For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ గురించి 16 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...

|

హైదారాబాద్ పేరు వింటేనే అందరికీ గుర్తొంచేది హైదరాబాదీ బిర్యానీ, చార్మినార్.ఇవి మాత్రమే కాదు హైదారాబాద్ గురించి తెలుసుకోవల్సిన విషయాలు చాలనే ఉన్నాయి. హైదరాబాద్ ను మొఘులులు

మరియు నిజామ్ లు పాలించారు . హైదరాబాద్ ఒక అద్భుతమైన హిస్టారికల్ , ఆర్కిటెక్చురల్ బ్యూటీ కల్చర్ ఉన్నది. హైదరాబాద్ ను భాగ్యనగరం అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే హైదరాబాదు నగరం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు , మసీదులకు, దేవాలయాలకు , చక్కని కళలలకు వాస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ది .

హైదరాబాద్ భారతదేంలోనే ఐదవ అతి పెద్దగ నగరము . అంతే కాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచలోని మహానగారాలలో 41స్థానాన్ని ఆక్రమిస్తుంది.

హైదరాబాదుకు భాగ్ నగర్ అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు.

పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం

చెందింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం వుంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్ లు జంట

నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్దకృత్రిమ సరస్సు.

హైదరాబాదు ప్రస్తుతం రెండు రాష్ట్రాలను రాజధానికి గా ఉంది. హైదాబాద్ మూసినది 650స్కయర్ ఫీట్ కిలోమీటర్లు వ్యాప్తి చెందినది. హైదరాబాద్ చాల డిఫరెంట్ కల్చర్ ను కలిగి ఉంటుంది . ఎవరైనా సరే

ఒక్కసారి హైదరాబాద్ ను సందర్శిస్తే అక్కడే ఉండిపోలవాలనిపిస్తుంది. అలా మనల్ని కట్టిపడేసి మంత్రముగ్దులను చేయడానికి కారణం కొన్ని వాస్తవాలున్నాయి ఇక్కడున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

 అద్భుతమైన సరస్సులున్నాయి:

అద్భుతమైన సరస్సులున్నాయి:

హైదరాబాద్ సరిహద్దుల్లో ఆర్టిఫిలయల్ సరస్సుల యొక్క అందాలు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది . హైదరాబాద్ శిరార్లలో 140 కృత్రిమ సరస్సులు కలిసే చోటా ఒక పెద్ద ఆనకట్ట నిర్మాంచారు. చూడటానికి చాలా అద్బుతంగా ఉంటుంది. వీటిలో హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ లు బాగా పాపులర్ అయిన సరస్సులు.

అతి పెద్ద ఫిల్మ్ సిటి ఉంది :

అతి పెద్ద ఫిల్మ్ సిటి ఉంది :

రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ)గా పేరుగాంచినది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 7వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్నది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచినది. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి. హైద్రాబాదు నుండి బస్సు సౌకర్యంకలదు. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల రంగస్థలాలు వున్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత,నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.

కోహీనూర్ డైమండ్ :

కోహీనూర్ డైమండ్ :

కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము. ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది. 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది. అన్ని ప్రఖ్యాత వజ్రాలవలె కోహినూరు వజ్రము చుట్టూ పలు కథలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్,హైదరాబాద్ లో ఉన్న ఒక ఐమాక్స్ సినిమా ధియేటర్ ప్రసాద్ ఐమాక్స్. 2,35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇది. ఈ మల్టీప్లెక్స్ లో ఐదు స్క్రీన్లు, ఫుడ్ కోర్ట్, బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు, ఒక గేమింగ్ జోన్ మరియు కాంప్లెక్స్ యొక్క రెండు అంచెలను కవరింగ్ చేసే ఓక షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐమ్యాక్స్

థియేటర్. దీని స్క్రీన్ 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధియేటర్ 12,000 వాట్ సౌండ్ సిస్టంతో 635 సీట్లను కలిగి ఉంటుంది. అతిపెద్ద ఐమాక్స్ తెరతో ఉన్న సిడ్నీ ఐమ్యాక్స్ థియేటర్

(123 x 97 అడుగులు) తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్.

భారతదేశం యొక్క IT కేంద్రంగా

భారతదేశం యొక్క IT కేంద్రంగా

1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీ గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ సత్యం కంప్యూటర్స్ యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్టాత్మకమయిన ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టును సాధించి తానే భవిష్యత్తు ఐటి కేంద్ర బిందువునని చాటి చెప్పింది.

హోం టాలీవుడ్

హోం టాలీవుడ్

టాలీవుడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ కు నిలయం హైదరాబాదు. ఇండియాలో సినిమా ఇండిస్ట్రీలో అతి పెద్ద సినిమా పరిశ్రమ మొదట ఇక్కడే నెలకొన్నది. దీని తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమ రెండవ అతి పెద్ద చిత్ర పరిశ్రమ.

ఆసియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ఉంది..

ఆసియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ఉంది..

ఆసియాలోనే అతి పెద్ద కన్వెషన్ సెంటర్ ఇక్కడ ఉంది . ది హెచ్ ఐసిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ 5000 మంది కూర్చునే అంత స్థలం కలిగి ఉంది. ఈ కన్వెషన్షన్ సెంటర్ లో దాదాపు 291,000 sq. ft. విస్తీర్ణంలో నిర్మించారు . ఆసియాలోనే అత్యధిక సాంకేతిక ఆధునిక సంప్రదాయ కేంద్రాలలో హైదరాబాద్ కన్వెషన్ సెంటర్ ఒకటి.

ముత్యాల నగరము

ముత్యాల నగరము

హైదరాబాద్‌ నగరానికి ప్రఖ్యాతితెచ్చిన ఘనత ముత్యాలకు కూడా దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. పాతబస్తీలోని మోతీగల్లి ముత్యాల వర్తకానికి కేంద్ర స్థానం. ముత్యాలను శుద్ధి చేసి పాలిష్‌ పెట్టే కర్మాగారాలు నగరంలో అనేకం ఉన్నాయి. నిజాం నవాబుల కాలంలో పర్షియన్‌ వర్తకులు ముత్యాలు సరఫరా చేసేవారు. వీటిలో మేలిముత్యాలు, కల్చర్‌ముత్యాలు, కృత్రిమ ముత్యాలు అనే రకాలున్నాయి. మేలి ముత్యాలకు గల్ఫ్‌లోని బస్రా పేరు గాంచింది.

బుద్ధ యొక్క అతిపెద్ద ఏక విగ్రహం

బుద్ధ యొక్క అతిపెద్ద ఏక విగ్రహం

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిలువెత్తు బుద్ద విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న ఏకైకా పెద్ద ఏకశిలా విగ్రహం ఇదే. గౌతమ బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహలలో ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం ఇదే కావడం విశేషం. టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పం మలిచారు. నల్గొండ జిల్లా రాయగిరిలో బుద్దుడి శిల్పం చెక్కిన చోటనే ఇప్పుడు యాదాద్రికి శిల్పాలను చెక్కుతున్నారు. హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాల వాహనం పై బుద్దుడి విగ్రహాన్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. నందమూరి ఎన్టీరామారావు స్వయంగా ఈ విగ్రహాన్ని తయారు చేయించి హుస్సేన్ సాగర్ లో ప్రతిష్టింపజేశారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో బుద్ద విగ్రహం ప్రముఖ పాత్రపోషిస్తుంది.

హైదరాబాదీ బిర్యాని

హైదరాబాదీ బిర్యాని

అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అందుకేనేమో... వచ్చినవారికి స్థానిక ‘ప్రత్యేకతలను’ పరిచయం చేసి... మెప్పించి... మురిపించేవారు నాడు. రాజరికాలు పోయినా... రాజులు లేకపోయినా... నేటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. మరి అంతగా ఆకట్టుకోవాలంటే నేటివ్ ‘టేస్ట్’లో ‘దమ్’ ఉండాలి కదా! మనది ‘హై’దరాబాద్. కాదంటే ‘భాగ్య’నగరం. అపురూప కట్టడాలకే కాదు... తినే తిండికీ ఘనత... చరిత ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో పుట్టి... మొఘలాయిలు పరిచయం చేసి... లక్నోలో పెరిగి... నిజాంల వంటగా మారి... చివరకు హైదరాబాద్ ‘ఇంటి’ పేరైన బిర్యానీ... ఇప్పుడు సిటీకి వచ్చే దేశ, విదేశీ అతిథులకు ‘హాట్’ ఫేవరేట్. తినేటప్పుడు లొట్టలేస్తాం సరే... కానీ మన బిర్యానీకే ఎందుకంత టేస్ట్! ఏమిటా స్పెషల్..!

చార్మినార్

చార్మినార్

చార్మినార్ చార్మినార్ పేరు చెపితే చాలు ప్రతిఒక్కరికి హైదరాబాద్ గుర్తుకు వచ్చేస్తుంది. హైదరాబాద్ పాత బస్తీలో కల పురాతన చార్మినార్ కట్టడం నేటికీ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగరానికి ఒక

ప్రముఖ ఆకర్షణగా నిలిచింది.

బిర్లా మందిరం

బిర్లా మందిరం

బిర్లా మందిరం ఒక చిన్న కొండపై కల తెల్లని మార్బుల్ రాతి తో నిర్మించిన బిర్లా మందిరం పర్యాటకులను స్వాగతిస్తుంది.

సీతారాం బాగ్ టెంపుల్

సీతారాం బాగ్ టెంపుల్

సీతారాం బాగ్ టెంపుల్ హైదరాబాద్ లోని సీతారాం బాగ్ దేవాలయ శిల్ప కళల సమ్మేళనం చూడ ముచ్చట

మక్కా మసీద్

మక్కా మసీద్

మక్కా మసీద్ 'చార్మినార్' కు పక్కనే కలదు. ఇది పురాతన మరియు ఇండియాలో ఉన్న అతి పెద్ద మసీద్ లలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. మసీద్ లో ప్రతి శుక్రవారం, రంజాన్, బక్రీద్ లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకి ముస్లీమ్ లు అధిక సంఖ్యలో వస్తారు. దీనికి సమీపంలో చారిత్రక కట్టడం చౌమహల్లా ప్యాలెస్ కలదు.

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ పూర్వం రాజధాని గా ఉండేది. హైదరాబాద్ నగరం నుండి 11 కి. మీ. దూరంలో ఉన్న గోల్కొండ కోట నాటి పూర్వ వైభవాలను గుర్తుచేస్తుంది. కోటకు ఉపయోగించిన రాళ్లు, కోటలోని ఉద్యానవనాలు ఆకర్షణగా నిలిచాయి. చప్పట్లు కొడితే, ఆ శబ్ధం 91 మీ. ఎత్తున ఉన్న రాణి మహల్ (ఎత్తులో ఉన్నది) వద్ద వినిపిస్తుంది. రహస్య మార్గాలు, గోడ వద్ద మాట్లాడితే మరో చోట వినిపించడం ఇవన్ని గమనిస్తే కోటను శత్రువుల బారి నుండి రక్షణకై ఎంత సురక్షితంగా నిర్మించారో బోధపడుతుంది

కాకతీయ కళా తోరణం

కాకతీయ కళా తోరణం

'కాకతీయ కళా తోరణం' నాటి కాకతీయుల రాజ్యానికి చారిత్రక స్థూపం మరియు చిహ్నం. దీనినే వరంగల్ ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. కాకతీయ వంశీయులు చాలా వరకు తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలను పాలించారు. సమీపంలో శిల్పకళ లతో ఉట్టిపడే వరంగల్ కోట చూడవచ్చు.

English summary

Interesting Facts About Hyderabad

‘The city of Mughals and Nizams’ is the perfect anecdote to Hyderabad. Hyderabad is home to the historic architectural beauties and cultures. The richness of the city is depicted clearly in its heritage and foods.
Story first published: Friday, May 27, 2016, 18:12 [IST]
Desktop Bottom Promotion