For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వయసును నిర్ద్దేశించి జ్యోతిష్య కాల చక్రం ఇలా ఉంటుంది.

|

పుట్టుక నుండి చావు దాకా ఒక కాల చక్రం ఉంటుందని అందరి నమ్మకం, ఈ రెండింటి చివరల మద్య ఉండేదే జీవితం. అది అందంగా మార్చుకోగలమో లేదా ఒడిదుడుకులతో సాగుతుందో మన చేతుల మీదనే ఉంటుంది అనునది జగమెరిగిన సత్యం. కానీ ఒక్క శిశువుగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం మీద, చుట్టూ పరిస్తితుల మీద ఎటువంటి అవగాహన లేకుండా, అన్ని రకాల సంతోషాలను భాధలను ప్రతి ఒక్కరిలాగే సమానంగా పొందుతారు. ఇక్కడ డబ్బు, అంతస్తు, కుల మత ప్రస్తావనలు కూడా ఉండవు.

ప్రతి మనిషి ఈ విశ్వం లోనికి అడుగు పెట్టాక, నాలుగు అంశాలతో కూడిన ఆలోచనలే ఎక్కువ చేస్తాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టలు, కంటినిండా నిద్ర. మిగిలిన సమయంలో ఎలా ఈ సమాజంలో నిలదొక్కుకోవాలి అన్న ప్రయత్నంతోనే గడిచిపోతుంది. తద్వారా అనేక పాఠాలను నేర్చుకోవడం, సరికొత్త జీవన విధానాన్ని ప్రారంభించడం జరుగుతుంది.

Astrology life cycle according to your age

ఎప్పుడైతే వృద్దాప్యంలోనికి అడుగు పెడుతామో, జీవితం నిస్సహాయంగా ఒకరిపై ఆధారపడి జీవించే స్థితికి వస్తుంది. ఈ సమయంలోనే అత్యధిక కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. సరైన కుటుంబం లేని ఏ వ్యక్తి అయినా చివరకు దౌర్భల్యమైన జీవితాన్ని చూడవలసి ఉంటుంది. వృద్దాశ్రమాలలో చేర్చే వారే కాదు, ప్రాణాలు హరించే వారు కూడా ఈ లోకాన లేకపోలేదు. వృద్దాప్య చాయలు వచ్చేలోగా మానవత్వపు చాయలు కుటుంబంలో పోకుండా కాపాడుకోవలసిన భాద్యత అందరిమీదా ఉంది. ఈ ఒక్క విషయాన్ని మరిస్తే, ఎంత బ్రతుకు బ్రతికినా చివరికి హీన స్థితిలో మరణం చూడవలసి ఉంటుంది.

ఈ క్రియాశీల జీవితాన్ని జ్యోతిష్యo కాలచక్రంగా పరిగణించి భాగాలుగా విభజిస్తుంది. ఈ చక్రాల ప్రభావాలను గుర్తించిన క్షణాన, జీవితంలో వ్యక్తిగత అభివృద్దిని గుర్తించగలరు.

21 నుండి 24 వయసులో :

21 నుండి 24 వయసులో :

ఈ వయసు లో పరిస్థితులను సంతులనం చేసే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం శని గ్రహo ¾ మార్గంలో ఉండడమే. మీ జన్మ కుండలిని, పుట్టిన సమయాన్ని నిర్దేశించి గ్రహాల స్థితిగతులను అంచనా వేస్తారు. ఇక్కడ యురేనస్, తన మొదటి ¼ మార్గాన్ని తీసుకుంటుంది. ఈ గ్రహం వ్యక్తిగత భాద్యతల గురించిన సంతులనాన్ని క్రమబద్దీకరిస్తుంది. తద్వారా మనిషి ఆలోచనా విధానాలు, సమాజంతో మెలిగే తీరు, భావోద్వేగాలు ఇలాంటి మొదలైన అంశాలన్నీ ఈ వయసులోనే ప్రభావితమవుతాయి. తద్వారా వీరిమీద అంచనాలను కూడా నిర్దేశితమవుతాయి.

28 నుండి 30 వయసు మద్య :

28 నుండి 30 వయసు మద్య :

ఒక మనిషి జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసే కాలం ఇది. ఒక వ్యక్తి తనకంటూ స్థానాన్ని పదిలపరచుకునే సమయంగా ఈ కాలం ఉంటుంది. శని గ్రహం వీరి జన్మ కుండలిలో ఉండే స్థానం దృష్ట్యా వీరి జీవితంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ముందు చక్రoలో తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండవు, కానీ ఆ నిర్ణయాల ప్రభావాలు మాత్రం ఈ చక్రంలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. తద్వారా తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. సానుకూల ప్రతికూల అంశాల తేడాలతో ఈ చక్రం ఒడిదుడుకుల మద్య కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ ప్రతికూల ప్రభావాలు అంటే ఉద్యోగ వ్యాపార విషయాల యందు మరియు సంబంధాల విషయంలో ఉంటాయి. కానీ ఈ చక్రంలో ఉండే ప్రతికూల పరిస్థితులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు మరియు పరిష్కరించబడుతాయి. తెలివికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

35 నుండి 45 మద్యలో :

35 నుండి 45 మద్యలో :

