For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రూస్ లీ మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు

ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దామా.

By Bharath
|
Bruce Lee Lost Life? Long Time Mystery Solved! బ్రూస్ లీ మరణ రహస్యం ! | Oneindia Telugu

అతని పంచ్ పవర్ మామూలుగా ఉండేది కాదు. ఒక రేంజ్ లో ఉండేది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మన్ గా పేరుగాంచాడు. అతనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్ గా ఖ్యాతి సాధించిన ఇతను అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయాడు. ఇతను చనిపోయిన చాలా కాలమైనా ఆ మరణానికి సంబంధించిని మిస్టరీస్ ఇప్పటికీ చాలానే వినపడుతుంటాయి. పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దామా.

చిన్నప్పటి నుంచే శిక్షణ

చిన్నప్పటి నుంచే శిక్షణ

నవంబర్ 27, 1940 జన్మించి జులై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రంపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్ లో పెరిగారు. శాన్‌ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్‌ లీ జన్మించారు. బ్రూస్ లీ అసలు పేరు 'లీ జున్ ఫాన్'. ఈయన తల్లిదండ్రులిద్దరూ కళాకారులే. వీళ్లు హాంకాంగ్‌ లో ఉండేవారు.

బ్రూస్‌ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి థామ్‌ చీ చువాన్‌ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. కుంఫులో భాగమైన వింగ్‌ చున్‌ లో శిక్షణ కోసం ఇప్‌మెన్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు.

చైనీయులు వద్దన్నారు

చైనీయులు వద్దన్నారు

బ్రూస్ లీ తల్లి ఓ జర్మన్‌ జాతీయురాలు. ఆమెకు పుట్టిన బ్రూస్‌ లీ వింగ్‌ చున్‌ నేర్చుకోడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం వ్యక్తం చేశాు. ఇప్‌మెన్‌ ను బెదిరించడంతో శిక్షణ మధ్యలోనే ఆగిపోయింది. కాని ఎవ్వరికీ తెలీకుండా బ్రూస్‌కి ఇప్‌ మెన్‌ శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. 18 ఏళ్ల వయస్సులోనే వీటన్నింటిని నేర్చుకున్నాడు బ్రూస్ లీ.

పెళ్లి

పెళ్లి

1964లో లిండా ఎమెరీని బ్రూస్ లీపెళ్లి చేసుకున్నాడు. 1965లో మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీని ప్రారంభించాడు. జీత్‌ కున్‌ డోను రూపొందించాడు. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాల్లో నటించాడు.

ఇంచు దూరం నుంచి పంచ్ విసిరేవాడు

ఇంచు దూరం నుంచి పంచ్ విసిరేవాడు

1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు.

వన్ ఇంచ్ పంచ్

వన్ ఇంచ్ పంచ్

బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది.

కనురెప్ప కంటే వేగంగా..

కనురెప్ప కంటే వేగంగా..

ఫైటింగ్‌లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించటం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు. ఒక అంగుళం దూరం నుంచే పవర్‌ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి.

చావు ఇలా పలకరించింది

చావు ఇలా పలకరించింది

1970 జూలై 20న గేమ్‌ ఆఫ్‌ ది డెత్‌ సినిమాపై చర్చలు జరపడానికి డైరెక్టర్‌ రేమండ్‌ చో.. బ్రూస్‌ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు సాగాయి. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి హీరోయిన్‌ బెట్టి టింగ్‌ ఇంటికి వెళ్ళారు. అక్కడే మొదలైంది అసలు కథ.

తలనొప్పితో బాధపడ్డాడు

తలనొప్పితో బాధపడ్డాడు

కొద్ది సేపు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత బ్రూస్‌ లీని బెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్‌ చో.. జేమ్స్‌ బాండ్‌ స్టార్‌ జార్జి లాటిన్‌ బీని కలవడానికి వెళ్ళాడు. బ్రూస్‌ లీ ని తరువాత రమ్మనాడు. బెట్టి ఇంట్లో ఉన్న బ్రూస్ లీకి సాయంత్రం విపరీతంగా తలనొప్పి వచ్చింది.

టాబ్లెట్‌ తీసుకున్నాడు

టాబ్లెట్‌ తీసుకున్నాడు

తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్‌ ఈక్వజేసిక్‌ టాబ్లెట్‌ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్‌ లీ పడుకున్నాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి బ్రూస్‌ లీ వస్తాడని అనుకున్న రేమండ్‌ చో ఎంతకూ బ్రూస్ లీ రాకపోవడంతో బెట్టీకి ఫోన్‌ చేసాడు. బ్రూస్‌ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్‌ లీని నిద్రలేపడానికి ఆమె ప్రయత్నించింది.

నిద్రలోనే..

నిద్రలోనే..

టాబ్లెట్ వేసుకుని నిద్రపోయిన బ్రూస్‌ లీ ఎంతకూ నిద్రలేవలేదు. బెట్టి రేమండ్‌కి అంతా చెప్పింది. కొద్దిసేపటితరువాత అక్కడికి వచ్చిన రేమండ్‌ బ్రూస్‌ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎంతకూ కళ్లు తెరవలేదు. కాసేపటికే బెట్టి డాక్టర్‌ వచ్చాడు. బ్రూస్‌ లీ కండీషన్‌ చాలా సీరియస్‌గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు.

ఆసుపత్రికి తీసుకెళ్లారు

ఆసుపత్రికి తీసుకెళ్లారు

బ్రూస్‌లీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయన్ని బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. చివరకు ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

కారణం ఏమిటి

కారణం ఏమిటి

తలనొప్పిగా ఉన్నప్పుడు బెట్టి ఇచ్చిన టాబ్లెట్‌ వల్లే బ్రూస్‌లీ మరణించాడాని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే బ్రూస్‌ వేసుకున్న ఈక్వజేసిక్‌ టాబ్లెట్‌ వల్లే అతను చనిపోయాడాని డాక్టర్లు కూడా చెప్పారు. టాబ్లెట్‌ రియాక్షన్‌ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు నివేదిక కూడా ఇచ్చారు.

విషం ఇచ్చి చంపిదా?

విషం ఇచ్చి చంపిదా?

బ్రూస్‌లీ మరణానికి చాలా రకాలు కారణాలు ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. బెట్టి విషం ఇచ్చి చంపేసిందని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. అలాగే బ్రూస్ లీ సెక్స్ సామర్థ్యం కోసం టాబ్లెట్స్ వేసుకునే వాడని దాంతో గంటల తరబడి సెక్స్ చేసేవాడని దాన్ని భరించడం స్త్రీల వల్ల అయ్యేది కాదని ఒక టాక్. దీంతో బెట్టిని కూడా అలా చేయడానికి ప్రయత్నించడంతో ఆమె అక్కడున్న యాష్ ట్రే తో తలపై బాదడంతో చనిపోడయాని అంటారు.

మాఫియా చంపిదా?

మాఫియా చంపిదా?

బ్రూస్‌ లిని కొందరు హాంకాంగ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్లు మాఫియాతో కలిసి చంపారని కూడా వార్తలున్నాయి. అతని మరణానికి ఈక్వజేసిక్‌ రియాక్షన్‌ కారణం కాదని కొందురు డాక్టర్లు చెప్పారు.

షావోలీన్‌ మాస్టర్‌ చంపించాడా

షావోలీన్‌ మాస్టర్‌ చంపించాడా

బ్రూస్‌ లీ పై షావోలీన్‌ మాస్టర్‌కు కోపం అందుకే ఆయనకు సంబంధించిన మనుషులు చంపేశారని చాలా మంది నమ్ముతున్నారు. అయితే బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రం లో నటించాడు. కానీ, ఆతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.

ట్రయాడ్ చంపించిందా?

ట్రయాడ్ చంపించిందా?

సీక్రెట్ చైనీస్ ఆర్గనైజేషన్ ట్రయాడ్ కు చెందిన వ్యక్తులే బ్రూస్ లీని చంపించారని ఒక పుకారు ఉంది. అయితే, అతని మరణానికి సెరెబ్రల్ ఎడెమా కారణం అని చెబుతూ ఉంటారు.

డెత్ టచ్

డెత్ టచ్

బ్రూస్ లీ చాలామంది మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఎదురించాడు. వారిలో ఎవరో ఒకరు డిం -మాక్ ప్రయోగించారని అంటుంటారు. దీన్నే డెత్ టచ్ అంటారు. ఇది మర్మవిద్యలాంటింది. అలాగే ఇంకా చాలా వార్తలు వినపడుతుంటాయి. బ్రూస్లీ ఒక ఆసియన్ అయి ఉండి అమెరికాలో ఎదగడాన్ని అక్కడి వారు జీర్ణించుకోలేక చంపేశారని అంటారు. అలాగే ఆయన బాడీ పిట్ నెట్ కోసం చేసే వ్యాయామాలు కూడా ఆయన చనిపోవడానికి కారణం అని అంటుంటారు. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ. ఈ మార్షల్ ఆర్ట్స్ రారాజు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు.

English summary

how did bruce lee really die long time mystery solved

How Did Bruce Lee Really Die? Long Time Mystery Solved!
Desktop Bottom Promotion