Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హస్త సాముద్రిక శాస్త్రంలో చేతి రేఖలు వృత్తిపరమైన అంశాల గురించి ఏం చెబుతున్నాయి ?
హస్త సాముద్రిక శాస్త్రంలో చేతి రేఖలు వృత్తిపరమైన అంశాల గురించి ఏం చెబుతున్నాయి ?
ఒక వ్యక్తి ఒక హస్త సాముద్రిక నిపుణుని దగ్గర నుండి తెలుసుకోవాలనుకునే మొట్టమొదటి విషయాలేమన్నాఉంటే, అవి ఖచ్చితంగా జీవితం మరియు కెరీర్ సంబంధించిన విజయావకాశాలు. తర్వాతే మిగిలినవిగా ఉంటాయి.
ఇక్కడ, మన హస్త సాముద్రిక నిపుణుని సహాయంతో, వారి అరచేతిని గమనించడం ద్వారా, ఒక వ్యక్తి యొక్క వృత్తిపరమైన వృద్ధి గురించిన వివరాలను తెలుసుకునే అవకాశాలు చూద్దాం. ముఖ్యంగా ఈ రేఖలు జీవితంలో వారు కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు చేసుకునేందుకు దోహదం చేస్తాయని చెప్పబడింది.

ఒక వ్యక్తి వారి వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి, మరియు సాధిస్తాడు అని బలంగా చెప్పడానికి వారి అరచేతులలో, కొన్ని సాధారణ చిహ్నాలు మరియు పంక్తులు సూచనలుగా ఉంటాయి. ఈ పంక్తులు వారి వ్యక్తిత్వానికి సరిపోయేలా వృత్తిపరమైన జీవితాన్ని కూడా అంచనా వేయగలవని చెప్పబడింది. జీవన రేఖ యొక్క శాఖలు వెళ్ళే మార్గాలను అనుసరించి, వృత్తిపరమైన సంస్థాగతా వివరాలను, విజయావకాశాలను తెలుసుకునే మార్గాల గురించిన వివరాలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి యొక్క, మంచి జీవన రేఖ (భవిష్య రేఖ అని కూడా వ్యవహరిస్తారు) మరియు ఒక సూర్యరేఖ, ఒక వ్యక్తి వృత్తిపరమైన నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్మడం జరిగింది.
క్రమంగా, జీవితంలో విజయాన్ని సాధించటానికి మీరు కోరుకునే వృత్తిపరమైన అంశాల గురించిన పూర్తి వివరాల కోసం ఈ వ్యాసం చదవండి.

జీవిత రేఖ యొక్క శాఖ బృహస్పతి శిఖరానికి వెళితే :
ఒక వ్యక్తి బృహస్పతి శిఖరం వైపునకు వెళుతున్న జీవిన రేఖ యొక్క శాఖను కలిగి ఉన్న ఎడల, ఆ వ్యక్తి గొప్ప నాయకత్వ లక్షణాలతో దీవించినట్లుగా నమ్మబడింది. వారు వృత్తి సంబంధిత ప్రయాణాలతో విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది కూడా, మరియు గొప్ప ఉపాధ్యాయులుగా లేదా కొందరికి మానసికంగా గురువులుగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు.

జీవిత రేఖ యొక్క శాఖ జెండా ఆకృతిలో ఉన్న ఎడల :
జీవన రేఖలోని ఒక విభాగం జెండా ఆకృతిలో ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఒక గొప్ప రచయితగా లేదా సంపాదకునిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరియు వారి రచనా నైపుణ్యాలు పుట్టుకతోనే ఇనుమడింపబడిన ప్రతిభను సూచిస్తుంది.

జీవన రేఖ శాఖలుగా ఉంటే :
జీవన రేఖ శాఖలుగా ఉన్న పక్షంలో, ఆ వ్యక్తులు కొంతమేర అదృష్టానికి దూరంగా ఉంటారని చెప్పబడుతుంది. ప్రయత్నం లేకుండా, విజయం అనేది వీరి విషయంలో కాస్త తక్కువనే చెప్పాలి. జీవితంలో విజయావకాశాలు అధికంగా 30 సంవత్సరాల వయసు తర్వాతనే అధికంగా ఉంటాయి. అప్పటి వరకు మీరు చేసే కష్టమే మీ విజయావకాశాలను సూచిస్తుంది.

జీవన రేఖ యొక్క శాఖ శని శిఖరాన్ని తాకుతున్న ఎడల :
జీవన రేఖలోని ఒక విభాగం శని శిఖరాన్ని తాకుతున్న ఎడల, ఆ వ్యక్తి, బొగ్గు, కాంట్రాక్టులు, యంత్రాలు, చమురు లేదా తోలు కర్మాగారానికి సంబంధించిన వ్యాపారాలలో విజయం సాధించగలడని సూచిస్తుంది.

జీవన రేఖ యొక్క శాఖ సూర్యుని శిఖరానికి వెళుతున్నట్లయితే :
జీవన రేఖలోని ఒక విభాగం సూర్యుని శిఖరానికి వెళుతున్నట్లయితే, ఆ వ్యక్తి వినోద రంగంలో గొప్ప కళాకారునిగా ఉంటాడని సూచిస్తుంది. అనగా సినిమాలు, మాజిక్స్, నాటకాలు మొదలైనవి. ఈ వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అత్యున్నత స్థానం లభిస్తుంది.

జీవన రేఖ యొక్క శాఖ బుధుని శిఖరానికి చేరుతుంటే :
జీవన రేఖలోని ఒక శాఖ బుధుని శిఖరానికి వెళుతున్నట్లైతే, అది వ్యక్తి యొక్క మేధస్సుకు చిహ్నంగా చెప్పబడుతుంది. క్రమంగా గణితంలో మరియు గణనల్లో గొప్ప నిష్ణాతులుగా ఉంటారని అర్ధం. వారు C.A, కమ్యూనికేషన్ మీడియా మరియు ఆడిటింగ్ విభాగాలలో కూడా విజయావకాశాలు అధికంగా కలవారిగా ఉంటారు.
హస్త సాముద్రిక శాస్త్రం పురాతన కాలం నుండి ఆచరిస్తున్న గొప్ప శాస్త్రంగా, నేటికి ఉత్తమ ఫలితాలను అందిస్తూ, ప్రజల మన్ననలను పొందుతూ ఉంది. వ్యక్తి జీవన విధానాలను మరికొంత అభివృద్ధి పధంలో నడిపేందుకు, మానసికంగా వారిలో చైతన్యాన్ని నింపేందుకు, జ్యోతిష్య శాస్త్రం వలెనే హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడింది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications