For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాషన్ ముసుగులో అమ్మాయిలకు హెల్త్ ప్రాబ్లమ్స్

|

ట్రెండ్, ఫ్యాషన్ లకు అమ్మాయిలు తెగ ఎట్రాక్ట్ అయిపోతున్నారు. అందంగా.. ఎట్రాక్టివ్ గా కనిపించడానికి.. తహతహలాడుతున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్, యాక్సెసరీస్ మార్చేస్తున్నారు. డ్రెస్సింగ్ నుంచి చెప్పుల వరకు అన్నింటిలోనూ విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతున్నారు.

ట్రెండ్ ఫాలో అవడం మాటేమోగానీ.. ఫ్యాషన్ మానియాలో పడి అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో లభించే దుస్తులు, వస్తువులను ఎడాపెడా వాడేసి... నడుము, వెన్ను, మెడ, ఛాతి నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

బ్రా

బ్రా

మహిళలు నిత్యం ధరించే వాటిలో ముఖ్యమైనవి బ్రాలు. కానీ వీటిని ఎంచుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. 70 శాతం మంది మహిళలు సరైన బ్రా ధరించడం లేదు. దీంతో వెన్నునొప్పీ, ఛాతీ నొప్పీ వేధిస్తున్నాయి. మరికొందరిలో చర్మ వ్యాధులూ, వెన్నుఆకృతిలో తేడాలు బాధిస్తున్నాయి. సరైన కొలతలున్న బ్రాలు ధరిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

హ్యాండ్ బ్యాగ్

హ్యాండ్ బ్యాగ్

హ్యాండ్ బ్యాగ్. ఇది అమ్మాయిలకు నిత్యావసర వస్తువు లాంటిది. ఎందుకంటే బయటకి వెళ్లాలంటే.. హ్యాండ్ బ్యాగ్ తప్పనిసరి. కానీ ఈ బ్యాగుల వల్ల చాలామందిలో వెన్నునొప్పి, నడుంనొప్పి వస్తోంది. హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లాల్సి వస్తే.. వీలైనంత వరకు బరువు తగ్గించుకోవడం మంచిది.

హై హీల్స్, ప్లిప్ ఫ్లాప్స్

హై హీల్స్, ప్లిప్ ఫ్లాప్స్

ప్లిప్ ఫ్లాప్స్ వేసుకోవడానికి సౌకర్యంగా.. అందంగా కనిపిస్తాయి. కానీ అవి పాదాలకు కంఫర్ట్ గా అనిపిస్తే ఓకే.. కానీ కొన్ని కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల కీళ్లు దెబ్బతింటాయి. పాయింట్ హీల్స్‌ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురవుతుంది.

బెల్ట్

బెల్ట్

మహిళలు ఇప్పుడు బెల్ట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఎంచుకునేటప్పుడు సౌకర్యంగా ఉన్నాయా లేదా అన్నది గమనించుకోవాలి. నడుముకు బిగుతుగా.. పట్టేనట్టు ఉంటే.. వెన్నునొప్పికి కారణమౌతుంది. బెల్టులు బిగుతుగా పెట్టుకొంటే కడుపులో నొప్పి రావడంతో పాటూ కాసేపటికి కాళ్లనూ మొద్దుబారేలా చేస్తాయి. బెల్టును ఎప్పుడూ వదులుగానే పెట్టుకోవాలి.

పెన్సిల్ స్కర్ట్

పెన్సిల్ స్కర్ట్

ట్రెండీ దుస్తుల్లో పెన్సిల్ స్కర్ట్ ఒకటి. ఇవి చూడ్డానికి మోడ్రన్ గా.. అందంగా కనిపిస్తాయి. చాలా ఎట్రాక్టివ్ గా ఉంటాయి. అయితే బిగుతుగా ఉండటం వల్ల శరీర కదలికలను కట్టడి చేస్తాయి. దీంతో నిలబడేందుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. దీనికారణంగా వెన్ను సమస్యలు పెరుగుతాయి.

స్కిన్ టైట్ దుస్తులు

స్కిన్ టైట్ దుస్తులు

మోడ్రన్ గా కనిపించడానికి అమ్మాయిలకు బోలెడన్ని డ్రెస్సులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఎక్కువగా ట్రెండీగా మారాయి. ఇలాంటి టైట్ దుస్తులను వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి వల్ల కాళ్లకు రక్త సరఫరా నిలిచిపోయి.. కండరాలు, నరాలు చచ్చుబడిపోయి.. కాళ్ల వాపులు వచ్చే అవకాశముంది.

హెయిర్ బ్యాండ్స్

హెయిర్ బ్యాండ్స్

హెయిర్ బ్యాండ్స్ వల్ల మహిళలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇవి తలను పట్టేసినట్టు, జుట్టును లాగుతున్నట్లు ఉంటాయి. దీనివల్ల తలనొప్పి కూడా మొదలవుతుంది. కాబట్టి వీటిని తరచుగా వాడటం మంచిది. లేదా వదులుగా వేసుకోవడం బెటర్.

పర్ఫ్యూమ్స్

పర్ఫ్యూమ్స్

పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. ఎందుకంటే.. రోజంతా ఫ్రెష్ గా.. సువాసనాబరితంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ వీటిని వాడుతూ ఉంటారు. కానీ వీటిని కొనేటప్పుడు చర్మతత్వానికి సరిపోతుందా లేదా అని సరిచూసుకోవాలి. లేదంటే.. అలర్జీలు, వాసన పడక తలనొప్పి వచ్చే అవకాశాలుంటాయి.

English summary

shocking: fashion affects Womens health: life in telugu

shocking: fashion affects Womens health
Story first published: Thursday, October 22, 2015, 17:01 [IST]
Desktop Bottom Promotion