దిన ఫలాలు: శుక్రవారం 8 డిసెంబర్ 2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

By Deepthi T A S

Daily Horoscope Telugu దిన ఫలాలు 08-12-2017

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః

అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.

ది.8-12-2017 తారీఖు, శుక్రవారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ పంచమి ఉదయం 10 గంటల 51 నిమిషం వరకూ ఉన్నది.

ఆశ్లేష నక్షత్రం 12 గంటల 52 నిమిషాల వరకూ ఉన్నది. అమృత సమయం రాత్రి 11 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 41 నిమిషాల వరకూ ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకూ ఉంటుంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకూ ఉంటుంది. మరలా దుర్ముహర్తం 12 గంటల 14 నిమిషాల నుంచి 12 గంటల 54 నిమిషాల వరకూ ఉన్నది. సూర్యోదయం సమయం 6 గంటల 21 నిమిషాలు మరియు సూర్యాస్తమయం 5 గంటల 22 నిమిషాలకు.

మేష రాశి వారికి ;

మేష రాశి వారికి ;

తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా మసులుతారు. పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి వారికి ;

వృషభ రాశి వారికి ;

అనుకున్న పనులు నెరవేరతాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;

మిథున రాశి వారికి ;

ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అవసరాలకి ధనం చేకూరుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో అనుకూలంగా మసలుకోండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి ;

కర్కాటక రాశి వారికి ;

అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. గృహ సంబంధ పనులు అనుకూలిస్తాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి వారికి ;

సింహ రాశి వారికి ;

ఇంటికి సంబంధించిన పనులు నెరవేరుస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు కూడా ఉంటాయి. భూ సంబంధమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;

కన్యా రాశి వారికి ;

బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. ధన ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. సోదరుల సహకారం ఉంటుంది. పిల్లల గురించి శ్రద్ధ వహించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి వారికి ;

తులా రాశి వారికి ;

అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనం గురించి ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. సోదర సహకారం ఉండగలదు. భార్య సహకారం ఉండగలదు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి వారికి ;

వృశ్చిక రాశి వారికి ;

ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనం గురించి కష్టపడవలసి ఉంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. తండ్రి గారి సహకారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆకట్టుకుంటాయి.

ధనూ రాశి వారికి ;

ధనూ రాశి వారికి ;

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అప్పులు చేయవలసి వస్తుంది. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలవలసిన సమయం. మిత్రులు తోడుగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ;

మకర రాశి వారికి ;

శరీర శ్రమ ఉంటుంది. భార్య సహకారం కూడా ఉంటుంది. అధికార లాభం కలదు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కుంభ రాశి వారికి ;

కుంభ రాశి వారికి ;

ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. మేనమామ, బంధువుల రాకపోకలు ఉంటాయి. లాభం చూడటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి గారి సహాయ సహకారం తీసుకోండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి వారికి ;

మీన రాశి వారికి ;

అనుకున్న పనులు నెరవేరటానికి కష్టపడవలసి ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. పనివారి సహకారం ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాల విషయంలో శ్రమ పడవలసి ఉంటుంది.

ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.

సర్వేజనా సుఖినోఃభవంతు

సమస్త సన్మంగళానిభవంతు

అందరికీ నా నమస్కారం.

Desktop Bottom Promotion