For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టిన సమయం మీ వ్యక్తిత్వాన్ని సూచించగలదా ?

|

ప్రపంచ వ్యాప్తంగా అనేకులు తమ జీవన విధి విధానాలు రాశి చక్ర సంకేతాలతో ముడిపడి ఉన్నాయని భావిస్తుంటారు. క్రమంగా వారి దైనందిక కార్యక్రమాలలో, జీవన మార్గాలలోని ప్రతి అంశంలోనూ రాశి చక్రాల వివరాలను తనిఖీ చేసుకొని అడుగులు ముందుకు వేస్తుంటారు. క్రమంగా అద్భుతమైన ఫలితాలను సాధించిన వారిని మనం చూస్తూనే ఉంటాం.

ఇక్కడ ఈ వ్యాసంలో వ్యక్తి పుట్టిన సమయం కూడా ఎలా వ్యక్తిత్వాన్నివివరించగలదో చెప్పడం జరిగినది.

ఇక్కడ పొందుపరచబడిన అంశాలు మీ పుట్టిన సమయాన్ని ఆధారితంగా చేసుకొని, వ్యక్తిగా మీ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అంచనా వేయవచ్చో తెలియజేయగలవు.

పుట్టిన సమయం మరియు వ్యక్తిత్వ లక్షణాలు :

పుట్టిన సమయం మరియు వ్యక్తిత్వ లక్షణాలు :

అర్ధరాత్రి మరియు వేకువజామున 2 గంటల సమయం మధ్య పుట్టిన వారి వ్యక్తిత్వ లక్షణాలు :

వీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునుటకు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శించరు. తన స్వార్ధం తనదే అన్న విధానాన్ని కలిగి ఉంటారు. మరియు అన్నివేళలా తమకు సౌకర్యం కలిగేలా ప్రణాళికలు రచిస్తుంటారు. మరియు ఆర్థిక, వ్యాపార సంబంధిత విషయములలో ప్రణాళికాబద్ధంగా, పరిపక్వతతో నడుచుకుంటూ నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపిస్తుంటారు. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతని ఇచ్చే వీరు, భాగస్వామి ఆలోచనా విధానాలకు కూడా విలువనిస్తుంటారు. కానీ, తాను మరియు తన కుటుంబ పురోగతి అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది.

వేకువజామున 2 గంటలు మరియు 4 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

వేకువజామున 2 గంటలు మరియు 4 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

తమకు ఉన్న దానితో సంతృప్తి చెందే ఉత్తమమైన లక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులకు మరియు భాగస్వాములకు ప్రియమైన వారుగా ఉంటారు. భూత భవిష్యత్తు కాలాలతో సంబంధం లేకుండా వర్తమానంలో గడిపే అల్ప సంతోషులుగా ఉండే వీరు, ప్రతికూల సమస్యల నందు తెలివిగా వ్యవహరించగలిగిన వారై కుటుంబ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఉంటారు. తమ అంచనాలకు మించిన పనిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండప్పటికీ, పరిస్థితులు అనుకూలించక ఎదురీదాల్సిన సమయంలో అదరక బెదరక లక్ష్యం దిశగా ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. వస్తువులను కొనుగోలుచేసే విషయంలో, తమకు తమ ఇంటికి ఎంత మేర అవసరం అన్న ఆలోచనలు చేస్తూ, పొదుపుకి అధిక ప్రాధాన్యతని ఇచ్చే వ్యక్తులుగా కనిపిస్తుంటారు.

వేకువజామున 4 గంటలు మరియు 6 గంటల మధ్య సమయంలో పుట్టిన వారి వ్యక్తిత్వ లక్షణాలు :

వేకువజామున 4 గంటలు మరియు 6 గంటల మధ్య సమయంలో పుట్టిన వారి వ్యక్తిత్వ లక్షణాలు :

చుట్టూ ఉన్నవారు ఎటువంటి వ్యక్తులు అయినా, వీరి ఆలోచనలకు తగ్గట్లుగా వారి విధానాలను మార్చుకోగల శక్తి వీరి సొంతంగా ఉంటుంది. క్రమంగా ఇతరులు వీరి పట్ల ఆకర్షితులవడం లేదా వీరి వలే, విధానాలను తాము కూడా కలిగి ఉండాలనే ఆలోచనలు చేయడం పరిపాటిగా ఉంటుంది. కానీ మరోపక్క, సున్నితమైన మరియు భావోద్వేగాలతో కూడిన మానసిక స్థితితో ఉంటారు. కేవలం వీరు, విశ్వాసపాత్రులుగా ఉన్న వారితో మాత్రమే, లేదా భాగస్వామితో మాత్రమే తమ భావోద్వేగాలను పంచుకునేలా ఉంటారు.

