Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్రేజీగా రెండు పద్దతుల్లో...రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్న చైతు..సమంత..!
అక్కినేని వారింట పెళ్లి బాజాలు ప్రారంభమయ్యాయి....టాలీవుడ్ లో 'మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్' గా వార్తల్లో నిలిచిన నాగచైతన్య, సమంత కల్యాణం గోవాలో జరుగనుంది. ఈ నెల 6, 7 ముహూర్త తేదీలు. తొలుత 6న హిందూ సంప్రదాయ పద్ధతిలో, 7న సమంత కుటుంబం ఆచరించే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగుతుందని ఇదివరికే అక్కినేని నాగార్జున తెలిపారు.

టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం ఈరోజు అక్టోబర్ 6న గోవాలో వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహం కోసం అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

చైతూ, సామ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త ప్రచారంలో ఉంది. వీరి పెళ్లి వేడుక ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు.. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. దాంతో రెండు పద్ధతుల్లో రెండు సార్లు పెళ్లి చేసుకుటుండడం విశేషం. మోస్ట్ లవబుల్ పెయిర్ వివాహానికి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతిథులు హాజరయ్యే అవకాశాలున్నాయి.

గత జనవరిలో నిశ్చితార్థం కొందరు సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం నటనను కొనసాగిస్తానని ప్రకటించిన సమంత.. పెళ్లికి కొన్ని రోజుల ముందే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

రాజుగారి గది- 2, రామ్‌చరణ్‌కు జోడీగా మరో చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తమకు ఎంతో కలిసొచ్చిన న్యూయార్క్‌ని హనీమూన్ ప్లేస్‌గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ కాబోయే దంపతులు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావె'కి సంబంధించిన కీలక సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. అందుకే హనీమూన్‌ని అక్కడ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications