For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజమైన ప్రేమ కథ! హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ..!

ప్రేమ...ఈ అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని రేపుతుందో తెలియంది కాదు. పుస్తకాల్లో చదివిన లైలా మజ్ను, దేవదాసు పార్వతి కథలు ఇప్పటికి అందరికి గుర్తుంటాయి. కారణం ప్రేమకు ఉన్న బలం.

By Madhavi Lagishetty
|

ప్రేమ...ఈ అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని రేపుతుందో తెలియంది కాదు. పుస్తకాల్లో చదివిన లైలా మజ్ను, దేవదాసు పార్వతి కథలు ఇప్పటికి అందరికి గుర్తుంటాయి. కారణం ప్రేమకు ఉన్న బలం.

ప్రేమ విఫలమైతే అది చరిత్రగా నిలుస్తుంది. ప్రేమ అనేది పెళ్లితో ముగిసి అందరిలా సాధారణంగా ఉంటుంది. కానీ అసలు ప్రేమ ఎలా ఉంటుంది. నిజాయితీ అను సుగుణము ప్రేమ సుగుణాలతో జోడింపబడి ఉంటుంది. సుగుణాలు స్వయంలోనూ...ఇతరులలోనూ ప్రేమను కలిగిస్తాయి. సుగుణాలు తగ్గినప్పుడు ప్రేమ కూడా తగ్గుతుంది. కానీ కొన్ని సంబంధాలు కేవలం సంపూర్ణంగా ఉంటాయి. ప్రేమా అనేది సంపూర్ణమైనది. మనిషి యొక్క జీవితానికి సంబంధించిన ఒక పరిపూర్ణ ఉదాహరణగా ఉంటే సరిపోతుంది.

తేజో మహాలయం తాజ్ మహల్ గా ఎలా మారింది ? తేజో మహాలయం తాజ్ మహల్ గా ఎలా మారింది ?

ప్రేమ గురించి ఒక సాధారణ వ్యక్తి బ్లాగ్ లో తెలిపాడు. అతని ప్రేమ జీవితం...అసలైన ప్రేమను గుర్తుచేస్తుంది. అంతేకాదు ఈ కథ మీ గుండెను కదిలిస్తుంది.

నిజమైన ప్రేమ కథ! హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ...

అతని మాటల్లోనే ఈ కథను చదవండి....

గుజరాత్ రాష్ట్రంలోని నవ్సారిలో నేను జన్మించాను. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత మా అమ్మమ్మ నన్ను పెంచుకుంది. ఆమె ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలివెళ్లింది. మా పొరుగువారు నా ఆలనాపాలనా చూసుకున్నారు. నర్గిస్ నేను కలిసి పెరిగాము..ఆమె వయస్సు వచ్చాక ఆమెను వివాహం చేసుకోవాలని చాలామంది ఆశపడ్డారు. కానీ ఆమె ప్రేమలో పడటం మరియు ఆమె సోల్ మేట్ ను వివాహం చేసుకోవాలని ధ్రుడంగా నిశ్చయించుకుంది.

ఒకసారి ఆమె పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చాలా ఒత్తిడికి లోనైంది. అప్పుడు ఆమెను నేను చాలా దూరం రైడ్ కు తీసుకెళ్లాను. ఆమె ప్రేమ గురించి మాట్లాడుతుండగా...నాకు ఏం అయ్యిందో తెలిదు. కానీ నేను రెండు పదాలు చెప్పాను. నన్ను పెళ్లి చేసుకో. నిజాయితీగా ఉంటానో ఉండనో నాకు తెలియదు. కానీ నేను ఆమెతో నా జీవితం గడపాలని కోరుకున్నాను. కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే...ఆమె నా ముఖం చూస్తూ...అవును అన్న పదం నా జీవితాన్నే మార్చేసింది. ః

నిజమైన ప్రేమ కథ! హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ...

ఇక మా పెళ్లి తర్వాత బాంబేకు షిప్ట్ అయ్యాం. మొదటి ప్లాట్లో కదిలే జ్ఞాపకం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ఇంటిని నర్గిస్ తనకు నచ్చినట్లుగా కట్టించుకుంది. ఎయిర్ ఇండియా కోసం నేను ఎరోనాటికల్ ఇంజనీర్ గా పనిలో చేరాను. కానీ నేను ఆమెకు చాలాకాలం పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ నర్గీస్ అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంది. నేను చేసిన చిన్న అమౌంట్ లో ఆమె ఇల్లు, మా పిల్లలతోపాటు ఆమె కళను నిర్వహించేంది. ఆమె ఒక కళాకారిణి.

మేము ఇద్దరం కలిసి పని చేశాము. నేను తిగిరి చూసేసరికి...ఇది నా కేరీర్ లేదా నా హ్రుదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే పే చెక్స్ కాదు. ప్రేమ మరియు పూర్తి జీవితాన్ని గడిపిన వాస్తవాన్ని వెనక్కి తిరిగి చూశాను. మేము నిజంగా రిటైర్ మరియు మా జీవితాలలో మరోక దశ కోసం నిజంగా సంతోషిస్తున్నాము. మేము ఎల్లప్పుడు కలిసి భోజనం చేయడం...ఒక సంప్రదాయాంగా ఉండే వాళ్ళం...కలిసి పడుకున్నా...ఎవరు ముందు గుడ్ నైట్ చెప్పుకునేవాళ్లం. ఒక రోజు రాత్రి ఆమె పడుకుంది. నేను కూడా ఆమెతో ఉండాలని అనుకున్నాను. అప్పటికే ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నదని గ్రహించినప్పుడు పారామెడిక్స్ ఆమె గుండెను మళ్లీ పంపింగ్ చేశారు. కానీ ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యిందని అనుమానించారు.

ఇదే నా కథ: ఒక వ్యభిచారిణి బిడ్డగా పెరగటం పూలపాన్పు కాదు...ఇదే నా కథ: ఒక వ్యభిచారిణి బిడ్డగా పెరగటం పూలపాన్పు కాదు...

హాస్పటల్ లో అడ్మిట్ చేశాము...రెండు రోజులు వైద్య పరీక్షలు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. ఆమె మంచం చూట్టు అందరూ నిలుచున్నారు. తర్వాత ఆదివారం డాక్టర్ ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ప్లగ్ని తీసివేయాలని నన్ను అడిగారు. ఆమె లేని జీవితం ఊహించుకోవడం నాతో కాలేదు. నా గుండె ఆగినట్లుగా అనిపించింది. ఆమె వెంటిలేటర్ లేకుండా 8 గంటలు బ్రతికి ఉంది. నేను ఆ సమయంలో ఆమెను వదిలి వెళ్లడానికి నా మనస్సు అంగీకరించలేదు. ఆమె నాతో మాట్లాడిని చివరి మాటలు గుర్తువస్తునే ఉన్నాయి. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాను. ఆ తర్వాత ఆమె నున్ను విడిచి దూరంగా వెళ్లిపోయింది.

మేము కలిసి ఉన్న 60 సంవత్సరాలు ఎంతో ఆనందంగా సంతోషంగా గడిపాము. ఆమె లేకుండా జీవితం ఎలా అని ఆలోచిస్తున్నారా? కానీ ఆమె ప్రేమ ఉంది. మా ప్రేమ మన పిల్లల్లో పెరుగుతూనే ఉంది. అది శతాబ్దాల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఆమె 2014లో నన్ను విడిపెట్టి వెళ్లింది. కానీ ఇప్పటి వరకు నేను ఆమెను ప్రేమిస్తునే ఉన్నాను. ఆమెను ప్రేమించడం తప్పా నాకు ఇంకేం తెలియదు.

English summary

Real-life Story: Love Story That Will Melt Your Heart

Some relations just fit in so perfectly that it makes you wonder if love is this perfect and this man's story is a perfect example of it!This is a story of a man who revealed about his entire life in a simple post and we bet, this would touch your heart as it would make you believe in true love...
Desktop Bottom Promotion