Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
దిన ఫలాలు: శనివారం 9 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దిన ఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.9-12-2017 తారీఖు, శనివారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం.
హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ షష్టి ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకూ ఉన్నది. మఖ నక్షత్రం రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉన్నది. అమృత సమయం ఉదయం 9.20 నుంచి 10 గంటల 50 నిమిషాల వరకూ ఉంటుంది. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుంచి 1 గంట 41 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 21 నిమిషాలు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 22 నిమిషాలు.

మేష రాశి వారికి ;
భూ సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం తప్పనిసరిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

వృషభ రాశి వారికి ;
ఇంటి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పనివారి సహకారం ఉంటుంది. ఇంటి సౌఖ్యం ఉంటుంది. తల్లి గారితో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది.

మిథున రాశి వారికి ;
తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. ధన ఇబ్బందులున్నాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. పిల్లలు పట్టుదలగా వారి పనులను పూర్తి చేస్తారు. భార్యతో జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి ;
చేయు పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ధనానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తారు. పిల్లలు అనుకూలంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

సింహ రాశి వారికి ;
తలచిన పనులన్నీ సులువుగా సాగుతాయి. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించండి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్యా రాశి వారికి ;
ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. భూ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ పెట్టి పూర్తి చేయవలసి ఉంటుంది. పనివారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

తులా రాశి వారికి ;
ఈ రోజు మనసు ఆనందంగా గడుస్తుంది. అవసరానికి డబ్బు చేకూరుతుంది. సోదరులతో జాగ్రత్తగా ఉండండి. భార్య సపోర్టుగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చిక రాశి వారికి ;
ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనానికి ఇబ్బంది కలదు. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూరప్రాంతాల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ధనూ రాశి వారికి ;
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అవసరాల కోసం అప్పులు చేయవలసి వస్తుంది. తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి. అంతా మంచిగా జరగగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ;
తలచిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. ధనపరమైన చిక్కులు ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారకుండా జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అధికారుల ప్రసన్నత ఉంటుంది.

కుంభ రాశి వారికి ;
శరీర శ్రమ ఉంటుంది. భార్య సహాయ సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు. తండ్రి గారి అనుగ్రహం పొందండి. సమస్యల బారి నుండి బయటపడగలరు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. బంధు మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది.

మీన రాశి వారికి ;
కలహాలకి తావు ఇవ్వకండి. ఆర్థికపరమైన చిక్కులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తి చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు.
ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications