For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెట్టెలు ధరించడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

By Nutheti
|

మెట్టెలు లేదా మట్టెలు భారతీయ సంప్రదాయంలో భాగం. పెళ్లైన ప్రతి స్త్రీ మెట్టెలు ధరించడం ఆనవాయితీ వస్తోంది. పెళ్లైయిందని సంకేతాన్ని తెలుపుతూ.. కాలి బొటనవేలు పక్కన ఉన్న వేలికి రింగు పెడతారు. ఇది వెండితో తయారు చేసినదై ఉంటుంది.

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? ఎరుపు రంగు తిలకమే ఎందుకు ?

భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళ రెండు వేళ్లకు మెట్టెలు ధరిస్తుంది. ఆమెకు భార్యగా, సోదరిగా గుర్తింపునిస్తూ ఈ మెట్టెల సంప్రదాయం ఉంది. ఒకటి భర్తను, మరొకటి సోదరుడిని సూచిస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా.. ఒక దాన్ని తీసేస్తారు. ఒకవేళ భర్త చనిపోతే.. ఆమె బాధ్యతలు తన సోదరుడు చూసుకోవాలని సంప్రదాయం వివరిస్తుంది.

READ MORE: మీ ఆరోగ్యానికి నిజంగా మంచి చేసే 7 భారతీయ సంప్రదాయాలు

హిందూ సంప్రదాయాల వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆచారం ఏదో ఒక మంచి ఫలితం, ప్రయోజనం కలిగి ఉంటుంది. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్ర్తీలకు ఆయువు పట్టు లాంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని... అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది. మెట్టెలు ధరించడం వెనక ఉన్న మరిన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మెట్టెల వెనక కథ

మెట్టెల వెనక కథ

పూర్వం దక్షుడు తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేని పార్వతి దేవి కోపంతో, తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించిందని, అందులో తాను ఆత్మార్పణ చేసుకుందని పురాణ గాధ చెబుతుంది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించడం సాంప్రదాయంగా వచ్చిందని చెబుతారు.

రామాయణంలో మెట్టెలు

రామాయణంలో మెట్టెలు

భారతీయ గొప్ప ఇతిహాసం రామాయణంలో మెట్టెలు కీలక పాత్ర పోషించాయి. సీతను రావణుడు అపహరించినప్పుడు మార్గంమధ్యలో ఆమె రాముడికి సంకేతం తెలుపుతూ.. తన మెట్టెను కిందకు వదిలేస్తుంది. దీన్నిబట్టి పురాతన కాలం నుంచే మెట్టెలు ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది.

గర్భాశయం

గర్భాశయం

కాలి రెండో వేలికి ఉన్న ఒక నరం.. గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటుందట. అది గర్భాశయం ద్వారా గుండె కు చేరుతుందని మన పూర్వీకులు కనుగొన్నారు. అందుకే ఆ వేలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆ నరం యాక్టివ్ గా ఉంటుంది. దీనివల్ల గర్భాశయానికి, ఇతర అవయవాలకు బలం వస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.

రుతుచక్రం

రుతుచక్రం

మెట్టెలు గర్భాశయాన్ని స్ర్టాంగ్ గా చేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ సజావుగా సాగి ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల స్ర్తీల రుతుచక్రం ప్రతి నెల కరెక్ట్ గా ఉంటుంది.

త్వరగా గర్భం దాల్చడానికి

త్వరగా గర్భం దాల్చడానికి

ఆరోగ్యకరమైన, శక్తివంతమైన గర్భాశయంతో పాటు రుతుక్రమం సరిగ్గా ఉన్నప్పుడు గర్భం దాల్చడం సులభంగా మారుతుంది. త్వరగా గర్భం పొందడానికి అవకాశముంటుంది. ఈ కారణం వల్లే పెళ్లైన మహిళలు మెట్టెలు ధరించడం ఆనవాయితీ మారింది.

శరీరానికి చైతన్యం

శరీరానికి చైతన్యం

మెట్టెలు సాధారణంగా వెండివి లేదా బంగారానివి ధరిస్తారు. వెండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది భూమి నుంచి ఎనర్జీని గ్రహించి శరీరానికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి.

అందుకే ఇది ధరించడం ఆనవాయితీ, సంప్రదాయంగా మారింది.

శుభసూచకం

శుభసూచకం

పెళ్లైన మహిళలను ముత్తైదువులు అంటారు. వీళ్లకు బొట్టు, గాజులు, మెట్టెలు చాలా ముఖ్యమైనవి. అందుకే మెట్టెలు ధరించడం శుభసూచకం, మంగళకరం. ఆడవాళ్లకు మరింత సౌభాగ్యాన్ని తీసుకొస్తాయి మెట్టెలు.

కామం

కామం

పురుషుల కంటే స్ర్తీలలో కామం ఎక్కువట. పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మహర్షులు స్ర్తీలు మెట్టెలు ధరిస్తే కొంత కామం తగ్గుతుందని వివరించారు. అలా పురుషునితో సమానంగా ఉంటుందని, భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రావని మెట్టెల ఆచారం వివరిస్తుంది.

ప్రసవం సులువుగా జరగడానికి

ప్రసవం సులువుగా జరగడానికి

మహిళలకే మెట్టెలు ఎందుకు అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే సంతానాభివృద్ధికి, సుఖ ప్రసవానికి అనుకూలమైన నాడులను సున్నితంగా నొక్కుతూ ఉంటాయి మెట్టెలు. దీనివల్ల ప్రసవం సులభంగా, సజావుగా జరుగుతుందని పూర్వీకుల నమ్మకం.

చూశారుగా భారతీయ సంప్రదాయం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్. ఈ సంప్రదాయం ఫాలో అయి.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

English summary

Things You Did Not Know About the Indian Toe Ring: Reasons to wear toe ring

The Metti or the Indian toe ring is a must for married Indian women. It is worn on the bride’s second toe during her wedding to signify her marital status. In Indian culture, there is a belief that an Indian woman wears a set of Metti to represent the role a wife and a sister.
Desktop Bottom Promotion