For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలాంటి ఆడవారు మగవారిని పిల్లలు కనేవరకే యూజ్ చేసుకుంటారా, తర్వాత మొగుడితో పని లేదంటారా? #mystory377

ఇక నాలాంటి ఫెమినిస్ట్ లు మగవారిని పిల్లలు కనేవరకే యూజ్ చేసుకుంటారని ఒన్స్ పిల్లలు పుట్టాక మొగుడితో పని లేదనట్లు బిహేవ్ చేస్తారని కూడా విమర్శిస్తుంటారు. ఈ విమర్శలన్నీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా స్న

|

నాది ముంబై. నేను విమెన్ స్టడీస్ లో పీజీ చేశాను. తర్వాత మహిళలకు సంబంధించిన సమస్యలపై పోరాడే ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. దాని ద్వారా మహిళలు ఎదుర్కొనే సమస్యలపై పోరాడుతూ ఉంటాను.

మహిళకు సంబంధించి నేను చాలా విషయాలు గమనించాను. అందులో కొన్నింటిపై నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. అలా అని అందరూ నా ఒపీనియన్ ను గౌరవించాలనీ నేను కోరుకోవడం లేదు.

మగవారి ఆలోచన తీరు మారాలి

మగవారి ఆలోచన తీరు మారాలి

ఆడవారిని మగవారు చాలా విషయాల్లో ఇబ్బందులుపెడుతూనే ఉన్నారు. ఈ వ్యవస్థ మారాలి. చాలా మంది ఆడవారు కూడా మగవారికి చాలా విలువ ఇస్తారు. కానీ ఆడవారిపై మాత్రం దాదాపు తొంభైశాతం మగవారికి ఇప్పటికీ చిన్నచూపే ఉంది. ఈ విధానం మారాలి. మగవారి ఆలోచన తీరు మారాలి.

మగవారు హరించేస్తున్నారు

మగవారు హరించేస్తున్నారు

కొందరు మహిళలు చేసే కొన్ని రకాల తప్పులకు స్త్రీ జాతినంతా తప్పుపట్టడం సరికాదు. చాలా మంది ఆడవారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వారి స్వేచ్ఛను మగవారు హరించేస్తున్నారు.

అడియాసలు చేస్తున్నారు

అడియాసలు చేస్తున్నారు

చిన్నప్పటి నుంచి ఎన్నో కలలతో చదువుకుంటారు అమ్మాయిలు. మంచిమంచి ర్యాంకులు సాధిస్తారు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలని కలలకంటారు. కానీ పెళ్లయిన తర్వాత కొందరు భర్తలు వారి ఆశలన్నీ అడియాసలు చేస్తున్నారు.

వంటింటికి పరిమితం చేస్తున్నారు

వంటింటికి పరిమితం చేస్తున్నారు

నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదంటూ అమ్మాయిలను వంటింటికి పరిమితం చేస్తున్నారు. వాళ్ల టాలెంట్ ను మొత్తం తొక్కేస్తున్నారు. అందరూ అలాగే ఉన్నారని నేను చెప్పను.

Mystroy :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరిMystroy :సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు పోలీస్ రాత్రి బాగా గడిపి ఉదయం ఇష్టానుసారంగా కొట్టాడు : నళినీ జమీలాస్టోరి

భార్యల్ని చదివిస్తున్నారు

భార్యల్ని చదివిస్తున్నారు

కానీ కొందరు మగవారు పెళ్లయిన తర్వాత కూడా భార్యల్ని చదివిస్తున్నారు. వారి ఆసక్తులకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నారు. అలాంటి మగవారు కూడా ఈ సమాజంలో ఉన్నారు.

లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంటారు

లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంటారు

ఇక ఆడవారంతా మంచి వాళ్లని కూడా నేను అనడం లేదు. కొందరు ఆడవారు కూడా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంటారు. వారికి దొరికిన స్వేచ్ఛను ఇష్టానుసారంగా వినియోగించుకుంటూ ఉంటారు.

కోరుకున్న మగాడు దొరకగానే

కోరుకున్న మగాడు దొరకగానే

మరికొందరేమ ఫెమినిస్ట్ లను తప్పుపడుతూ ట్వీట్స్ చేస్తుంటారు. పిల్లల్ని కనడానికే ఆడవారికి మగవారు పనికివస్తారని ఫెమినిస్ట్ లు భావిస్తున్నారని వారి అభిప్రాయం. ఫెమినిస్ట్ లు వారు కోరుకున్న మగాడు దొరకగానే తమ సిద్దాంతాలన్నింటినీ పక్కన పెట్టేస్తారని అనుకుంటారు.

పెళ్లి కానంత వరకు మగాళ్లను రోజూ విమర్శిస్తూ

పెళ్లి కానంత వరకు మగాళ్లను రోజూ విమర్శిస్తూ

అంతవరకు ఆడవారి కోసం పాటుపడే మహిళ మగాణ్ని పెళ్లి చేసుకుని అతను చెప్పినట్టు వింటుందని అనుకుంటారు. తమ మహిళావాదాన్ని పక్కన పెట్టేస్తారనుకుంటారు. పెళ్లి కానంత వరకు మగాళ్లను రోజూ విమర్శిస్తూ.. పెళ్లి అయిన వెంటనే మెట్టినింటి ఆచారాలను పాటిస్తూ అతను చెప్పినట్లే వింటారని అనుకుంటారు.

Most Read :అతనికి నాపై ఆ ఉద్దేశమే లేదు, నేనే కమిట్ అయ్యా, నోరు తెరిచి అడిగాను #mystory375Most Read :అతనికి నాపై ఆ ఉద్దేశమే లేదు, నేనే కమిట్ అయ్యా, నోరు తెరిచి అడిగాను #mystory375

ఒన్స్ పిల్లలు పుట్టాక మొగుడితో పని లేదనట్లు..

ఒన్స్ పిల్లలు పుట్టాక మొగుడితో పని లేదనట్లు..

ఇక నాలాంటి ఫెమినిస్ట్ లు మగవారిని పిల్లలు కనేవరకే యూజ్ చేసుకుంటారని ఒన్స్ పిల్లలు పుట్టాక మొగుడితో పని లేదనట్లు బిహేవ్ చేస్తారని కూడా విమర్శిస్తుంటారు. ఈ విమర్శలన్నీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా స్నేహితురాళ్లే చేశారు.

ఫీలింగ్స్, కోరికలు ఉంటాయి కదా

ఫీలింగ్స్, కోరికలు ఉంటాయి కదా

నేను ఎంత ఫెమినిస్ట్ అయినంత మాత్రానా నాకు కూడా కొన్ని ఫీలింగ్స్, కోరికలు ఉంటాయి కదా. నేనేమీ యంత్రాన్ని కాదు కదా. నేను పెళ్లి చేసుకుంటే తప్పుపట్టడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.

పర్సనల్ లైఫ్ ఉండకూడదా?

పర్సనల్ లైఫ్ ఉండకూడదా?

మహిళల బాగుండాలని కోరుకున్న వారంతా పెళ్లే చేసుకోకూడదా? ఏం మాకు పర్సనల్ లైఫ్ ఉండకూడదా? అమ్మాయిల హక్కుల కోసం నేను గొంతెత్తి మాట్లాడితే అమ్మాయిలే నన్ను అలా అనడం సరికాదు.

ఎదగాలన్నా.. ఒదగాలన్నా

ఎదగాలన్నా.. ఒదగాలన్నా

ఒక ఫెమినిస్ట్ గా నేను ఎప్పుడూ ఆడవారి శ్రేయస్సే కోరుకుంటాను. ఆడది ఎదగాలన్నా.. ఒదగాలన్నా.. తన ప్రతిభను ప్రపంచమంతా చాటాలన్నా.. స్వేచ్ఛగా బతకాలన్నా, అదుపులో ఉండాలన్నా మగాడి అండ కావాల్సిందేనని నమ్ముతున్నాను.

Most Read :పడుకుందామంటే ఎక్కడా చోటు దొరకలేదు, అతన్ని కాస్త పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశా #mystory374Most Read :పడుకుందామంటే ఎక్కడా చోటు దొరకలేదు, అతన్ని కాస్త పక్కకి రమ్మని కళ్లతోనే సైగలు చేశా #mystory374

భర్తతో కాపురం చేసినంత మాత్రానా

భర్తతో కాపురం చేసినంత మాత్రానా

అందుకే మగాళ్లంతా ఆడవారి అభిప్రాయాలను గౌరవించండి. వారిని ఎదగనీయండి. అలాగే ఆడవారు కూడా మీకోసం పోరాడే మహిళల్ని విమర్శించకండి. పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసినంత మాత్రానా ఆడవారి సమస్యల్ని పట్టించుకోకుండా పోము.

English summary

i am a feminist but I have personal life

i am a feminist but I have personal life
Desktop Bottom Promotion