Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దిన ఫలాలు: సోమవారం 18 డిసెంబర్ 2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 18-12-2017 తారీఖు, సోమవారం నాటి వారఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, మార్గశిర మాసం, అమావాస్య ఉదయం 10 గంటల 53 నిమిషాల వరకూ ఉంది. జ్యేష్ఠా నక్షత్రం ఉదయం 6 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం 2 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి ఒంటి గంట 22 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం మరలా మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 23 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి వారికి ;
దూర సంభాషణలు చేస్తారు. భార్య సహాయంతో కఠినమైన పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ప్రేమను గెలుస్తారు. పిల్లలతో షికారు చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి వారికి ;
తలచిన కోరికలు నెరవేరుతాయి. కొన్ని అవకాశాలు చేజారకుండా చూడాలి. పని వారి సహకారం ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. సోదర సహకారం కూడా ఉంటుంది.

మిథున రాశి వారికి ;
చేయు పనులు పూర్తి చేస్తారు. ధనానికి కొరత ఉంటుంది. పిల్లలు బాధ్యతతో వ్యవరిస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి.

కర్కాటక రాశి వారికి ;
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. కొత్త పనులు చేజారకుండా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన పనులన్నీ చూస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి వారికి ;
పిల్లల అవసరాలు అన్నీ చూస్తారు. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు. ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;
గృహ అవసరాలు తీరుస్తారు. పనివారి సహకారం ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

తులా రాశి వారికి ;
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. సోదర కలయికలు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ;
భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. దూర ప్రాంత బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు ధనం కలుగచేస్తాయి.

ధనూ రాశి వారికి ;
మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి భోజనం లభిస్తుంది. బంధు మిత్రుల సహకారం కూడా ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ;
తలచిన పనులు ఆటంకాలతో వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. భార్య మాటలు అంతగా రుచించవు. కుటుంబ సభ్యులతో ఎక్కడన్నా దూరంగా కాలక్షేపం చేసి వస్తారు.

కుంభ రాశి వారికి ;
బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. ఇంటి అవసరాలు తీరుస్తారు. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

మీన రాశి వారికి ;
వృత్తి వ్యాపారాలు అనుకూల లాభాన్ని ఇస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేయటం మంచిది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications