Latest Updates
-
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే! -
సర్వార్థ సిద్ధి యోగం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం! -
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి
2018లో వృశ్చికరాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్త
2018లో వృశ్చికరాశి వారు కొన్ని రకాల ఇబ్బందులను కొన్ని ఆనందాలను అనుభవించనున్నారు. మీ రాశి ప్రకారం ఏలినాటి శని ప్రభావము ధన స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది.
2018లో వృశ్చికరాశి వారు కొన్ని రకాల ఇబ్బందులను కొన్ని ఆనందాలను అనుభవించనున్నారు. మీ రాశి ప్రకారం ఏలినాటి శని ప్రభావము ధన స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా సమస్యలు, కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు.

అవతలి వ్యక్తులకు మేలు
అయితే మీరు ఏ సలహా ఇచ్చినా అవతలి వ్యక్తులకు అది బాగా ఉపయోగపడుతుంది. 2018లో వృశ్చికరాశి వారు ఇంకా ఏయే విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు.. ఏయే విషయాల్లో ఆనందంగా ఉంటారో.. ఎక్కడ వీరికి కలిసి వస్తుందో తెలుసుకోండి.

అందరి ఆప్యాయత
మీరు మీ కుటుంబంపరంగా ప్రశాంతంగా ఉంటారు. అందరి ఆప్యాయత మీకు లభిస్తుంది. మీ సోదరులు, సోదరీమణులు మీతో చాలా అన్యోన్యంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు 2018లో చాలా ప్రాంతాలకు ప్రయాణిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ఖర్చులు భరించాలి
మీరు కుటుంబపరంగా కొన్ని ఖర్చులు భరించాల్సి వస్తుంది. మీ రాశిలో శని ఉంటాడు. అందువల్ల మీ వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతాయి.

మీ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతారు
మీరు మీ భార్యతో ఏవైనా విషయాలు దాచాలని ప్రయత్నించినా, లేదంటే అబద్దాలు చెప్పినా తర్వాత ఆమె మిమ్మల్ని కచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. అందువల్ల మీరు మీ భార్య దగ్గర ఎలాంటి విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించకండి.

జాగ్రత్త
మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆమె కొన్ని రకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల విషయంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వాళ్లు మీ మాట వినే పరిస్థితి ఉండకపోవొచ్చు. దీని వల్ల మీరు కాస్త అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ తండ్రిగారి కూడా కాస్త అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే మీ ప్రతి సమస్యలో మీకు మీ తోబుట్టువులు అండగా నిలుస్తారు.

శని సోత్రం
2018లో వృశ్చికరాశి వారు 40 రోజుల పాటు శని సోత్రాన్ని పఠించాలి. దీని వల్ల మీరు చాలా సమస్యల నుంచి తప్పించుకుంటారు. శని 8వ స్థానంలో ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆస్తుల కొనుగోలు లేదా విక్రయంవంటివి కూడా చేపడుతారు.

కొన్ని సమస్యలు
2018లో వృశ్చికరాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కంటికి సంబంధించి, చెవి సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. మీరు కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

కిడ్నీ వ్యాధులు
జీర్ణాశయ సంబంధింత వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉంండి.
తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. రోజులో పరగడుపునే గోరు వెచ్చని నీరు తాగండి. మంచి ఫలితం ఉంటుంది.

ఆర్థిక విషయాలు
2018లో వృశ్చికరాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తాగా ఉండాలి. కొన్ని రకాల అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అయితే మీరిచ్చే విరాళాలు, మీరు కొన్ని మంచి పనులకు సంబంధించి చేసే దానధర్మాలు మీకు మంచిని చేకూరుస్తాయి.

అక్టోబర్ నుంచి అన్నీ లాభాలే
బృహస్పతి మీ రాశిలో ప్రథమ స్థానంలోకి రావడం వల్ల అక్టోబర్ నుంచి మీరు ఆర్థికపరంగా మంచి లాభాలు చవిచూస్తారు. మీకు మంచి ఆదాయం వస్తుంది. అంతవరకు ఓపికతో ఉండండి. మీరు బ్రాహ్మణులకు ఏదైనా దానంగా ఇస్తే అంతా మంచినే చూస్తారు.

చదువు.. ఉద్యోగం.. ఉపాధి
మీరు నిరుద్యోగులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మీరు విదేశాల్లో చదవాలనుకుంటే మాత్రం మీకు అనుకూలంగా పరిస్థితులుంటాయి.

పని చేసే చోట జాగ్రత్త
2018లో వృశ్చికరాశి వారు పని చేసే చోట సహచరులు (కోలిగ్స్) వ్యతిరేకంగా చాలా పన్నాగాలు పన్నుతారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటారు. అందువల్ల మీరు సహచరులను ఎక్కువగా నమ్మకండి.

వ్యాపారం
2018లో వృశ్చికరాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. పెద్దగా నష్టాలుండవు. ఈ విషయంలో మీరు ఎలాంటి చింత లేకుండా ఉండొచ్చు.

ప్రేమ
మీ జీవిత భాగస్వామితో మీతో ప్రేమగా మెలుగుతారు. మీకు సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండువు. ఒకవేళ చిన్నచిన్న సమస్యలు తలెత్తినా వాటిని పెద్దగా తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ మీకు పెళ్లి కానట్లయితే మీరు 2018లో లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ సూచనలు పాటించండి
మీరు 4.25 క్యారెట్స్ ఉండే ఎరుపు రంగు ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది. అలాగే రోజు హనుమాన్ చాలిసా కూడా పఠిస్తే మంచిది. అలాగే మీకు ఏదైనా విషయంలో కోపం వస్తే దాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీరు నిత్యం హనుమాన్ తలుచుకుంటూ ఉంటే చాలు. అంతా మంచే జరుగుతుంది.



Click it and Unblock the Notifications