For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కు లేకుండా జన్మించిన ఈ బాలుడి నిజ జీవిత కథ మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ఒక బాలుడికి సంబంధించిన విభిన్నమైన నిజ జీవిత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తన స్వచ్ఛమైన చిరునవ్వుతో అందరిని ఆనందంగా ఉంచాలని భావించాడు. కల్మషం లేని మనస్సుతో ఎంతోమంది మనస్సు దోచిన ఈ విభిన్నమైన బాలుడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలి థాంసన్ ఫించ్ అనే బాలుడికి సంబంధించిన నిజ జీవిత కథ ఇది. దీనినే ముక్కులేని బాలుడు కథ అని కూడా అంటుంటారు.

మనం ఇప్పుడు ఈ వ్యాసంలో ఎలి థాంసన్ ఫించ్ జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎలా ఇతడు తాను ప్రేమించే వ్యక్తుల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చాడో మనం తెలుసుకుందాం.

He Was Born Without A Nose

అది ఎలా అంటే...

అతడి వైకల్యం ఒక ఆశ్చర్యం :

గర్భం దాల్చినప్పుడు జెరెమీ, సవతితల్లి అన్నమరీ, పుట్టిన పిల్లాడిని చూసి విపరీతంగా ఆశ్చర్యపోయారు. గర్భధారణ సమయంలో ఎటువంటి తప్పు జరిగిన ఆనవాళ్లు వారికీ ఎక్కడ కనిపించలేదు. కానీ, ఎలి జన్మించగానే, ఇంతకముందు ఎన్నడూ ఎవ్వరి దగ్గర చూడని ఒక వింత విషయాన్ని గుర్తించడం జరిగింది. అతడు ముక్కులేకుండా జన్మించాడు.

ఇతడు ఒక పరిణితి చెందని బాలుడు :

అలబామా ప్రాంతంలో 2015 మార్చి 4 వ తారీఖున ఇతడు జన్మించాడు. ఇతడికి జన్మనిచ్చిన తల్లి పేరు బ్రాండీ ఎంసీ గ్లాథేరీ. ఈమె గర్భం దాల్చిన ఎనిమిది నెలలకే ప్రసవించింది. అంటే దీనర్ధం ఎలి కేవలం ముక్కు లేకుండా మాత్రమే జన్మించలేదు. ఇతడు ఒక పరిణితి చెందని బిడ్డ కూడా.

ఇతడి పరిస్థితి ఏమిటంటే :

ఇతడి పరిస్థితిని ఆర్హిని అంటారు. అంటే దీనర్ధం ముక్కు లేకుండా జన్మించడం. ఎవరైనా ఇతడి ఫోటోలను చూస్తే అతడి ముఖానికి ఫోటో షాప్ చేసారా అని అనుకుంటారు. కానీ అవన్నీ నిజమైనవి మాత్రమే కాదు, అరుదైనవి కూడా. జన్మించే 200 మిలియన్ల పిల్లలలో ఏ ఒక్కరికో ఈ పరిస్థితి వస్తుందని వైద్యులు తెలియజేసారు. చరిత్ర మొత్తాన్ని గనుక తిరగేస్తే ఇటువంటి అరుదైన స్థితి కేవలం 44 సందర్భాల్లో మాత్రమే జరిగినట్లు గుర్తించారు.

ఇతడు ఒక నిజమైన పోరాట యోధుడు :

ఇతడు అంగవైకల్యంతో జన్మించినప్పటికీ, ముక్కు ద్వారా ఊపిరి తీసుకొనే సామర్థ్యం లేకపోయినప్పటికీ, ఇలా జన్మించిన పిల్లలు ఈ పరిస్థితి వల్ల కొన్ని రోజులు విపరీతంగా ఇబ్బంది పడతారని, అయితే ఈ సందర్భంలో ఎలి గొప్ప పోరాట స్ఫూర్తిని కనపరిచాడని వైద్యులు తెలిపారు. ఒక వైవిధ్యమైన ఫీడింగ్ ట్యూబ్ ని ఉపయోగించి అతడికి ఊపిరి అందించారు. కొద్దిరోజుల తర్వాత ఇతడు తనంతట తానుగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.

ఇతడు పెరగటం అంత సులువుగా ఏమి జరగలేదు :

ఎలి కి అమ్మ పాలు పట్టడం అసాధ్యం. అందుచేత వైద్యులు ఒక సాధారణ ట్యూబ్ ఫీడింగ్ పద్దతి ద్వారా ఇతడికి ఆహారాన్ని అందించేవారు. తనంతట తానుగా ఆహారం తీసుకొనే వరకు, ఈ పద్దతి ద్వారానే ఎలి కి ఆహారాన్ని అందించేవారు.

ఇతడు అత్యంత సంతోషకరమైన బిడ్డ :

ఎలి అత్యంత అరుదైన స్థితితో బాధపడుతున్నప్పటికీ, అతడు ఎప్పుడు గాని కలత చెందలేదు. మొదటిరోజు నుండి ఇతడు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. తనకి ఎదురైన ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలచుకున్నాడు. తాను ఉంటున్న పరిస్థితుల గురించి ఎప్పుడు గాని దిగులుచెందలేదు, ఫిర్యాదు చేయలేదు.

ఎలి ప్రతిరోజూ విపరీతంగా పోరాడేవాడు :

ఎలి ఎంతో ఆనందంగా ఉంటూ ప్రకాశాంతమైన చిరునవ్వుతో ఉన్నప్పటికీ, ఇతడు ప్రతిరోజూ బ్రతకడం కోసం విపరీతంగా పోరాడాల్సి వచ్చేది. అందుకు కారణం అతడికి వచ్చిన అంగవైకల్యం. జీవించాలి అనే అతడి బలమైన కారణం ముందు ఈ సమస్యలు అతడికి అవరోధాలను సృష్టించలేకపోయాయి, ఎదుగుదలను ఆపలేకపోయాయి.

మాట్లాడటంలో కూడా సమస్యలు ఎదుర్కొనే వాడు :

అతడికి పుట్టుకుతో వచ్చిన అంగవైకల్యంతో పాటు, ఎలి మాట్లాడే విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొనేవాడు . ఈ సమస్యలు అధిగమించడానికి తనకు తానుగా కొన్ని గుర్తులను ఉపయోగించి తాను ఏమి చెప్పదలిచాడు అనే విషయాన్ని ఇతరులకు చేరవేసేవాడు. ఇలా చేయడం వల్ల అతడు ఉన్న పిల్లల సంరక్షణ సంస్థలో విపరీతమైన గుర్తింపువచ్చింది . ఇతడి హావభావాలు మెచ్చి ఎలికి ఒక ప్రత్యేకమైన అవార్డుని కూడా బహుకరించారు ఆ సంస్థవారు.

కానీ, ఒకానొక రోజు :

ఈ బాలుడు తనకి ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలతో పోరాడుతూ ఒక పోరాటయోధుడిలా నిజమైన పోరాట స్ఫూర్తిని కనపరిచాడు. ఇలా ప్రతిరోజూ పోరాడుతున్న ఇతడు, ఒకానొక రోజు అనూహ్యంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. పాపం అతడి కష్టం విపరీతం అయిపోయినట్లుంది. సమస్యలు విపరీతంగా చుట్టుముట్టి భరించలేనివిగా మారటంతో తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

కానీ ఈ ప్రపంచం ఎప్పటికి గుర్తుపెట్టుకుంటుంది :

ఇతడి మరణం, ఇతడి కుటుంబానికి తీరని లోటుతో పాటు, విషాదాన్ని మిగిల్చింది. వీరందరూ తిరిగి సాధారణ జీవితాన్ని గడపటానికి ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఈ చిన్నపిల్లవాడు గురించి తెలిసిన వారందరూ, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇతడిని చూసి ఎవ్వరు కానీ ఇతడిని అంత సులువుగా మరచిపోలేరు. ఇతడు తన జీవితంలో తానూ ఎదుర్కొన్న సమస్యల పై చూపిన శౌర్యం మనందరికీ ఒక పాఠం. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఇతడి జీవిత పాఠాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇలాంటి ఆసక్తికరమైన కథలను మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.

English summary

He Was Born Without A Nose

He Was Born Without A Nose,This is the story of the boy who was born without a nose and yet managed to spread love and smiles as long as he lived around. Check out his heart-warming story…
Story first published:Wednesday, May 9, 2018, 11:56 [IST]
Desktop Bottom Promotion