For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాపులర్ స్టార్స్ నమ్మే సక్సెస్ సెంటిమెంట్ ఏంటో తెలుసా ?

By Swathi
|

చాలా మంది సెలబ్రిటీలు తన సక్సెస్ వెనక టాలెంట్, హార్డ్ వర్క్ తో పాటు.. కొంచెం అదృష్టం కూడా ఉంది అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది అదృష్టం వాళ్ల జీవితంలో, సక్సెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని నమ్ముతారు.

సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్.. సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్..

ఎక్కడ, ఎలా విజయం సాధించాలన్నా పట్టుదల, లక్ష్యం, కష్టపడే తత్వం చాలా అవసరం. అయితే వీటితో పాటు.. అదృష్టం కూడా ఉండాలనే భావన ఇండియన్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా.. దేవుడి దయగా భావిస్తుంటారు. మరికొంతమంది వాళ్ల జీవితంలో కీలక మార్పులు, మలుపులకు ప్రత్యేక కారణాలు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది అలా వస్తువులను, మనుషులను లక్కీగా భావించడానికి మూఢనమ్మకంగా, అదో ఆకర్షణ మాత్రమే అని కొట్టిపారేస్తుంటారు. కానీ.. మన సెలబ్రెటీలే.. ఇలాంటి విషయాలను నమ్ముతున్నారని మీకు తెలుసా ?

READ MORE: భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...! READ MORE: భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

ఇప్పటివరకు సక్సెస్ అయిన సెలబ్రిటీలకు కూడా ఇలాంటి నమ్మకాలున్నాయి. వాళ్ల సక్సెస్ వెనక టాలెంట్, కష్టంతో పాటు.. అదృష్టాన్ని తీసుకొచ్చిన వస్తువులు, మనుషులు ఉన్నారని చెబుతున్నారు. మరి ఏ సెలబ్రెటీ జీవితంలో ఎవరు లక్కీ, ఏ స్టార్స్ కి ఏ వస్తువు సక్సెస్ కి కారణమయ్యాయో తెలుసుకోవాలని ఉందా ? అయితే ఆలస్యం చేయకుండా.. ఈ స్టోరీలోకి ఎంటర్ అయిపోండి...

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ని ప్రభావితం చేసిన లక్కీ లక్ష్మి ఎవరో తెలుసా ? సోనాక్షి సిన్హా. అదెలా అనుకుంటున్నారా ? అవును వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రౌడీ రాథోడ్ సినిమాయే ఇందుకు కారణం. బాక్సాఫీస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో అక్షయ్ టాప్ రేంజ్ కి వెళ్లిపోయారు. అందుకే.. అక్షయ్ లక్కీ లక్షి సోనాక్షి అట.

శిల్పాశెట్టి

శిల్పాశెట్టి

సెలబ్రెటీ బిగ్ బ్రదర్ షో, ఐపీఎల్, యోగా సీడీ ఇలా రకరకాలుగా సక్సెస్ ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తోంది పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి. మరి ఈ ముద్దుగుమ్మకు అదృష్టం తీసుకొచ్చినది ఏంటో తెలుసా ? ఎమరాల్డ్ రింగ్. నిజమే.. వాళ్ల అమ్మ సూచన మేరకు ఈ రింగ్ పెట్టుకున్నప్పటి నుంచి.. చాలా సక్సెస్ అయ్యానని చెబుతోంది శిల్పాశెట్టి.

మాధవన్

మాధవన్

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ అంటే మాధవన్ కి ఎక్కడలేని క్రేజ్. త్రీ ఇడియట్స్ సినిమాలో ఓపెనింగ్ సీన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తీశారట. అందుకే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిందని.. తను వెడ్స్ మను సినిమా కూడా అదే ఎయిర్ పోర్ట్ తీయాలని ఫిల్మ్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేశాడట స్మార్ట్ హీరో మాధవన్.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

కొన్నేళ్ల క్రితం అమితాబచ్చన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక్కసారిగా కంపెనీలో నష్టం, కెరీర్ లో ఫెయిల్యూర్స్ తో చాలా అప్ సెట్ అయ్యారు. అదే సమయంలో.. ఓ జ్యోతిష్యుడు బ్లూ రింగ్ పెట్టుకోవాలని సూచించారట. అంతే ఒక్క రింగ్ తో.. కౌన్ బనేగా కరోర్ పతి సినిమా సక్సెస్ ఇచ్చింది.

సమీరా రెడ్డి

సమీరా రెడ్డి

అనిల్ కపూర్ తో కొన్ని సినిమాలు తీశాక.. సమీరా రెడ్డికి అదృష్టం పట్టుకుందంటే మీరు నమ్ముతారు కదూ. అందుకే ఈ సహనటుడినే తాను అదృష్టంగా ఫీలవుతుందట. ముజఫిర్, తేజ్, నో ఎంట్రీ వంటి సినిమాల్లో అనిల్ కపూరే నటించారు.. అందుకే తనకు లక్కీగా అనిల్ కపూర్ ని భావిస్తుందట.

విద్యాబాలన్

విద్యాబాలన్

విద్యాబాలన్ లక్కీ లక్ష్మి బీడ్స్ అట. అందుకే ఈ బ్యూటీ ఫిల్మ్ ప్రమోషన్స్, అవార్డ్ ఫంక్షన్స్, సోషియల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ లో వచ్చినా.. బీడ్స్ కంపల్సరీ వేసుకుంటుంది. అలాగే శారీస్ కి అయితే రుద్రాక్ష బీడ్స్ వేసుకుంటుంది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్లూ భాయ్ లక్కీ చార్మ్ అతని బ్రేస్ లేట్ అని తెలుసా ? అవును.. అందుకే కొన్నేళ్లుగా అదే బ్రేస్ లైట్ ని సల్మాన్ ఉపయోగిస్తున్నారు. ఆన్ స్ర్కీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా.. సల్మాన్ ఈ బ్రేస్ లైట్ తో కనిపిస్తున్నాడు. అదే ఇతని లక్కీ సీక్రెట్.

కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనా కపూర్ ఎవర్ గ్రీన్ లక్కీ పర్సన్ సైఫ్ అలీ ఖాన్. తన కెరీర్ లో, లవ్ లైఫ్ లో కరీనాకు అదృష్టం తీసుకొచ్చింది మాత్రం సైఫ్ అలీ ఖాన్ అని నమ్ముతుందట.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

కంగనా రనౌత్ కి కలిసొచ్చే వ్యక్తి ఇమ్రాన్ హస్మి. తన మొదటి సినిమా గ్యాంగ్ స్టర్, తర్వాత రాంజ్ సినిమాల్లో ఇమ్రాన్ హస్మితో నటించి సక్సెస్ అవడంతో.. తనకు ఇమ్రానే లక్కీ అని చెబుతోంది.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ కి తనకున్న ఎక్స్ ట్రా బొటనవేలే తనకు లక్కీ అని నమ్ముతాడట. హృతిక్ రోషన్ ఫస్ట్ సినిమా కహో నా ప్యార్ హై సినిమా సమయంలో బీటౌన్ లో హృతిక్ కి ఉన్న అదనపు వేలి గురించే అందరూ మాట్లాడుకునేవాళ్లు. కానీ అదే అతనికి లక్కీగా మారిపోయింది.

కాజోల్

కాజోల్

కాజోల్ కి తన ఓం షేప్ లో ఉండే డైమండ్ రింగ్ లక్కీ అని నమ్ముతుందట. అజయ్ దేవగన్ గిఫ్ట్ గా ఇచ్చిన ఈ రింగ్ తనకు మానసిక ప్రశాంతతను, అదృష్టాన్ని తీసుకొస్తుందట.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

ఏ సినిమా రిలీజ్ అయినా.. ఆ రోజు ముందుగా అజ్మీర్ లోని ఖ్వాజా మొయిన్ ఉడ్ దిన్ క్రిష్టీ కి వెళ్తుంది. అక్కడ దేవుడి ఆశీస్సులు తీసుకుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఆమెకు నమ్మకం.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కి డిసెంబర్ లక్కీ చార్మ్ అట. తారే జమీన్ పర్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయి సక్సెస్ కావడంతో.. ప్రతి సినిమాను ఇదే నెలలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారట.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

దీపికా పదుకొనేకి సిద్ధి వినాయక టెంపుల్ బాగా కలిసొచ్చిందట. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా.. ఆరోజు సిద్ధి వినాయకుడి ఆలయానికి వెళ్తుందట. అప్పుడే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని నమ్ముతుందట.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్ తన కార్లు అన్నింటిలోనూ 8 అనే నెంబర్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే.. 8న వాళ్ల బర్త్ డేట్. అందుకే.. ఈ రాక్ స్టార్ కి ఈ నెంబర్ ఎప్పుడూ లక్కీనేనట.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్ కి కలిసొచ్చే నెంబర్ 555. అందుకే తన కార్ నెంబర్ 555 గా ఉంటుంది.

English summary

Celebrities and their lucky charms

Celebrities and their lucky charms. Most celebrities will tell us that they owe their success to talent, hard work and a little bit of luck. Some will admit that luck played the biggest role in their ascent to the top.
Desktop Bottom Promotion