Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
దిన ఫలాలు: బుధవారం 27 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 27-12-2017 తారీఖు, బుధవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ నవమి, బుధవారం రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు ఉంది. అమృత సమయం ఉదయం 6 గంటల 32 నిమిషాలు నుండి 8 గంటల 7 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 36 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 11 గంటల 28 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్య అస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి ( 21 మార్చి-20 ఏప్రిల్ )
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినాలనే కోరిక ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఏ విషయమైనా భార్యతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృషభ రాశి (21 ఏప్రిల్-21 మే )
చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బిల్లులు బకాయిలు కట్టవలసిన సమయం. పని వారి సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మిథున రాశి ( 22 మే-21 జూన్ )
వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సోదరులు సహకారంగా మసులుకోగలరు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలకు అనుకూలమైన సమయం. భార్య సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు.

కర్కాటక రాశి (22 జూన్-22 జూలై )
తండ్రి గారి సహాయ సహకారాలు పొందుతారు. బంధు కలయికలు ఉంటాయి. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. పిల్లలతో బాధ్యతగా మెసులుతారు. భార్యతో సహకారంగా మసులుకోవాల్సిన సమయం.

సింహ రాశి (23 జూలై-21 ఆగష్ట్ )
ఆరోగ్య మెలకువలు అవసరంగా తీసుకోవాలి. దైవ దర్శన ప్రాప్తి కలదు. బిల్లులు చెల్లించవలసిన సమయం. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయాలి.

కన్యా రాశి ( 22 ఆగష్ట్-23 సెప్టెంబర్)
చేసే పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ధన ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. కుటుంబం పట్ల శ్రద్ధగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తులా రాశి ( 24 సెప్టెంబర్-23 అక్టోబర్)
చేయు పనులందు శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని అవకాశాలు చేజారకుండగా ప్రయత్నం చేసుకోవాలి. పిల్లలతో శ్రద్ధగా మసులుకోవాల్సి వుంటుంది. భార్య అనుకూలంగా మసలగలదు. వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి.

వృశ్చిక రాశి (24 అక్టోబర్-22 నవంబర్)
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలు అభివృద్ధి కోసం చేయు పనులు ఫలిస్తాయి. దైవ దర్శనం చేస్తారు. మంచి భోజనం చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరుతుంది.

ధనస్సు రాశి ( 23 నవంబర్-22 డిసెంబర్)
ఆరోగ్య సూత్రాలు పాటించవలసి ఉంటుంది. ఇంటి పనులు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పాత మిత్రుల కలయికలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

మకర రాశి ( 23 డిసెంబర్-20 జనవరి)
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనులందు ఆటంకాలు ఉంటాయి. భార్య తరపు బంధువులు వస్తారు. పిల్లల యెందు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి.

కుంభ రాశి ( 21 జనవరి-20 ఫిబ్రవరి)
ధన ప్రణాళికలు వేస్తారు. పని వారి సహకారం ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు సమాచారాలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి.

మీన రాశి (20 ఫిబ్రవరి-20 మార్చి)
సుఖ భోజనం చేస్తారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. అనుకున్న ఊహలు నిజం అవుతాయి. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో చేయవలసి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications