For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఫాస్ట్ గా ఆలోచిస్తారా ?

By Swathi
|

మగవాళ్లు, ఆడవాళ్లు అన్న వ్యత్యాసం లేకుండా.. అందరూ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో అంతరిక్షం నుంచి అన్నింటా.. మగవాళ్లకేం తక్కువ కాదని ఆడవాళ్లు నిరూపిస్తూనే ఉన్నారు. అయితే.. ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. మగవాళ్లకు, ఆడవాళ్లకు ఉండే నిజమైన వ్యత్యాసాలేంటో తెలుసా ?

READ MORE: స్త్రీల గురించి పురుషులు అర్ధం చేసుకోలేని ఖచ్చితమైన విషయాలు

లేడీస్ అంటేనే ఎక్కువగా మాట్లాడతారని తెలుసు. నిజమే మగవాళ్ల కంటే.. ఆడవాళ్లు చాలా ఎఫెక్టివ్ గా కమ్యునికేట్ అవుతారట. సమస్యల పరిష్కారానికి ఎలా స్పందించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో ఆడవాళ్లు చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తారట. అలాగే అందరిమధ్యలో ఉన్నప్పుడు సౌండ్, ఎమోషన్, జాలితో తమ ఫీలింగ్స్ బయటపెట్టగలరట. అదే మగవాళ్లు తక్కువ మాట్లాడుతారు, ఎక్కువగా వాళ్లకు ఇచ్చిన పని పూర్తి చేయడానికి ఫోకస్ చేస్తారట. ఇంతేనా.. ఇలాంటి ఎన్నో ఖచ్ఛితమైన డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుందా...

నిర్ణయం

నిర్ణయం

ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ల మనసుని నమ్ముతారు. మగవాళ్లు లాజిక్ గా థింక్ చేయడం, చాలా నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటారు. నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అదే అమ్మాయిలు వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో తెలుసుకోగలుగుతారు.

మెదడు

మెదడు

మగవాళ్లు ఎడమవైపు మెడదు, ఇతర భాగాల ద్వారా పనిలో పర్ఫెక్ట్ గా ఉండగలుగుతారు. అదే ఆడవాళ్లు అయితే.. రెండువైపులా సమానంగా ఉపయోగించుకుని పని చేయగలుగుతారు. మగవాళ్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ద్వారా ఎఫెక్టివ్ గా ఆలోచించగలుగుతారు. అదే ఆడవాళ్లు చాలా క్రియేటివ్ గా ఆలోచించి పరిష్కారం ఆలోచించగలరు.

స్విచ్ ఆఫ్

స్విచ్ ఆఫ్

ఆడవాళ్లు ఎప్పుడూ ఆలోచనలు, ప్లానింగ్స్ తో బిజీగా ఉంటారు. అందుకే వాళ్లు మల్టీ టాస్క్ చేయగలుగుతారు. కానీ.. మగవాళ్లు తమ మెదడుని స్విచ్ ఆఫ్ చేసి కాస్త రెస్ట్ ఇవ్వగలరు. వాళ్లు కొన్ని సందర్భాల్లో ఏమీ ఆలోచించకుండా.. నింపాదిగా ఉండగలరు.

భాష

భాష

మగవాళ్లలో కంటే మహిళల్లో ల్యాంగ్వేజ్ పెద్దగా ఉంటుందట. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి. మెదడులోని రెండు భాగాల ద్వారా మహిళలు ఆలోచిస్తే.. మగవాళ్లు కేవలం ఎడమవైపు మెదడు భాగం నుంచి మాత్రమే ఆలోచిస్తారట.

వస్తువులు కనిపెట్టడంలో

వస్తువులు కనిపెట్టడంలో

కళ్ల ముందే వస్తువు ఉంటుంది. కానీ.. మగవాళ్లు చూడలేకపోతారు. ఉదాహరణకు ఫ్రిడ్జ్ లో వస్తువుని అతను కనపెట్టలేకపోతాడు. కానీ.. ఆడవాళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు. ఎందుకంటే.. ఆడవాళ్లకు పెరిఫెరల్ విజన్ మగవాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

ఎమోషన్స్

ఎమోషన్స్

మగవాళ్ల కంటే ఆడవాళ్లు తమ ఫీలింగ్స్ బాగా ఎక్స్ ప్రెస్ చేయగలుగుతారు. దీనికి వీళ్లలో ఉండే లింబిక్ సిస్టమ్ చాలా పెద్దగా ఉండటమే. దీని కారణంగా ఆడవాళ్లు ఎక్కువ ఆలోచనా శక్తి కలిగి ఉంటారు. అలాగే.. డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. హార్మోన్స్ లో మార్పులు, డెలివరీ తర్వాత, రుతుచక్రం సమయంలో ఎక్కువగా డిప్రెషన్ కి లోనవుతారు.

షాపింగ్

షాపింగ్

ఇందులో ఎలాంటి రీసెర్చ్ లేదు. ఆడవాళ్లకు షాపింగ్ అంటే పిచ్చి. కానీ మగవాళ్లకు మాత్రం షాపింగ్ అంటే.. అస్సలు ఇష్టం ఉండదు. ఆడవాళ్లు షాపింగ్ తో రోజంతా ఫన్ గా, హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ మగవాళ్లు షాపింగ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

సైలెన్స్

సైలెన్స్

మగవాళ్లు సైలెంట్ ఉండటాన్ని ఇష్టపడతారు. అలాగే.. ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఆడవాళ్లు మాట్లాడటం చాలా ఇష్టంగా భావిస్తారు. మగవాళ్లు ఎక్కువ మాట్లాడకపోతే.. తమతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని భావిస్తారు.

పెయిన్

పెయిన్

పెయిన్ కి మగవాళ్లు, ఆడవాళ్లు చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. నొప్పి తగ్గడానికి ఆడవాళ్లకు ఎక్కువ మందు కావాలి. కానీ మగవాళ్లు పెయిన్ తట్టుకోగలుగుతారు.

English summary

9 Hilarious but true differences between Men and Women

9 Hilarious but true differences between Men and Women. Women tend to communicate more effectively than men, focusing on how to create a solution that works for the group, talking through issues, and tone, emotion, and empathy whereas men tend to be more task-oriented, less talkative, and more isolated.
Desktop Bottom Promotion