ఉదయం 6 గంటలకు మరియు 8 గంటలకు మధ్య పుట్టిన వ్యక్తులు యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

ఉదయం 6 గంటలకు మరియు 8 గంటలకు మధ్య పుట్టిన వ్యక్తులు యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

వీరు తమ ఆలోచనా విధానాలకు తగినట్లుగానే చుట్టూ పరిసరాలు కూడా ఉండాలి అన్న ఆలోచనలు చేస్తుంటారు. క్రమంగా తమకు అనువుగా లేని చోట తన స్థానం లేదని భావిస్తూ ఉంటారు. తెలివితేటలకు, ఉత్తమ ప్రణాళికలకు వీరి మెదడు కేంద్ర స్థానంగా ఉంటుంది. ఎటువంటి‌ ప్రతికూల పరిస్థితులలోనైనా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, తాము జాగ్రత్త పడడమే కాకుండా, తన ప్రియమైన వారి యోగక్షేమాలు కూడా ఆలోచించే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కనబరుస్తుంటారు. క్రమంగా కుటుంబ సభ్యులకు, భాగస్వామికి ఇష్టులై ఉంటారు.

ఉదయం 8 గంటలకు మరియు 10 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

ఉదయం 8 గంటలకు మరియు 10 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

యుక్త వయసుని ఎక్కువగా సంతోషంగా గడపాలన్న ఆలోచనలు చేసే‌ ఆలోచనా ధోరణి వీరి సొంతం. వీరు తమ స్నేహితుల పట్ల అధిక నిబద్ధతను కనబరుస్తుంటారు. కానీ తమకు నిజమైన స్నేహితులు ఎవరు అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతుంటారు. క్రమంగా ఒక వయసుకు వచ్చిన తరువాత స్నేహితులంటే హేయభావాన్ని ప్రదర్శిస్తుంటారు. స్నేహితుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. తమ ఆలోచనా విధానాలను అర్థం చేసుకున్న భాగస్వామి కావాలని ఆశపడుతుంటారు. అలా దొరకని పక్షంలో తమ విధానాలను భాగస్వామితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. మరోపక్క, కష్ట జీవులుగా, పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు.

ఉదయం 10 మరియు మధ్యాహ్నం 12గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

ఉదయం 10 మరియు మధ్యాహ్నం 12గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

మానసిక ప్రశాంతతకు అధిక విలువనిచ్చే వీరు, కుటుంబ సభ్యుల, మరియు భాగస్వామి అభిప్రాయాలకు అధిక విలువనిస్తూ సమయానుసారం పరిస్థితులనుబట్టి ప్రణాళికలు రచిస్తుంటారు. ఏదిఏమైనా ఉత్తమ ఫలితాల సాధనే చివరి ధ్యేయముగా ఉంటుంది. విహారయాత్రలకు మరియు కుటుంబ సభ్యుల లేదా సన్నిహితులతో కాలక్షేపానికి అధిక సమయం కేటాయిస్తూ ఉంటారు. ప్రతికూల సమస్యల నందు ఫలితాల సాధనకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. పట్టుదలకు క్రమశిక్షణకు నియమ నిబద్ధతలకు కట్టుబడివుండే లక్షణాలు వీరి సొంతం.

మధ్యాహ్నం 12 గంటలు మరియు 2 గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు:

మధ్యాహ్నం 12 గంటలు మరియు 2 గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు:

మిగిలిన సమయాల వ్యక్తులతో పోల్చినప్పుడు వీరి ఆలోచనా విధానం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. భిన్న ఆలోచనలకు మరియు‌ చాకచక్య విథానాలకు పెట్టింది పేరుగా ఉంటారు. తమకు, తమ తెలివిని మరియు పనితనాన్ని నిరూపించుకోవడానికి అవకాశాన్నిచ్చిన వారిపట్ల అధిక నిబద్ధతను కలిగి, జీవితాంతం కృతజ్ఞులై ఉంటారు. ఇతరుల ఆలోచనలను గౌరవిస్తూ తమ నిర్ణయాల‌ పట్ల అవగాహన కలిగి, ఫలితాల సాధనకై‌ కృషి చేస్తుంటారు. వెన్నుపోటుదారులను, తమ ఆలోచనలను తస్కరించి తన ఆలోచనలుగా చెప్పుకొనే మోసగాళ్ళను ఎన్నటికీ క్షమించరు.

