For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాదాపరోటా బోర్ కొట్టిందా?ఉల్లిపాయ పరోటా తినండి

|

ప్రతి రోజూ సాధా పరోటాలను తిని బోరుకొడుతోందా? మరి అయితే ఈ ఆనియన్ పరోటాను ట్రై చేయండి. ఇది ఆనియన్ స్టప్ట్ పరోటా మాత్రమే కాదు, ఇది చాలా సులభం మరియు చాలా డిఫరెంట్ రిసిపి. దీన్ని తయారు చేయండా చాలా సులభం మరియు టేస్ట్ కూడా అద్భుతం.

ఈ రిసిపిలో సన్నగా..చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకలు మరియు ఇతర మసాలాలతో ఫై చేసి, గోధుమపిండితో మిక్స్ చేసి పరోటాల్లా తయారు చేసి వేడి వేడిగా కాల్చుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి తర్వాత తయారవుతాయి కాబట్టి, పిల్ల లంచ్ బాక్స్ లకు ఈజీ అవుతుంది. మరియు పెద్దలకు కూడా ఇష్టం అవుతుంది. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Onion Paratha - Breakfast Recipe

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 11/2cup
ఉల్లిపాయ: 1cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1tsp
పచ్చిమిర్చి: 2-4(సన్నగా చిన్న ముక్కలుగా తగిరిపెట్టుకోవాలి)
గరం మసాలా: 1/2tsp
కొత్తిమీర తరుగు: 4tbsp
ధనియాల పొడి: 1tsp
నూనె: ఫ్రై చేయడానికి
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ఒక చిన్నపాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

2. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరం మసాలా, మరియు ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసి, రెండు నిముషాలు వేగించి, స్టౌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పది నిముషాల పాటు చల్లారనివ్వాలి.

3. ఫ్రై చేసి చల్లబెట్టుకొన్న ఆనియన్ మిశ్రమంలో ఒక కప్పు గోధుమ పిండి, రెండు చెంచాల నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు కలుపుకొని చపాతీ పిండిలా మృదువుగా, మెత్తగా కలుపుకోవాలి.

4. తర్వాత కలుపుకొన్న పిండికి కొద్దిగా నూనె రాసి, ఒక పల్చటి కాటన్ క్లాత్ లో చుట్టి ఒక పదిహేను నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15నిముషాల తర్వాత పిండిలో నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.

5. తర్వాత వీటిని చపాతీ కర్రతో చపాతీల్లా చుట్టుకోవాలి. ఇలా అన్నింటింని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టౌ మీద తవా పెట్టి వేడియ్యాక తవా మీద చపాతీల వేసి రెండు వైపులా నూనె రాసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఇలా మొత్తం అన్ని చపాతీలనూ కాల్చుకోవాలి. వీటిని పొటాటో కర్రీ లేదా దోసకాయ రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

English summary

Onion Paratha - Breakfast Recipe

This paratha is quite easy to prepare and makes a filling breakfast. The fresh or frozen green coriander leaves, and onion cumin seeds are Fry with the aromatic garam masala, green chillies then stuffed inside a chapati. Onion paratha is also a great option for your kid's lunch box.
Desktop Bottom Promotion