For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరణించిన తర్వాత ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, అకౌంట్స్ ఏమౌతాయో తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సామజిక మాధ్యమాలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో మరియు స్నేహితులతో ఎల్లప్పుడూ సంభాషించేందుకు మరియు కొత్త విషయాలు తెలుసుకునేందుకు, కొత్త వారిని స్నేహితులుగా చేసుకునేందుకు మరియు మీ యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునేందుకు సామజిక మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

మీ అంతకు మీరు గా సామాజిక మాధ్యమాలను నిర్వహించేటప్పుడు ఎంతో బాగుంటుంది. కానీ మీరు మరణించిన తర్వాత మీ సామాజిక మాధ్యమాల ఖాతాలను ఎవరు నిర్వహిస్తారు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా?

<strong>సామాజిక మాధ్యమాలు నేర్పే 5 జీవిత పాఠాలు !</strong>సామాజిక మాధ్యమాలు నేర్పే 5 జీవిత పాఠాలు !

చాలా సామజిక మాధ్యమాల్లో ఆయా సంస్థల గోప్యతా విధానం మరియు నియమ నిబంధనలకు అనుగుణంగా వాటిని నిర్వహించడం జరుగుతుంది.

ఫేస్ బుక్ నుండి ట్విట్టర్ వరకు మీ మరణం తర్వాత వాటిని ఎలా నిర్వహిస్తారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

<strong>రిలేషన్ ఫిప్ ఉన్నప్పుడు ఈ ఫేస్ బుక్ పొరపాట్లు నివారించండి</strong>రిలేషన్ ఫిప్ ఉన్నప్పుడు ఈ ఫేస్ బుక్ పొరపాట్లు నివారించండి

1. ఫేస్ బుక్ :

1. ఫేస్ బుక్ :

ఈ ప్రపంచంలో అత్యధికంగా వాడే సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ కూడా ఒకటి. మరణించిన వారి కోసం ఫేస్ బుక్ వాళ్ళు కొన్ని ప్రత్యేక మైన నియమ నిబంధనలను ప్రవేశపెట్టారు. ఆ ఖాతాను ఎప్పటికీ తెరుచుకోకుండా తొలగించుకోవచ్చు లేదా వారి యొక్క జ్ఞాపకార్ధం అలానే ఉంచుకోవచ్చు. ఎవరైనా వ్యక్తులు మరణించిన తర్వాత వారి గుర్తుగా ఖాతాను ఉంచుకోదలిస్తే, వారు మరణించిన తర్వాత వారి పేరు ప్రక్కన " రిమెంబెరింగ్ (మీ గుర్తుగా) " అని రాసి ఉంటుంది. మీరు మరణించిన తర్వాత ఎవరు మీ ఖాతాని నిర్వహించాలి అనే విషయమై మీరు ఫేస్ బుక్ తో ఒక చట్టపరమైన ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు, ఆ వ్యక్తి కి గల సంబంధం గురించి తెలుపవలసి ఉంటుంది. మీరు మరణించారు అని దృవీకరణ పత్రం ఫేస్ బుక్ కి సమర్పించిన తర్వాత ఫేస్ బుక్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఒప్పందం ప్రకారం మిగతా పనులన్నీ వారు పూర్తి చేస్తారు.

2. యూట్యూబ్ :

2. యూట్యూబ్ :

యూట్యూబ్ ఖాతాను నిర్వహించే వ్యక్తి తన తదుపరిగా ఎవరు నిర్వహించాలి అనే విషయమై ఆ వ్యక్తికి పూర్తి స్వేచ్చని ఇచ్చింది యూట్యూబ్. తన తదనంతరం ఆ యూట్యూబ్ ఖాతాను ఎవరు నిర్వహించాలి అనే విషయమై ఆ వ్యక్తి నిర్ణయించుకోవచ్చు. ఎవరైతే యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారో వారందరికీ ఇది చాలా శుభపరిణామం. ఒక చట్ట పరమైన ఒప్పందపత్రంలో మీ తదనంతరం ఎవరు మీ ఖాతాను నిర్వహించాలి అనే విషయమై తెలియజేస్తూ యూట్యూబ్ కి పంపాలి. మీరు గనుక ఇలా గనుక చేయకపోతే, మీ ఖాతా కొన్ని రోజులు వాడకుండా అలాగే గనుక ఉంచినట్లయితే, యూట్యూబ్ శాశ్వతంగా కొన్ని రోజుల తర్వాత ఖాతాను తొలగిస్తుంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తిని ఎవరినైనా మీ యూట్యూబ్ ఖాతా వారసుడిగా ఎంచుకోవడం మంచిది.