మధ్యాహ్నం 2 గంటలు మరియు 4 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు :

మధ్యాహ్నం 2 గంటలు మరియు 4 గంటల మధ్య సమయంలో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు :

అదృష్టాన్ని దేవుడిచ్చిన వరంగా కలిగి ఉండే వీరు, వీరు నచ్చిన జీవితాన్ని గడిపేలా దీవించబడుతారు. ఎటువంటి విషయాలలోనైనా ఆలోచనా విధానాలకు మరియు అనుభవానికి విలువనిస్తూ లక్ష్యసాధనలో ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేస్తుంటారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా యాదృచ్చికంగా సత్వర నిర్ణయాలను తెలివిగా తీసుకునే వీరు, కార్యాలయాలలో సాటి ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. వీరి ఆలోచనావిధానం కారణముగా, వీరి మాటకు మరియు నిర్ణయాలకు ఎక్కువ విలువ ఉంటుంది.

సాయంత్రం 6 గంటలు మరియు 8 గంటలకు మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

సాయంత్రం 6 గంటలు మరియు 8 గంటలకు మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

ప్రతి ఒక్కరు తమ లక్ష్యసాధనలో ఒక తోడ్పాటు ఉండాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు, ఆ తోడ్పాటు అందించే వ్యక్తి ఉత్తమమైన ఆలోచనలను మరియు తెలివితేటలను కలిగి సత్వర నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని పరోక్షంగా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యముగా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య పుట్టిన వ్యక్తులు ఈ కోవకు చెందిన వారై ఉంటారు. కష్టజీవిగా మరియు పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండే వీరు తమకు అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు ఆకలి, నిద్రను కూడా పక్కన పెట్టే వారిలా నిబద్ధతను ప్రదర్శిస్తుంటారు.

సాయంత్రం 8 గంటలకు మరియు 10 గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

సాయంత్రం 8 గంటలకు మరియు 10 గంటల మధ్య సమయం పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు :

భావోద్వేగాలకు ఉద్రేకాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే ఈ వ్యక్తులు కుటుంబ సభ్యులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు, వ్యాపార భాగస్వాములకు ఇష్టులై ఉంటారు. మరియు తన కుటుంబంలో వీరి కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ‌. ఇతరుల మనోభావాలను నొప్పించక, తన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా, ఎటువంటి పరిస్థితులలోనైనా ఒంటరి పోరాటం చేసే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇతరుల సంతోషాల కోసం తమ సంతోషాలను త్యాగం చేసే అద్భుతమైన వ్యక్తిత్వ పోకడలకు నిదర్శనంగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా మధ్యలో వదిలేయకుండా ఫలితాల సాధన కోసం నిరంతరం కష్టపడే నిబద్ధత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. మరియు ఫలితాల నందు ఎటువంటి లోపము కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరి ఆలోచనావిధానాలు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

రాత్రి 10 గంటలు మరియు 12 గంటల మధ్య పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు:

రాత్రి 10 గంటలు మరియు 12 గంటల మధ్య పుట్టిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు:

అధిక మేథోసంపత్తికి ఉన్నతమైన ఆలోచనా విధానాలకు, ప్రణాళికాబద్ధమైన జీవన విధానాలకు ఆదర్శప్రాయంగా కనిపించే వీరు, ముక్కుసూటి తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు కూడా. ఎటువంటి క్లిష్టమైన సందర్భాలలోనైనా, ఇరువర్గాల మాటలను పరిగణలోనికి తీసుకుని నిజనిజాలను నిర్ధారణ గావించి న్యాయ విచారణ చేపట్టగల తెలివితేటలు వీరి సొంతం. క్రమంగా వీరి తెలివితేటలు సంఘంలో గౌరవ ప్రతిష్టలను తెచ్చిపెడుతాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు ఎటువంటి పరిస్థితులలోనైనా నిర్ణయాలు తీసుకునే ముందు వీరిని సంప్రదించడం పరిపాటిగా ఉంటుంది. వీరు కూడా అంతే బాధ్యతను మరియు నిబద్ధతను ప్రదర్శించి ప్రతికూల పరిస్థితులయందు ఫలితాల సాధనకై, పరిష్కారపూరిత ఆలోచనలు చేయగల సామర్థ్యం కలిగిన వారిగా ఉంటారు. ఆశావాద దృక్పథాన్ని కలిగి ఫలితాల సాధనలో వెనుకకు అడుగు వేయక ముందుకు సాగే తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు.

 ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How Does Your Birth Time Reveal About Your Personality

According to astrology even the minute and the second matter when it is all about defining the personality of a person. It is believed that an individual's birth time influences their character to a lot extent. For example, individuals born at 2 am are found to keep to themselves, and their comfort zone is wherever their closest friends and family are.
Story first published: Wednesday, August 1, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more