Latest Updates
-
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.!
క్యాట్ వాక్ నుంచి.. టాప్ హీరోయిన్లుగా మారిన అందగత్తెలు
బాలీవుడ్ లో అగ్రస్థానంలో నటిస్తూ.. మెప్పిస్తున్న బ్యూటీలంతా.. ఒక్కసారిగా హీరోయిన్లు అయిపోలేదు. వాళ్లలో కొంతమంది.. వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. కొంతమంది.. మోడలింగ్ నుంచి డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మోడల్స్ కి యాక్ట్ చేయడం రాదని.. చాలా మంది భావిస్తారు. కానీ.. ఈ మాటను తిరగరాశారు కొందరు బాలీవుడ్ బ్యూటీస్. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి బాంబే టాకీస్ లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు బీ టౌన్ భామలు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. నటనలో సత్తా చాటుకున్న మోడల్స్ కమ్ యాక్టర్స్ ఎవరో చూడండి.

ఐశ్వర్యారాయ్
మోడలింగ్ నుంచి వచ్చి.. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాళ్లలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఒకరు. ఆకట్టుకునే కళ్లు.. మైమరిపించే అందం.. స్టన్నింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకుల మతిపోగొట్టింది. అందంతోనే కాదు.. అభినయంతోనూ.. మెస్మరైజ్ చేస్తున్న ఐష్ మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి తన కెరీర్ మార్చుకుని సక్సెస్ అయింది.

బిపాసా బసు
పొడుగు కాళ్ల అందంతో.. కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న బిప్స్ కూడా మోడలింగ్ తోనే తన కెరీర్ స్టార్ట్ చేసింది. సహజ నటనతో పాటు.. ఆకట్టుకునే శరీరాకృతితో బాలీవుడ్ లో బిపాసా చెరగని ముద్ర వేసుకుంది.

దీపికా పదుకొనె
ఎలాంటి డ్రెస్ వేసినా.. అదరిపోయే లుక్ లో కవ్వించే దీపికా పదుకొనె మోడలింగ్ నుంచి నటిగా మారింది. అద్భుతమైన నటనతో.. ఇండియన్ యాక్టరస్ గా మాంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ

దియా మీర్జా
చక్కని శరీరాకృతి, ఆకర్షణీయమైన అందం.. దియా మీర్జా అందానికి ప్రతీక. ఆన్ స్ర్కీన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టే ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

కత్రినా కైఫ్
బార్బీగాల్ కత్రినా కైఫ్.. డ్యాన్సింగ్ స్టార్ గా ఆకట్టుకుంటోంది. హీరోయిన్ గా రాణిస్తూనే ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న కైఫ్.. మోడల్ కమ్ యాక్టరస్. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా అనేక హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

అనుష్క శర్మ
సెక్సీ బ్యూటీ అనుష్క శర్మ.. ఒకప్పటి మోడలే. విభిన్న పాత్రల్లో.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

లారా దత్త
మోడలింగ్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన లారా.. సక్సెస్ ఫుల్ గా రాణించింది. న్యూ లుక్ తో.. అద్భుతమైన నటనతో.. బాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకుంది లారా దత్త.

నేహా దూపియా
ర్యాంప్ పై మోడల్ గా అదరగొట్టిన నేహా దూపియా.. ఇటు యాక్టర్ గానూ టాలెంట్ నిరూపించుకుంది. నటిగా అడుగుపెట్టిన కొంతకాలానికే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది నేహా.

ప్రీతీ జింటా
డింపుల్ సొగసుతో.. ప్రేక్షకుల మది దోచుకున్న ప్రీతి జింటా కూడా మోడలింగ్ నుంచే వచ్చింది. ఈ ముద్దుగుమ్మ ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్ లో నటించి.. ప్రేక్షకాధరణ పొందింది. ఈ బ్యూటీ తన నటనతో ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది.

ప్రియాంకా చోప్రా
అన్ని రకాలుగా తన సత్తా చాటుకుంటున్న పిగ్గీ చాప్స్ ది మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్. ఆకట్టుకునే అందం.. స్టన్నింగ్ పర్ఫామెన్స్.. సింగింగ్.. ఈ ముద్దుగుమ్మకున్న ప్లస్ పాయింట్స్. మోడల్స్ కి నటన రాదని భావించే వాళ్లు ప్రియాంకా సినిమాలు చూస్తే.. స్టన్ కావాల్సిందే.

సుస్మితా సేన్
స్మైల్ తోనే ఆకట్టుకునే సుస్మితా సేన్.. నటన అందరినీ అలరిస్తుంది. అద్భుతమైన నటన.. సుస్మితాను మోడలింగ్ నుంచి హీరోయిన్ ని చేసింది.

జీనత్ ఆమన్
మోడలింగ్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టి కుర్రకారు మతిపోగొట్టిన జీనత ఆమన్.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నటనలో తనదైన శైలి ప్రదర్శిస్తూ.. ప్రేక్షకులకు చేరువైంది.



Click it and Unblock the Notifications