Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దిన ఫలాలు: బుధవారం 20 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 20-12-2017 తారీఖు, బుధవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ విదియ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకూ ఉంది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుండి 8 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి 8 గంటల 51 నిమిషాల నుండి 10 గంటల 31 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 11 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. సూర్య ఉదయ సమయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
తండ్రి గారి ఆశీర్వాద బలం ఉంటుంది. భార్య సహకారంతో అన్ని పనులూ పూర్తి చేస్తారు. తలచిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యం కలుగచేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
కొన్ని అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. చేయు పనులందు ఆటంకాలు కూడా ఉంటాయి. మీ కింది పని వారి సహకారం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
ధనానికి ఇబ్బంది ఉంటుంది. పిల్లలు వారి పని భాధ్యతగా పూర్తి చేస్తారు. తలచిన పనులు వాయిదా పడతాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
ధన ఇబ్బందులు ఉంటాయి. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. పిల్లలు ఆనందాన్ని కలుగచేస్తారు. తలచిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులు సహకారంగా మసలగలరు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంటుంది. భార్య సహకారంగా మసలగలదు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. ధన ప్రణాళికలు వేస్తారు. పని వారి సహకారం మెండుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. సోదర రాకపోకలు ఉంటాయి. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
ధన ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. రావాల్సిన సొమ్ము మీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనం చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
మనస్సు శాంతిగా ఉన్నప్పటికీ కొంత అశాంతి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ధనానికి కొంత కాలం పడుతూ ఉంటుంది. సోదరులు, మిత్రుల దగ్గర సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
భక్తి ప్రవచనాలు వింటారు. చేయు పనులన్నీ వృథాగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి.

కుంభ రాశి: 21 జనవరి- 19 ఫిబ్రవరి
కింద పని వారి సహకారం ఉంటుంది. భార్య సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
దైవ దర్శన ప్రాప్తి ఉంటుంది. ఆలస్యమయినప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications