Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలకే పట్టీలు ధరించే సంప్రదాయం ఎందుకు ?
కళ్లకు కాటుక, నుదిటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు... ఇవన్నీ అమ్మాయిల అందాన్ని మరింత పెంచేవి. మహిళలకు మరింత అందాన్ని తీసుకొచ్చేవి ఆమె వేసుకునే ఆభరణాలు. భారతీయ సంప్రదాయంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి రకరకాల ఆభరణాలతో అలంకరించి ముచ్చటగా చూసుకుంటారు తల్లిదండ్రులు. కాలి పట్టీల నుంచి పాపిటబిళ్ల వరకు.. అమ్మాయికి అలంకరించాలే గానీ.. ఒళ్లంతా బంగారమైపోవాల్సిందే.
మెట్టెలు ధరించడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
మెడలో నెక్లెస్ లు, చెయిన్స్, చేతికి గాజులు, వేళ్లకు రింగులు, వంకీలు, నడుముకి వడ్డాణాలు, చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలు... ఇవి అమ్మాయిలకు అందం తీసుకొచ్చే.. ఆకర్షించే ఆభరణాలు. పుట్టిన పసికందు నుంచి అన్ని వయసుల అమ్మాయిలకు నప్పేవి గజ్జెలు. ఘల్లు ఘల్లు మంటూ ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే.. తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు.

అందియలు, పట్టీలు, గజ్జెలు, మువ్వలు.. ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఇవి అమ్మాయిలకు అందాన్ని మాత్రమే కాదు.. అనేక ప్రయోజనాలు తీసుకొస్తాయట. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా ధరించేవాళ్లు. కానీ.. ప్రస్తుతం వీటి ఊసు తగ్గిపోయింది. అప్పుడప్పుడు పండగలు, పెళ్లిళ్లకు మాత్రమే అందియలు ధరిస్తున్నారు. మువ్వలు ధరించే సంప్రదాయం వెనక చాలా రీజన్సే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రంగురంగుల గాజుల సవ్వడిలో దాగున్న అర్థాలు
ఎనర్జీ:
మువ్వులను సాధారణంగా వెండివి లేదా బంగారానివి ధరిస్తారు. వెండి మువ్వలు ధరించడం వల్ల మహిళలు మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. బంగారు నగలు మహిళలు ధరించడం వల్ల.. శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. నిత్యం రోజువారి పనులతో ఎక్కువగా మహిళలు అలసిపోకుండా ఉండటానికే.. వెండి గజ్జెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది.

పాదాల రక్షణ:
పట్టీలు వేసుకోవడం వల్ల పాదాలకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణ సజావుగా జరగడానికి, పాదాలు వాపులు రాకుండా ఉండటానికి సహకరిస్తాయి.
వధువుకి వన్నె తెచ్చే ఇండియన్ కల్చర్
సంతానోత్పత్తికి:
మీకు రుతుక్రమ సమస్యలు ఉంటే.. వెంటనే గజ్జెలు వేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. ఇవి రుతుక్రమ సమస్యల నుంచి, సంతానంలో వచ్చే సమస్యల నుంచి, గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పోరాడుతుంది. అలాగే.. రోగనిరోధక శక్తిని కూడా పట్టీలు పెంచుతాయి.



Click it and Unblock the Notifications