Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.!
సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అయిన స్వీట్ సిస్టర్స్
సాధారణంగా ఒక ఇంట్లో పిల్లలు పెద్దపిల్లలు ఏమి చదివితే చిన్న పిల్లలు కూడా అదే చదవాలని నిర్ణయించుకుంటారు. అక్క డాక్టరైతే, చెల్లికూడా డాక్టర్ అవ్వాలనుకోవడం...అన్నయ్య ఇంజనీర్ అయితే, తమ్ముడు కూడా ఇంజనీర్ అవ్వాలను కోవడం సహాజం. సాధారణంగా అక్కాచెల్లెళ్లనగానే ఏదో ఒక విషయంలో అయినా పోలికలుండటం సహజం. అది రూపంలో..అలవాట్లలో..ప్రవర్థనలో లేదా మాటల్లో ఇలా ఎందులో అయినా పోలికలుంటాయి. మరి వీటితో పాటు ఇద్దరి కెరీర్ కూడా ఒక్కటే అయితే..? అందులోని ఒకరి నుండి మరొకరు స్పూర్తిదాయకంగా తీసుకోవచ్చు . అదే క్రమంలో ఒకరికొకరు సహకరించుకోవచ్చు లేదా పోటాపోటీగా రాణించువచ్చు.
ఎట్రాక్టివ్ బాడీ షేప్ కలిగిన టాప్ 30 హాట్ సెలబ్రిటీస్
ఇలా సామన్య ప్రజల్లోనే కాదు పొలిటీషియన్స్, సెలబ్రెటీల ఇల్లలో కూడా జరగుతుంటుంది. ముఖ్యంగా సినిమావాల్ల విషయంలో నటనే కెరీర్ గా మలచుకుని, వివిధ భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ సినిమా రంగంలో తమదైన శైలిలలో ..అందం, అభినయం, ప్రతిభా..పాటవాలతో వెండితెరపై వెలుగుతూ అశేష ప్రజానిక అభిమాన్ని సంపాదించుకొన్న కొందరు సినీ స్టార్ల గురించి మీకోసం ఒక స్పెషల్ ఆర్టికల్...

కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్:
ప్రస్తుత జనరేషన్ లో టాప్ 10 హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. ఈమె సినిమాల్లో బాగా పాపులర్ అయిన తర్వాత నిషా అగర్వాల్ కూడా సినీ రంగప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమా రంగంలో సక్సెస్ కాలేక ఈ మద్యనే పెళ్లి చేసేసుకుంది.

శ్రుతిహాసన్-అక్షర హాసన్:
కమల్ హాసన్ వారసురాళ్లుగా సినీ పరిశ్రమకు పరిచయమైన అక్కాచెల్లెళ్లు శ్రుతి మరియు అక్షర హాసన్. అక్క శ్రుతి చిన్నతనం నుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. గబ్బర్ సింగ్ మూవీతో బాగా పాపులర్ అయింది . చెల్లెలు అక్షర హాసన్ వాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ గా పనిచేసింది. ఈమద్య విడుదలైన షమితాబ్ అనే బాలీవుడ్ సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించింది.

కార్తీక-తులసి:
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అందాల తార రాధ వారసురాళ్లుగా సినీ రంగానికి పరిచయమైన అక్కా చెల్లెళ్లు కార్తీకా నాయర్, తులసీ నాయర్. కార్తీకా 2009లో జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తలసీ నాయర్ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది

షాలిని-షామిలి:
సినిమా రంగంలో తమదైన ముద్ర వేసుకున్న అక్కా చెల్లెళ్లలో షాలినీ , షామిలీ సిస్టర్స్ కూడా ఒకరు. షాలిని నాలుగేళ్ల వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తోంది. ఆమె ఎక్కువగా మళియాలసినిమాల్లోనే నటించింది. తెలుగులో జగదేకవీరుడు, అతిలోక సుందరి సిమాలో బాలనటిగా అద్భుత నటన కనబరిచింది. ఇక షామిలీ కూడా చిన్నతనం నుంచే సినిమాల్లో నటించి అక్క బాటలో నడిచింది తమిళంలో వచ్చిన అంజలి చిత్రంలోని నటనకు గాను నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. తెలుగులో ఓయ్ సినిమాతో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది.

ఆర్తి అగర్వాల్ -అదితి అగర్వాల్:
ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమాల్లో నటించి బాగా పేరుతెచ్చుకుంది. ముఖ్యంగి చిరంజీవి సినిమాలతో బాగా పాపులర్ అయింది. అయితే ఈ మద్య అనారోగ్య కారణంగో యూఎస్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ గంగోత్రి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నగ్మ-జోతిక:
90s హీరోయిన్స్ లో బాగా పాపులర్ అయిన నటి నగ్మ. తర్వాత జోతిక చంద్రముఖి సినిమాతో బాగా పాపులర్ అయింది. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.

రాధ -అంబిక :
నైంటీస్ లో ఫేమస్ హీరోయిన్ రాధ. చాలా వరకూ ఆమె సినిమాలన్నీ చిరంజీవితోనే. ఆమె అక్క అంబికా కూడా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ముద్రవేసుకుంది.

రాధిక - నిరోషా:
రాధిక మొదట తన కెరీర్ ను తమిళ సినిమాలతో ప్రారంభించి, తర్వాత తెలుగులో బాగా పాపులర్ అయినటువంటి 90s హీరోయిన్ . తర్వాత నిరోషను కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చింది . వీరిద్దరు తెలుగు ఆడియన్స్ కు సుపరిచతం.

జయసుధ-సుభాషిని:
జయసుధ బాగా సుపరిచితమైన ఒక నేచురల్ యాక్టర్స్ . జయసుధతో పాటు సుభాషిని కూడా అనేక చిత్రాల్లో నట్టించింది.

భానుప్రియ-శాంతి ప్రియ:
90s హీరోయిన్స్ లో బాగా పాపులర్ అయిన నటి భానుప్రియ. ఆమె చెల్లెలు శాంతి ప్రియ కూడా అనేక సినిమాల్లో నటించింది.

కరిష్మా-కరీనా :
సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన అక్కా చెళ్లెళ్లు కరిష్మా అండ్ కరీనా కపూర్. అక్క కరిష్మా కపూర్ 1990లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. దిల్ తో పాగల్ హే, రాజా హిందుస్థానీ, హీరో నెం.1, బీవీ నెం.1, వంటి చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది . తర్వాత చెల్లి కరీనా కపూర్ అక్కకు తగ్గ చెల్లెలుగా ఇప్పటికీ బాలీవుడ్ లో టాప్ హీరోన్లలో ఒకరుగా కొనసాగుతోంది.

శిల్పాశెట్టి-షమితా:
సినీ ఫీల్డ్ లో అతి తక్కువ కాలంలోనే మంచి ఖ్యాతి గడించిన అక్కా చెల్లెళ్లు శిల్పా శెట్టి, షమితా శెట్టి. వీళ్లిద్దరూ సురేంద్ర శెట్టి, సునందా శెట్టి దంపతుల కుమార్తెలు . 1994 అగ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శిల్పశెట్టి తర్వాత అనేక సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకొన్నది. శిల్పా చెల్లెలు షమితా శెట్టి నటించిన ముహబ్బతే చిత్రం చాలా పెద్ద హిట్ ని సొంతం చేసుకుంది.

కాజోల్ అండ్ తనీషా:
బాలీవుడ్ లో ఉన్న అందమైన అక్కా చెల్లెళ్లలో కాజోల్ మరియు తనీషా జంట కూడా ఒకటి. వీరిద్దరిలో అక్క కాజొోల్ దేవ్ గన్, చెల్లెలు తనీషా ముఖర్జీ. కాజోల్ చిన్నప్పుడే బేఖుదీ అనే చిత్రంలో నటించింది తర్వాత ఆమె నటించిన బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హే, చిత్రాలు ఎంత పెద్ద విజాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాజోల్ చెల్లి కేవలంలో హిందులోనే కాదు, తమిళం, తెలుగు, మరాటీ సినిమాల్లో నటించింది. తెలుగులో కంత్రి సినిమాలో నట్టించింది.

మలైకా- అమృతా:
సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్రవేసుకొన్న అక్కా చెల్లెళ్లు మలైకా, అమృతా అరోరా ఖాన్స్, వీరు కేవలంలో హీరోయిన్లుగానే కాకుండా డ్యాన్సర్, మోడల్, వీడియో జాకీలుగా కూడా పనిచేస్తున్నారు.



Click it and Unblock the Notifications