Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
దిన ఫలాలు: ఆదివారం 17 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 17-12-2017 తారీఖు, ఆదివారం నాటి వారఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, మార్గశిర మాసం, బహుళ చతుర్దశి ఉదయం 8.55 వరకూ ఉంటుంది. జ్యేష్ఠా నక్షత్రం పూర్తిగా ఉంది. అమృత సమయం ఉదయం 9 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 10 గంటల 33 నిమిషాల నుండి 12.18 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం సాయంత్రం ఉదయం 3 గంటల 39 నిమిషాల నుండి 4 గంటల 43 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 26 నిమిషాల వరకూ, సూర్యాస్తమయం 5 గంటల 23 నిమిషాల వరకూ.

మేష రాశి వారికి ;
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్త అవకాశాలు చేజారకుండగా ప్రయత్నం చేయాలి. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భార్యా పిల్లలతో ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలలో పాలు పంచుకుంటారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. మీ సోదరులతో మంచి విషయాలు పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలుసామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;
అనుకున్న పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. వాయిదాలు కూడా వేస్తారు. ధనానికి కొరత ఉంటుంది. పిల్లలు వారి పనులు వారు పట్టుదలగా పూర్తి చేస్తారు. భార్యతో మంచిగా మెలగవలసిన సమయం. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవటం ఎంతైనా ఉత్తమం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి ;
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటారు. గృహ సంబంధ పనులు విజయవంతంగా నడుస్తాయి. ధన సంబంధ పనులు ఇబ్బందిపెడతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దుర్గా దేవి ఆరాధన వలన కొన్ని ఆటంకాలు తొలగుతాయి.

సింహ రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సోదరుల సహకారం ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తల్లిని ప్రేమగా చూసుకుంటారు. పిల్లల మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;
బంధువుల రాకపోకలు ఉంటాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఇంటి మీద బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. పిల్లల ప్రవర్తన గురించి బెంగ పడవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

తులా రాశి వారికి ;
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. సోదరుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల ద్వారా సొమ్ము లాభిస్తుంది. భార్య సహకారంతో అన్ని విషయాలలో విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి వారికి ;
తలచిన పనులు పూర్తి చేస్తారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. విందు భోజనం చేస్తారు. భార్య సహకారంతో ప్రణాళికలు వేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారం ద్వారా ధనం చేకూరుతుంది.

ధనస్సు రాశి వారికి ;
చేయు పనులు ఆలస్యమవుతాయి. వాయిదాలు కూడా పడతాయి. ఎన్నో ఆలోచనలు చేస్తారు. ధనం కోసం ఇబ్బందులు కూడా పడతారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. భూ సంబంధమైన పనులు లాభాన్ని తెస్తాయి.

మకర రాశి వారికి ;
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో పూర్తి చేస్తారు. భార్య సహకారం ఆనందాన్ని ఇస్తుంది. దుర్గా దేవి ఆరాధనతో లాభాలు కలుగుతాయి. అశాంతి తొలగగలదు.

కుంభ రాశి వారికి ;
అనుకున్న పనులు లాభాన్ని తెస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. తండ్రి గారి సహకారం ఉంటుంది. భార్యతో సమాలోచనలు చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. పని వారి సహకారం కూడా లభిస్తుంది.

మీన రాశి వారికి ;
మొదట్లో పనులు ఇబ్బందికి గురి చేస్తాయి. దూర ప్రాంత వార్తలు వింటారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో చేయవలసి ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.
ఇప్పటి వరకూ ఈ వార ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications