Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దయ్యాల కలలు లైఫ్ కి దగ్గరగా ఉంటాయా ?
గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉలిక్కిపడి లేస్తున్నారా ? వామ్మో అంటూ కేకలు పెడుతున్నారా ? మంచి నిద్రలో ఉండగా ఉన్నపాటుగా నిద్రలేస్తున్నారా ? ఇలాంటి పరిస్థితులకు కలలే కారణం. అది కూడా మనలో భయాన్ని క్రియేట్ చేసే కలలు వచ్చినప్పుడు ఏదో తెలియని ఆందోళనతో వణికిపోతుంటాం.
నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?
సాధారణంగా రాత్రిపూట కలలు రావడం సహజం. కానీ.. ఉదయానికి ఏం కల వచ్చిందో కూడా గుర్తుండదు. అదే.. మనపై చాలా ప్రభావం చూపిన కలలు వస్తే మాత్రం.. మరుసటి రోజు నిద్రకూడా సరిగా పట్టదు. అలాంటివే.. దయ్యాల కలలు..!! టీవీలో నటన అని తెలిసినా.. దయ్యాలను చూస్తే.. కళ్లు మూసుకుంటాం. దయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూనే.. భయపడతాం. ఎందుకంటే.. వాటి ఆకారం అలా క్రియేట్ చేస్తారు కాబట్టి.. మనలో తెలియని భయాందోళన వస్తుంది. మరి హాయిగా.. రిలాక్స్ గా నిద్రపోయే సమయంలో దయ్యాలు కనిపిస్తే.. ?? ఇంకేమయినా ఉందా.. ఒళ్లంతా అలజడే.
కలలో పాములు కలవరపెడుతున్నాయా ?

కలలకు అర్థాలున్నాయని మీకు తెలుసా ? నిజమే అది కూడా మీ కలలో దయ్యాలు కనిపిస్తే ఒక అర్థం, వాటితో మాట్లాడితే ఒక అర్థం, పోట్లాడితే మరొక అర్థం ఉంది. కలలో కేవలం దయ్యాలు కనిపిస్తే.. మీరు చాలా భయపడుతున్నారు అని అర్థం. కొన్ని ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు, ఆత్మనూన్యత, ఒత్తిడికి గురిచేసే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం. మీ నిజ జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ఆందోళన చెందుతున్నారని దయ్యాల కలలు సూచిస్తాయి. ఇలాంటివి ఏవీ లేవంటే.. మరణం, చనిపోతున్నారన్న భయాందోళన అయినా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది.
నిద్ర మరియు డ్రీమ్స్ గురించి మైండ్ బ్లోయింగ్ నిజాలు

ఒకవేళ మీరు దయ్యంతో పోట్లాడినట్లు, మాట్లాడినట్లు కల వచ్చింది అంటే.. మీరు త్వరలోనే మీ నియమాలకు విరుద్ధమైన పనులలో పాల్గొనాల్సి వస్తుందని సూచిస్తుంది. చాలా ఒత్తిడికి గురవబోతున్నారని సంకేతం. ఇలాంటి సమయంలో మీరు భయపడకుండా.. మీ సామర్థ్యాన్ని కోల్పోకుండా.. మీ స్నేహితులు లేదా మీరు బాగా నమ్మే వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు దయ్యంతో కలిసి ఉన్నట్టు కల వస్తే.. మీరు జీవితం, సమాజంతో సంబంధం కోల్పోతున్నారని సంకేతం. ఇవి దయ్యాల కలల గురించి వాస్తవాలు.



Click it and Unblock the Notifications