ఈ చక్రం గురించి మాట్లాడే ముందు 30 లలో సమస్యలు అన్ని పరిష్కారమయ్యాయా, లేదా ప్రశాంతంగా చక్రం ముగిసిందా లేదా అని చూసుకోవలసి ఉంటుంది. 20 పైన మీరు తీసుకునే ప్రతి నిర్ణయం యొక్క సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఈ చక్రంలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. కానీ సమస్యలు ఏమున్నా 35 నుండి 45 మద్య కాలంలో పరిష్కార మార్గాలను సూచిస్తాయి. దీనికి కారణం నాలుగు ప్రధాన గ్రహాలూ ఒకదానితో ఒకటి ఎకీభవించడమే. కానీ ఈ కాలాన్ని అధిగమించడం పిల్లలాట కాదని మాత్రం గుర్తుంచుకోవాలి. కొందరికి ఈ కాలం సంక్షోభంతో కూడి ఉండవచ్చు కూడా.

52 నుండి 58 మద్యలో :

52 నుండి 58 మద్యలో :

40 లలో ఎదుర్కొన్న సంక్షోభాల పరిణామాలు 52 – 58 మద్య కొన్ని మాయని మచ్చగా కూడా మిగులుతాయి. లేదా సమాజంలో ఒక గుర్తింపుని తీసుకుని రావడంలో పాటుపడుతాయి. కొన్ని పరిస్థితులు మాత్రం తిరిగి తోడిన అనుభవానికి గురి చేస్తాయి. యుక్తవయసులో సామాజికంగా, మానసికంగా తగిలిన గాయాలు కాస్త ప్రభావాన్ని చూపినా కూడా, అవన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. వీటన్నిటి గురించిన ఆలోచనలకు కావలసినంత సమయం కూడా కేటాయించగలుగుతారు, తద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. ఇక్కడ గ్రహాల స్థానాలతో సంబంధమే లేదు. కొన్ని పాతగాయాలు మాత్రం ఎప్పటికీ మానవు.

59 నుండి 63 మద్య వయసు :

59 నుండి 63 మద్య వయసు :

దీనిని రెండవసారి శని దశ మొదలయ్యే సమయం గా గుర్తిస్తారు. కొందరికి మంచి పరిణామాలను ఇస్తే, కొందరికి నీచ స్థితిని చూపుతుంది. ముందు 3 దశకాల జీవన శైలి, సామాజిక పరిస్థితులు వంటి ప్రతి అంశం యొక్క ప్రభావాలు ఈ చక్రంలో కనిపిస్తాయి. తద్వారా జీవితంలో అన్ని మెట్లను అధిగామించగలిగారా లేదా అన్న మానసిక చర్చకు దారి తీస్తుంది. అంతరాత్మతో సంభాషణలు ఒక్కోసారి సంతోషాన్ని ఇస్తే, కొన్ని అసంతృప్తిని మిగులుస్తుంటాయి. దీనికి ముందు చక్రంలోని శని ప్రభావం కూడా కారణం కావొచ్చు.

84 వయసులో :

84 వయసులో :

ఇది అత్యంత కీలకమైన దశ, ఈ దశలో మీరు అదృష్టవంతులా లేదా దురదృష్టంతో సాన్నిహిత్యం చేసిన వారా అన్న చర్చ అంతరాత్మతో మొదలవుతుంది. కానీ గత అనుభవాలు అన్నీ ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం అన్న ఆలోచన మీ మనసుకు స్పురిస్తుంది. తద్వారా మానసిక చింతలు తొలగిపోతాయి. ఇక్కడ యురేనస్ అంత్యంత ప్రభావశీలిగా ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రకారం, యురేనస్ నూతన శక్తికి, సానుకూల దృక్పధానికి సంబంధించిన గ్రహం. ఈ వయసులో సాధారణంగా కుటుంబానికి సంబంధించిన జీవితంలోని అన్ని భాద్యతలను పూర్తి చేసుకుని దురదృష్టవశాత్తు మరణం కోసం ఎదురు చూసే సమయంగా ఈ చక్రం ఉంటుంది. మిగిలిన అన్ని చక్రాలలోని మనిషి యొక్క ప్రవర్తన సామాజిక దృక్పధం మొదలైన అంశాలన్నీ, ఈ చక్రంలో తన పని తనాన్ని చూపుతాయి. కావున మిగిలిన చక్రాలలో తెలివిగా ప్రవర్తించి, జీవిత చరమాంకం చక్కగా నడుపుకునేలా అడుగులు వేసి, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనిషి చర్యలకు గ్రహాలూ తోడ్పాటుని అందిస్తాయి, కానీ ఎంచుకునే మార్గాలను ఉద్దేశించి ఫలితాలు ఉంటాయి. చివరి చరమాంకంలో యురేనస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా జీవితంలోని అన్ని అంశాలను అంతరాత్మతో చర్చించగలరు.

English summary

Astrology life cycle according to your age

Did you know that for each stage of the life, there is an astrology life cycle that help us embrace personal growth in our lives? Yes, it is a belief that our active life can be further divided into astrology life cycles. From the age of 20 until the age of 95, we must know the importance of each phase.
Desktop Bottom Promotion