For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితాన్ని ఆస్వాదించాలంటే అవసరమైన అంశాలు

By Nutheti
|

జీవితంలో ఏవీ శాశ్వతం కావు. జీవితాన్ని హుందాగా.. ఆనందంగా.. నచ్చినట్టు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ టెక్నికల్ యుగంలో లైఫ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆరోగ్యం, ఫైనాన్స్, జాబ్ ఇలా రకరకాల అంశాలు ప్రధానమయ్యాయి.

ఆహారం, ఇల్లు, బట్టలు.. ఇవి ఒకప్పటి మాటలు. ఇవి సాధారణ జీవితానికి అవసరైనవి. కానీ.. ఇప్పుడున్న జనరేషన్ లైఫ్ లీడ్ చేయాలంటే.. ఈ మూడు మాత్రమే కాదు.. ఇంకా చాలా కావాలంటున్నారు. వాళ్లు కావాలనడంలో తప్పు లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నా.. సంతృప్తి చెందాలన్నీ కొన్ని కంపల్సరీ అయ్యాయి. బిజీ లైఫ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తున్న అంశాలేంటో ఓ లుక్కేద్దాం..

హెల్త్

హెల్త్

జీవితం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే.. జీవితం బావుంటుంది. అన్ని సందర్భాల్లో ఎనర్జిటిక్ గా, చురుగ్గా, ఉత్సాహబరితంగా ఉండాలి. శారీరక వ్యాయామం, ఆధ్యాత్మికత ఉన్నప్పుడే ఆరోగ్యం బావుంటుంది. కాబట్టి నిత్యం వ్యాయామానికి సమయం కేటాయించడం మంచిది.

ఫైనాన్స్

ఫైనాన్స్

ఈ సమాజంలో సరైన జీవితం కావాలంటే.. ప్రతి అడుగులోనూ డబ్బు చాలా అవరమవుతోంది. ప్రస్తుతం సంపాదించడం దాన్ని ప్రణాళికాబద్దంగా వినియోగించుకోవడమనేది చాలా పెద్ద టాస్క్ లా మారిపోయింది. డబ్బు విషయంలో ప్లానింగ్ లేకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్కరు సంపాదించాలి.. సేవ్ చేయాలి.. అవసరాలకు తగ్గట్టు ఔచిత్యంతో ఖర్చు పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

కెరీర్

కెరీర్

ఆర్థికంగా, ఆరోగ్యంగా జీవితాన్ని అనుభవించాలంటే.. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. డబ్బులు సంపాదించే కెపాసిటీతో డిజైనింగ్ కూడా చాలా ముఖ్యం. కెరీర్ లో సక్సెస్ కావాలంటే.. సొంతంగా నిర్ణయించుకునే శక్తి ఉండాలి. మీ స్టామినా, స్కిల్స్, అచీవ్ మెంట్స్ పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కెరీర్ లో సక్సెస్ అయినప్పుడే జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశాలుంటాయి.

ఎడ్యుకేషన్

ఎడ్యుకేషన్

కెరీర్ లో సక్సెస్ కావాలంటే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నాలెడ్జ్, స్కిల్ ని బట్టి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాలెడ్జ్ అంటే తెలుసుకోవాల్సినది.. స్కిల్ అంటే.. లైఫ్ లో, కెరీర్ లో వచ్చే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటప్పుడు ఉపయోగించేది. జీవితాంతం కొత్త అంశాలు నేర్చుకునే అమూల్యమైన శక్తి మనుషుల మెదడుకి ఉంది. కాబట్టి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని నేర్చుకుంటూ.. సరైన దారిలో వెళ్లడం మంచిది.

రిలేషన్స్

రిలేషన్స్

మానవ జీవితం సంబంధ బాంధవ్యాలపై ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ, నెయిబర్స్, సమాజం, రాజకీయాలతో సంబంధం ఏర్పరచుకుంటారు. సంబంధాలు కుంటుంబం, సమాజంపై బాధ్యతలను క్రియేట్ చేస్తున్నాయి. ఇవి ప్రస్తుతం చాలా అవసరమౌతున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే... రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి.

లైఫ్ స్టైల్

లైఫ్ స్టైల్

లైఫ్ స్టైల్ నేటి ప్రపంచాన్ని నడిపిస్తోంది. డైట్, ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు ఎలాంటి ఆహారం, ఎలాంటి అలవాట్లు, ఎలాంటి వ్యాయామం అవసరమో ముందుగానే గ్రహించాలి. అప్పుడే.. ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. బాడీ ఫిట్ గా ఉంటుంది.

ఫిలాసఫీ

ఫిలాసఫీ

జీవితంలో ఏ పని చేసినా.. దానికో అర్థం ఉండాలి... కారణం ఉండాలి. కారణం లేకుండా చేసే పనుల వల్ల నిరాసక్తి కలుగుతుంది. జీవితం చివరి వరకు.. మోటివేషన్ అవసరం. జీవితంలో టార్గెట్ పెద్దగా పెట్టుకుని దశల వారీగా.. లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు సంతోషంగా జీవితాన్ని అనుభవించవచ్చు.

English summary

Seven Essentials of life in telugu

Life depends on the Health of Body, Mind and Spirit. We need to keep all of them lively, energetic, active and enthusiastic all the time.
Story first published: Monday, November 2, 2015, 16:32 [IST]
Desktop Bottom Promotion