For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకవేళ మీరు పచ్చ (మరకతం) ధరిస్తే.. !

ఒకవేళ మీరు పచ్చ (మరకతం) ధరిస్తే.. !

|

మనం తరచుగా జ్యోతిష్య శాస్త్ర పండితులను, మన రాశి ప్రకారం ఏ రత్నం ధరిస్తే విజయాలకు అనువుగా, కుటుంబ సంతోషాలకు , ఆర్ధిక పరిస్థితులు మెరుగవ్వడానికి అనుకూలంగా ఉంటుంది అని అడుగుతూ ఉంటాము. గ్రహ దోషాల వలన ఏర్పడిన ప్రతికూల ప్రభావిత అంశాలను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే రత్నాలను ఆశ్రయించవలసి ఉంటుంది.

ఇలాంటి అంశాలను పక్కన పెట్టి, గ్రహదోషాలకు, రాశులకు అతీతంగా రత్నాలు ధరించడం వలన అనేక ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. కావున రత్నాల గురించిన సరైన అవగాహన ఉన్న వ్యక్తిని సంప్రదించి , ఆ క్రమంలోనే రత్నాలను ధరించే ఆలోచనలు చేయడం మంచిది. తద్వారా మీకొక మంచి భవిష్యత్తుకు పునాది పడగలదు.

Know If You Can Wear An Emerald

ఇప్పుడు, ఇక్కడ పచ్చను గురించిన వివరాలను అందివ్వబోతున్నాము.

ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ మరకతం మీకు సరైనదేనా ? అవగాహన కోసం చదవండి.

బుధ గ్రహం మిగిలిన అన్ని గ్రహాల్లోనూ రాజులా కీర్తిoపబడుతుంది. ఆ క్రమంలో భాగంగా ఈ మరకతం బుధ గ్రహం యొక్క సానుకూల దృక్పధాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది.

మేషం :

మేషం :

మేష రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు). కానీ బుధ గ్రహం కుజ గ్రహానికి స్నేహితుడు కాదు. కావున జన్మకుండలిని చూడకుండా, అవగాహన లేకుండా మేష రాశి వారు పచ్చను ధరించరాదని చెప్పబడింది.

 వృషభo :

వృషభo :

బుధగ్రహం వృషభ రాశి వారికి ప్రధాన గ్రహం. వీరు పచ్చను ధరించడం మూలంగా ఆర్ధికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సంబంధాలలో, మరియు వ్యాపార సంబంధ విషయాల్లో అనేక సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మరియు సమాజంలో మంచి పేరు, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ బుధ గ్రహం 1,2,5,9 మరియు 10 వ స్థానాలలో ఉన్న ఎడల అన్నిటా విజయం వీరి సొంతం.

మిధునం :

మిధునం :

మిధున రాశి అధిపతి బుధ గ్రహం, తద్వారా పచ్చ రాయి ధరించడం వలన అనేక సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మిధున రాశి వారికి, ఆత్మ స్థైర్యం, పెంపొందించడంలో మాత్రమే కాకుండా, ఆరోగ్య, ఆర్ధిక సంబంధిత అంశాలలో అన్నిటా సానుకూల ఫలితాలను పొందగలరు. ముఖ్యంగా బుధ గ్రహం 1,4,5,9 మరియు 11 వ స్థానాలలో ఉన్న ఎడల అద్భుతమైన విజయాలు మీ సొంతం.

కర్కాటకం :

కర్కాటకం :

కర్కాటక రాశి వారికి పచ్చ అంత మంచిది కాదు. బుధ గ్రహం వీరి జన్మ కుండలిలో ఉన్న గృహాన్ని అనుసరించి జ్యోతిష్య శాస్త్రజ్ఞులు సూచించిన సమయంలోనే పచ్చ రాయిని ధరించవలసి ఉంటుంది. ముఖ్యంగా బుధ గ్రహం ౩, 4, 7, మరియు 11 వ స్థానాలలో ఉన్నప్పుడు పచ్చ రాయిని ధరించడం మేలు.

సింహం :

సింహం :

సింహ రాశి వారికి పచ్చ ఎంతో అనుకూలమైన రత్నంగా చెప్పబడినది. ఆర్ధికపరమైన సమస్యలు లేకుండా చూచుటలో కీలకపాత్ర పోషిస్తుంది. కానీ బుధ గ్రహం 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు పచ్చ రాయిని ధరించుట మూలంగా అనేక సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నవి.

కన్య :

కన్య :

కన్య రాశి వారికి పచ్చ రాయి సూచించదగినది. వీరి జీవితంలో అదృష్టాలను తెచ్చే రాత్నంగా చెప్పబడుతున్నది. దీనికి కారణం కన్య రాశి బుధగ్రహం కనుసన్నల్లో ఉండడమే. తద్వారా కన్యా రాశి పై నియంత్రణా అధికారాలను కలిగి ఉంటాడు.

తుల :

తుల :

తులా రాశి వారికి కూడా పచ్చ అనేక మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడినది. ముఖ్యంగా ఈ రాశిలో బుధ గ్రహం 12 వ గృహంలో ఉండడం వలన, అనేక సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నవి. ఒకవేళ ఈ రాశి వారు, వర్తక వ్యాపారాలు చేస్తున్న ఎడల , మరియు 12 వ గృహంలో బుధుడు కొలువు తీరి ఉన్న ఎడల, మూడురోజులు మాత్రమే ధరించవలసి ఉంటుంది. మిగిలిన సమయాలలో శాశ్వతంగా ధరించవచ్చు అని చెప్పబడినది.

వృశ్చికం :

వృశ్చికం :

ఈ రాశి వారు బుధ గ్రహం అధిపతిగా ఉన్న రోజుల్లో ఈ పచ్చను ధరించవచ్చు. కానీ బుధ గ్రహం కుజునితో సన్నిహిత సంబంధాలను కలిగిలేని కారణంగా మిగిలిన రోజులు ధరించకపోవడమే మంచిది . వృశ్చిక రాశి వారికి ప్రధాన అధిపతి కుజుడుగా ఉండడమే దీనికి కారణం. కావున జ్యోతిష్యుని అనుసరించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

ధనుస్సు :

ధనుస్సు :

బుధ గ్రహం 1, 7, 9, 11 స్థానాలలో ఉన్న ఎడల నిర్భయంగా పచ్చను ధరించే వీలు ఉంది. మరియు బుధ గ్రహ అధిపతిగా ఉన్న రోజుల్లో కూడా ధరించవచ్చు. మిగిలిన సమయాల్లో మాత్రం జ్యోతిష్యుని సూచనలు పాటించడం మంచిది . లేనిచో ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

మకరం :

మకరం :

జన్మ కుండలి లో బుధ గ్రహం 1, 2, 5, 9, 10, గృహాలలో ఉన్న పక్షంలో పచ్చను ధరించే వీలుంది . తద్వారా అనేక సానుకూల ఫలితాలను పొందవచ్చు. తద్వారా, మానసిక ప్రశాంతత, నిలకడ స్వభావం పెంపొందుతుంది. ఆర్ధికంగా పురోగతిని కూడా చూడగలరు.

కుంభం :

కుంభం :

వీరి జన్మ కుండలి ప్రకారం, బుధ గ్రహం 1, 4, 5, 9 గృహాలలో ఉన్న ఎడల పచ్చ రాయిని ధరించడం అన్ని విధాలా మేలు చేకూరుస్తుంది. సమాజంలో సంబంధాలు మెరుగుపడడంలో, తెలివి తేటలు పెరగడం లో, వర్తక వాణిజ్య వ్యాపారాల యందు ఫలితాలను పొందడంలో పచ్చ రాయిని ధరించుట వలన అనేక సానుకూల ఫలితాలను పొందవచ్చు.

మీనం :

మీనం :

వీరి జన్మ కుండలి ప్రకారం బుధ గ్రహం 4, 7, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు మాత్రమే ధరించవలసి ఉంటుంది. ఈ సమయాలను జ్యోతిష్యులు లెక్కగట్టి చెప్తారు. తద్వారా అనేక సానుకూల ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా వీరి ఆలోచనలకు అనుగుణంగా చుట్టుపక్కల పరిస్థితులు మారుతాయి. తద్వారా మానసిక స్వావలంబన పొందుతారు.

English summary

Know If You Can Wear An Emerald

Wearing it attracts ,fast career growth, good health and respect in the society.Those who have Mercury or the friends of Mercury as ruling planet of Sun Sign, can wear it for lifetime. However, if the ruling planet does not have a compatibility with Mercury, then the gemstone can be worn only during major phase of Mercury in the birthchart.
Desktop Bottom Promotion