3. ఇంస్టాగ్రామ్ :

3. ఇంస్టాగ్రామ్ :

ఇంస్టాగ్రామ్ విధానాలు దాని మాతృ సంస్థ అయిన ఫేస్ బుక్ కు పోలిన విధంగానే ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం ఖాతాను జ్ఞాపకార్ధం ఉంచుకోవచ్చు లేదా శాశ్వతంగా మూసివేయవచ్చు. కానీ, ఇది మీ చేతుల్లో లేదు ఏ వ్యక్తి అయితే మీరు మరణించారని ఇంస్టాగ్రామ్ కి మరణ దృవీకరణ పత్రాన్ని సమర్పిస్తారో, ఆ వ్యక్తి మీ అకౌంట్ ని తీసివేయాలా లేక మీ జ్ఞాపకార్ధం అలానే ఉంచాలా అనే విషయం నిర్ణియించవలసి ఉంటుంది.

4. ట్విట్టర్ :

4. ట్విట్టర్ :

సామజిక మాధ్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరు సంపాదించిన వాటిల్లో ట్విట్టర్ కూడా ఒక్కటి. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతడి యొక్క ఖాతాను ఏమి చేయాలి అనే విషయమై, ఈ సంస్థకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కానీ ట్విట్టర్ నియమ నిబంధనల ప్రకారం, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఆ వ్యక్తి ఖాతాను తొలగించమని ట్విట్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధనను స్వీకరించిన తర్వాత ట్విట్టర్ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అవునా కాదా, మరణించిన వ్యక్తి పెట్టిన పోస్టులు, చిత్రాలను మరియు ఖాతాను పరిశీలించి నిజమని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ ఖాతాను తొలగించడం జరుగుతుంది. మరణ దృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి.

5. కొర :

5. కొర :

ఈ రెండు మూడు సంవత్సరాల్లో కొర ఒక శక్తివంతమైన సామజిక మాధ్యమంగా ఎదిగింది. ఒక ప్రముఖ సంస్థగా ఎదిగిపోయింది. ఈ సంస్థ విధానాల ప్రకారం, అభ్యర్ధన మేరకు చనిపోయిన వ్యక్తి యొక్క ఖాతాను అతనికి గుర్తుగా ఉంచుతారు. ఇలా చేయాలంటే చనిపోయిన వ్యక్తి యొక్క మరణ దృవీకరణ పత్రం సమర్పించవలసి ఉంటుంది.

మీ సామజిక మాధ్యమాల యొక్క యూజర్ నేమ్ ఏమవుతుంది :

మీ సామజిక మాధ్యమాల యొక్క యూజర్ నేమ్ ఏమవుతుంది :

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మరియు ఇతర సామజిక మాధ్యమాలను నిర్వర్తిస్తున్న ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వడం జరుగుతుంది. దీనినే యూజర్ నేమ్ అని అంటారు. లింక్డ్ ఇన్ మరియు ఫేస్ బుక్ మరణించిన వారి యూజర్ నేమ్ లను వేరే వాళ్లకు ఇస్తాయి. కానీ, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ మరియు గూగుల్ మరణించిన వారి యూజర్ నేమ్ లను వేరే వాళ్లకు ఇవ్వవు.

మరణించిన తర్వాత ఎంత కాలం పాటు సామజిక మాధ్యమాల ఖాతాలు క్రియాశీలం గా ఉంటుంది:

మరణించిన తర్వాత ఎంత కాలం పాటు సామజిక మాధ్యమాల ఖాతాలు క్రియాశీలం గా ఉంటుంది:

మీరు మరణించారు అనే విషయం ఏ వ్యక్తి అయినా నివేదిక ఇచ్చేవరకు మీ ఫేస్ బుక్ ఖాతా క్రియాశీలం గానే ఉంటుంది. మీరు మరణించారు అనే నివేదిక అందగానే లింక్డ్ ఇన్ మీ ఖాతాను మూసివేస్తుంది. పిన్ ఇంటరెస్ట్ లో ఖాతా ఎప్పటికీ క్రియాశీలంగానే ఉంటుంది. ఆరు నెలలు ఏ ట్విట్టర్ ఖాతా అయినా క్రియాశీలం గా లేకపోతే మీ ఖాతాను తొలగించే చర్యలకు ఆ సంస్థ వారు ఉపక్రమిస్తారు. గూగుల్ కి ఎవరైనా మీ మరణం గురించి తెలియజేస్తే ఆ వెంటనే మీ ఖాతా తొలగించబడుతుంది.

వివిధ సామజిక మాధ్యమాల నియమ నిబంధనలు మరియు గోప్యత ప్రమాణాలు పైన చెప్పబడినవి. అవి అర్ధవంతంగా మరియు మరణించిన వ్యక్తికి తగిన న్యాయం జరిగేలా ఉన్నాయా లేదా? మీరేమనుకుంటున్నారో క్రింద కామెంట్ చేయడం మరచిపోకండి.

English summary

Who Operates Your Social Media Account After Death?

From Facebook to Twitter, here's who operates your social media account after death. Read to know more about..
Story first published:Saturday, October 7, 2017, 17:21 [IST]
Desktop Bottom Promotion