For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రా ఎంపికలో ఫెయిల్ అవుతున్నారా ? ఇవిగో సింపుల్ ట్రిక్స్

By Nutheti
|

ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే.. డిఫరెంట్ డ్రెస్ కోసం రకరకాల షాపులు తిరుగుతాం. ఎంత టైమ్ అయినా.. స్పెండ్ చేసి.. నచ్చిన డ్రెస్ దొరికే వరకు వెతుకుతూ ఉంటాం. నచ్చిన డ్రెస్ దొరికిన తర్వాత.. మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాం. ఎందుకు ? డ్రెస్ బాగానే సెలెక్ట్ చేసుకున్నప్పటికీ.. బ్రా విషయానికి వచ్చేసరికి చాలా మంది డైలమా పడుతుంటారు. ఎలాంటిది బావుంటుందో తెలియక తికమక పడుతుంటారు.

ఎలాంటి డ్రెస్ కి ఎలాంటి బ్రా సెట్ అవుతుందో చాలామందికి తెలియదు. ఇదే చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. మార్కెట్ లో రకరకాల బ్రాలు ఉంటాయి. కానీ.. ఏ డ్రెస్ కి ఎలాంటి బ్రా పర్ఫెక్ట్ అనే విషయంలో.. క్లారిటీ ఉండదు. అయితే.. మీకోసమే.. ఇలాంటి డైలమా నుంచి బయటపడేసే.. ట్రిక్స్ ఇక్కడున్నాయి. లెట్స్ చెక్ అవుట్..

స్పోర్ట్స్ బ్రా

స్పోర్ట్స్ బ్రా

స్పోర్ట్స్ బ్రా ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్ లో ఉండాలి. ఇది సపోర్ట్ మాత్రమే కాదు.. బ్రెస్ట్ సాగింగ్ నుంచి అరికడుతుంది. ఒకవేళ వర్కవుట్ చేయాలనుకునే అమ్మాయిలకు ఈ బ్రా పర్ఫెక్ట్ మ్యాచ్.

స్ర్టాప్ లెస్ బ్రా

స్ర్టాప్ లెస్ బ్రా

డీప్ కట్స్, పెద్ద పెద్ద చేతులు ఉన్న డ్రెస్ లలోకి స్ర్టాప్ లెస్ బ్రాలు బాగా సెట్ అవుతాయి. ఇవి సపోర్ట్ లేనట్టు ఉన్నా.. చెస్ట్ మొత్తం సపోర్ట్ ఉంటుంది. ఇవి చాలా కంఫర్టబుల్ లుక్ అందిస్తాయి.

కప్ లెస్ బ్రా

కప్ లెస్ బ్రా

కప్ లెస్ బ్రాలు ఎట్రాక్టివ్ లుక్ కలిగి ఉంటాయి. స్క్వేర్ నెక్ డ్రెస్ లకు ఇలాంటి బ్రాలు పర్ఫెక్ట్ లుక్ తీసుకొస్తాయి.

ప్యాడెడ్ బ్రా

ప్యాడెడ్ బ్రా

ప్యాడెడ్ బ్రాలు ఎలాంటి డ్రెస్ కైనా సెట్ అవుతాయి. ఈ ప్యాడ్స్ తక్కువ ఉన్నవీ ఉంటాయి.. ఎక్కువ ఉన్నవీ ఉంటాయి. మీ డ్రెస్ కి తగ్గట్టు.. మీకు నచ్చిన వాటిని ఎంచుకోవాలి. ఈ బ్రాలు ధరించడం వల్ల పర్ఫెక్ట్ లుక్, షేప్ ఉంటుంది.

ఫ్రంట్ ఓపెన్ బ్రా

ఫ్రంట్ ఓపెన్ బ్రా

ఫ్రంట్ ఓపెన్ బ్రాలు చాలా కన్వినెంట్ గా ఉంటాయి. ఇవి డైలీ యుజ్ కి బావుంటాయి. బ్యాక్ జిప్, బ్యాక్ స్ర్టాప్స్ ఉన్న డ్రెస్ ఎంచుకున్నప్పుడు ఇలా ఫ్రంట్ ఓపెన్ బ్రా వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.

టీ షర్ట్ బ్రా

టీ షర్ట్ బ్రా

ప్రస్తుతం కాలేజ్ కి వెళ్లే అమ్మాయి అయినా.. ఆఫీస్ లకు వెళ్లే అమ్మాయిలైనా.. టీ షర్ట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. కానీ టీ షర్ట్ లో అందంగా కనిపించడానికి.. టీ షర్ట్ బ్రాస్ బావుంటాయి. టీ షర్ట్ పేరుతో ఉండే బ్రాస్ కి కప్స్ ఉంటాయి. వీటిని టీ షర్ట్స్ లో మాత్రమే కాదు.. టైట్ గా ఉండే టాప్స్ కి కూడా ఉపయోగించవచ్చు.

హాల్టర్ నెక్ బ్రా

హాల్టర్ నెక్ బ్రా

హాల్టర్ నెక్ బ్రాలు హాల్టర్ నెక్ డ్రెస్ లలోకి బాగా సెట్ అవుతాయి. ఒకవేళ డీప్ వీ నెక్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటే.. వీటిని ఎంచుకుంటే సరిపోతుంది. సమ్మర్ లో ఎక్కువగా ఇష్టపడే హాల్టర్ డ్రెస్ లలోకి ఈ బ్రా మరింత ఆకర్షణీయమైన లుక్ తీసుకొస్తాయి.

English summary

What Kind Of Bra Goes With What Kind Of Dress

We jump from showroom to showroom to look for that perfect dress for a special occasion. To find a bra that allows us to flawlessly wear the dress with the cuts we desire is like hoping for rain in the draught.
Desktop Bottom Promotion