంతమవుతుంది. అలాగే పసుపు కలర్ తెలివితేటలను, ఇన్స్పిరేషన్ ని ఇస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ సమయంలో యెల్లో కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల మీకు మరింత హెల్త్ ఫుల్ గా ఉంటుంది.

గ్రీన్

గ్రీన్

రకరకాల షేడ్స్ లో ఉండే ఆకుపచ్చ రంగు ప్రశాంతతను, ఉపశమనాన్ని సూచిస్తుంది. అలాగే ప్రకృతిని సూచిస్తుంది. కాబట్టి గ్రీన్ డ్రెస్ ధరించడం వల్ల రిఫ్రెష్ మెంట్ తోపాటు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాబట్టి చాలా అలసిపోయినట్లు ఫీలయినప్పుడు గ్రీన్ డ్రెస్ ధరిస్తే.. చాలా రిలాక్స్ గా ఉంటుంది.

బ్లూ

బ్లూ

బ్లూ కలర్ ప్రశాంతతను సూచిస్తుంది. ఒకవేళ మీరు చాలా ఒత్తిడికి లోనై ఉంటే.. బ్లూ కలర్ ఎంచుకుని చూడండి.. ఎంత రిలాక్స్ గా ఉంటుందో. ఒకవేళ మీరు బాధగా ఉన్నా.. నీలిరంగు దుస్తులను ఎంచుకోవడం వల్ల చాలా క్రియేటివ్ గా ఆలోచించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

పర్పల్

పర్పల్

పర్పల్ కలర్ క్రియేటివిటీ, లక్జరీని సూచిస్తుంది. మీ ఎనర్జీని బూస్ట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఆధ్యాత్మికత, వాస్తవాన్ని తెలుపుతుంది పర్పల్ కలర్. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మీ గోళ్లకు పర్పల్ కలర్ నెయిల్ పాలిష్ వేసి చూడండి.. ఎంత మంచి ఐడియాస్ వస్తాయో..

పింక్

పింక్

పింక్ కలర్ గర్ల్స్ ఫేవరెట్ కలర్ అని అందరికీ తెలుసు. అలాగే రొమాన్స్, హ్యాపీనెస్ ని కూడా సూచిస్తుంది పింక్ కలర్. ఇది చాలా కామ్ నెస్ ని సూచిస్తుంది. కాబట్టి మీరు మీ ఎనర్జీ లెవెల్స్ చూపించాలి అనుకున్నప్పుడు ఈ పింక్ కలర్ ఎంచుకోకూడదు. డేటింగ్ సమయంలో పింక్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీకు పింక్ ఇష్టం లేకపోతే.. ఇది మీకు సహాయపడదు.

వైట్

వైట్

సూర్య కిరణాలను తట్టుకోలేకపోతున్నారా ? అయితే వైట్ ఎంచుకోండి. చాలా కూల్ గా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ప్రశాంతతన, అమాయకత్వాన్ని, సింప్లిసిటీని, స్వచ్ఛతను సూచిస్తుంది తెలుపు రంగు.

బ్లాక్

బ్లాక్

ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మీ పనిలో భాగంగా ప్రమోషన్ ప్రాసెస్ లో పాల్గొనడానికి వెళ్తున్నా బ్లాక్ కలర్ ఎంచుకోండి. ఇది పవర్, సీరియస్ నెస్, అథారిటీ, రెస్పాన్సబిలిటీ వంటి లక్షణాలు సూచిస్తుంది. మీ బాస్ ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ.. మీలో గమనించగలరు.

చూశారుగా.. ఒక్కో రంగులో ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఇక వెంటనే మీ మూడ్ ని, మీ వర్క్ ని బట్టి ఏ కలర్ డ్రెస్ బెటరో డిసైడ్ అవండి.

English summary

How the colours you wear affect your day

The colours we decide to enclose ourselves affect us more than we think. As a society, we associate colours with so many different things - they have meanings away from simple visual stimulation.
Desktop Bottom Promotion