ఆ రాశి వారు ఆర్థికంగా బలపడతారు.. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.. కష్టాలూ ఉంటాయి

Written By:
Subscribe to Boldsky

మేషరాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. కుజుడు ఈ రాశిలో ప్రధానంగా ఉంటాడు. దీంతో మేషరాశి వారు కాస్త కష్టపడితే విజయాలు సొంతం అవుతాయి. అలాగే మంచి ఖ్యాతి పొందడానికి వీలుంటుంది. అలాగే ఎక్కువ కృషి చేస్తే మేషరాశి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు.

మంచికాలమే

మంచికాలమే

కుజుడు ఈ రాశి నుంచి ధనస్సు రాశిలోకి వెళ్లిపోయిన తర్వాత కూడా మేషరాశికి మంచికాలమే ఉంటుంది. మేషరాశి వారికి ఈ ఏడాదంతా అంతా అదృష్టమే ఉంటుంది.

మంచి ఫలితాలు

మంచి ఫలితాలు

మేషరాశి వారు బిజినెస్ లలో, ఉద్యోగాలలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. అయితే మేషరాశి వారు ఎక్కువ డబ్బును ఖర్చు చేయకుండా అదుపులో ఉండాలి. ఎక్కువ ఖర్చులు కూడా చేయకుండా జాగ్రత్త పడాలి.

రెట్టింపు ఆదాయాలు

రెట్టింపు ఆదాయాలు

మేషరాశి వారు ఈ ఏడాదంతా వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులకు రెట్టింపు ఆదాయాలను చవిచూస్తారు. బృహస్పతి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల మేషరాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

ఖర్చులను అదుపులో పెట్టుకోండి

ఖర్చులను అదుపులో పెట్టుకోండి

మేషరాశి వారు ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్చులపై నియంత్రణ లేకుండా విపరీతంగా ఖర్చు చేస్తే చాలా రకాల ఇబ్బందులుపడాల్సి వస్తోంది.

ఏప్రిల్ నెల చాలా కీలకం

ఏప్రిల్ నెల చాలా కీలకం

మేషరాశికి వారు ఏప్రిల్ నెలలో కాస్త ఇబ్బందులుపడే అవకాశం ఉంది. వీరి జీవితం ఏప్రిల్ లో కాస్త అసంతృప్తికరంగా కొనసాగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా మేషరాశి వారు చాలా ఇబ్బందులుపడే అవకాశం ఉంది.

చాలా మంచి రోజులు

చాలా మంచి రోజులు

ఇక మేషరాశి వారికి చాలా మంచి రోజులు ముందున్నాయి.

బృహస్పతి జూలై 10 నుంచి మేషరాశికి అనుకూలంగా ఉంటుంది. దీంతో మేషరాశి వారికి అన్ని మంచి రోజులే ఉంటాయి.

కొత్త ఇల్లు

కొత్త ఇల్లు

మేషరాశి వారు కొత్త ఇల్లు, కొత్త వాహనం వంటివాటిని కూడా కొనే అవకాశం ఉంది. అయితే వీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.

అనుకోని సవాళ్లు

అనుకోని సవాళ్లు

అక్టోబర్ మధ్యలో బృహస్పతి వృశ్చికరాశిలోకి వెళ్లడం వల్ల మేషరాశి వారు మళ్లీ కష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.

కొన్నాళ్లు కష్టాలు.. కొన్నాళ్లు సుఖాలు

కొన్నాళ్లు కష్టాలు.. కొన్నాళ్లు సుఖాలు

మొత్తానికి మేషరాశి వారు ఈ ఏడాదంతా కొన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరొ కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉగాది పచ్చడిలోని తీపి, పులుపు, చేదు మాదిరిగా షడ్రుచులు కలిసినట్లుగా ఉంటుంది మేషరాశి వారి జీవితం.

English summary

finance predictions for aries 2018

finance predictions for aries 2018