Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దిన ఫలాలు: బుద వారం 6 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.6-12-2017 తారీఖు, బుధవారం నాటి దినఫలాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత రుతువు, మార్గశిర మాసం,బహుళ తదియ మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల వరకూ ఉన్నది. పునర్వసు నక్షత్రం రాత్రి, తెల్లవారితే 3.28 నిమిషాల వరకూ ఉన్నది. అమృత సమయం రాత్రి 1.14 నిమిషాల నుండి 2 గంటల 32 నిమిషాల వరకూ ఉన్నది. వర్జ్యం సాయంత్రం 4 గంటల 26 నిమిషాల నుండి 6 గంటల 25 నిమిషాల వరకూ ఉన్నది. దుర్ముహుర్తం ఉదయం 11 గంటల 28 నిమిషాల నుండి 12 గంటల 16 నిమిషాల వరకూ ఉన్నది. సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 21 నిమిషాల వరకూ ఉన్నది.

మేష రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మనస్సుకి అశాంతిగా ఉండవచ్చు. భార్యా పిల్లల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి వారికి ;
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ధనానికి ఇబ్బంది ఉన్నప్పటికీ ధనం చేకూరగలదు. పనివారి సహకారం ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;
మనస్సు ఆనందంగా ఉంటుంది. ధనం ఇబ్బంది ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేకూరగలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి;
ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. ఇంటికి అవసరాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామితో బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది.

సింహ రాశి వారికి ;
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దగ్గరి బంధువుల రాకపోకలుంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఇంటి బాధ్యతలను గూర్చి ఆలోచించవలసి వస్తుంది. పిల్లల గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి వారికి;
కొంత అశాంతికి గురవుతారు. కావాల్సినంత ధనం చేతికి అందుతుంది. ఇంటి అవసరాలు బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటే అన్నీ సక్రమంగా జరగగలవు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ;
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోగలరు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ధనూ రాశి వారికి ;
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ధన ఇబ్బందులు కలవు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. సోదరుల వలన, మిత్రుల వలన లాభం చేకూరగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ;
మనస్సు అశాంతిగా ఉంటాయి. విరోధాలు పెరుగుతాయి. సోదరుల సహకారం ఉండగలదు. పెద్దల ఆశీర్వాదం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.

కుంభ రాశి వారికి ;
అనుకున్నవి లాభదాయకంగా పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సహచరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. సమస్యలు అవంతట అవే పరిష్కారమవుతాయి.

మీన రాశి వారికి ;
మనస్సుకి అశాంతి కలుగుతుంది. ఇంటి పనులు పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. తండ్రి గారి సహకారం పొందవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతతో పూర్తి చేయవలసి వస్తుంది.
ఇప్పటివరకూ ఈ రోజు దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా
ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications