Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
డబ్బు ఉన్న వారికి గుర్తింపు కావాలి. గుర్తింపు ఉన్నవారికి డబ్బు కావాలి. ఈ ప్రిన్స్ పుల్ మీద నడుస్తుంటాయి సెలిబ్రిటీల సైడ్ బిజినెస్ లు
బట్టల షాపులు, నగల షాపులు...ఐస్ క్రీమ్ పార్లర్లు, బ్యూటీ పార్లర్లు ఇలా ఆ షాపు ఈ షాపు అనే తేడాలేకుండా......అన్ని షాపుల ఓపెనింగులకు హీరోయిన్లు ఆహ్వానించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. వారొస్తే మీడియాలో తమ షాపు గురించి ప్రచారం జరుగుతుంది తద్వారా తమకు లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నారు వ్యాపారులు. ఇందుకోసం వారికి రోజుకు లక్షల్లో ముట్ట చెప్పడానికి సిద్ధ పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు పెద్ద పెద్ద వ్యాపారులు మాత్రమే హీరోయిన్లను షాపు ఓపెనింగులకు పిలిపిస్తుండే వారు. కానీ ఇటీవలి కాలంలో మధ్య తరగతి వ్యాపారులు కూడా ఇదే పోకడ అనుసరిస్తున్నారు.
ఒక్కోసారి లక్ బలే కిక్ ఇస్తుంది. కొందరు ఏదైన కావాలని ఎంత ప్రయత్నించినా అది కలిసిరాదు. కానీ మరి కొందరికి మాత్రం ప్రయత్నించకుండానే అన్నీ జరిగిపోతుంటాయి మెన్నటికి మెన్న సమంతా, నేడు రకుల్ మరి రేపు ఎవరూ తెలుసుకోవడమే మనకు పరిపాటి అయిపోయింది. వీరి ప్రారంభించిన బిజినెస్ లుకూడా డబ్బులు బాగానే సంపాదించిపెడుతున్నాయి.
స్లైడ్ షోలో ..హీరోయిన్స్ ..బిజినెస్ ల గురించి డిటేల్స్

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ఇటీవలే హైదరాబాద్ లో గచ్చిబౌలి లో జిమ్ -ఎఫ్ 45 ఫ్రాంచైజీని తీసుకుంది. ఇది తనకు వచ్చిన మెదటి సంపాదనతోనే. ఈ జిమ్ సెంటర్ లో ట్రెడ్ మిల్ వంటివే కాకుండా రోప్స్, ట్రాలర్స్ వంటి లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ను కూడా ఎరేంజ్ చేస్తున్నారట. ఈ జిమ్ 20వ తేదీ ప్రారంభమవుతుంది. కేవలం జిమ్ తోనే ఊరుకోలేదు. హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కూడా కొనుక్కున్నట్టు తెలుస్తోంది.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
తమన్నా తమన్నా కొద్ది కాలం క్రితమే..వైట్ అండ్ గోల్డ్ అనే పేరుతో తన సొంత జ్యూయలరీ బ్రాండ్ ఓపెన్ చేసిందనే విషయం మనకు తెలుసు.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
కిృతి కర్బందా మీల్స్ అండ్ వీల్స్ ఫార్మెట్ లో కృతి పేరుతో బెంగుళూరులో ఓ రెస్టారెంట్ ని ఓపెన్ చేయబోతోంది.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
నమిత వ్యాపార రంగంలో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా తను అనుకన్న ప్రకారం త్వరలో చెన్నైలో ఓ రెస్టారెంట్ను నెలకొల్పనున్నట్లు సమాచారం. అది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ ఏర్పాట్ల పనులతో కొంతకాలంగా ఆమె బిజీగా ఉంది.కనీసం ఈ వ్యాపార రంగంలో రాణించాలని ఆశిస్తోంది

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
ప్రణీత తనదైన స్టైల్ లో, బూట్ లెగ్గర్ అనే ప్రీమియం అప్ మార్కెట్ రెస్టారెంట్ లో పెట్టుబడి పెట్టింది. ఈ రెస్టారెంట్ బెంగుళూరులో ఓ రిచ్ ఏరియాలో ఉంది

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
కాజల్ అగర్వాల్ కాజల్, తన చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి మార్సాలా అనే బ్రాండ్ పై ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రారంభించింది. అది ఇప్పుడు బాగానే నడుస్తోంది.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
నయన తార: కోలీవుడ్లో వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నయనతార ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. సినిమాల్లో వచ్చిన లాభాలతో ఏదో బిజినెస్ చేయకుండా సినిమానే నిర్మిస్తా అంటుంది నయన్.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
తాప్సీ ఈ సుందరి కూడా, తన చెల్లి అయిన షాగున్ పన్ను తో కలిసి ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కు సంబందించిన బిజినెస్ పెట్టే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. దానికి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అని పెరు కూడా పెట్టింది.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
శ్రేయా కొన్ని సంవత్సారలా క్రితం ముంబాయిలో ఓ స్పాను స్టార్ట్ చేసింది శ్రేయా. ఇందులో చూడలేని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి బాడీ, బ్యాక్, లెగ్ మరియు హెడ్ మసాజ్ లు చేయిస్తోంది.

టాప్ సౌత్ హీరోయిన్ల సైడ్ బిజినెస్ లు..
ఇలియానా టాలీవుడ్ లో వున్నప్పుడు ఓ సోంత డిజైనర్ లేబుల్ ని మెదలు పెట్టింది. ప్రస్తుతం ఆమె క్రేజ్ తగ్గగానే ఇక్కడ అది కాస్తా పడుకుంది.



Click it and Unblock the Notifications











